చార్జీల పెంపు తప్పదు: ట్రాన్స్‌కో | Power charges must be hiked: Transco office | Sakshi
Sakshi News home page

చార్జీల పెంపు తప్పదు: ట్రాన్స్‌కో

Published Wed, Jan 22 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

Power charges must be hiked: Transco office

సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని మించి వ్యయమవుతోందని, విద్యుత్ చార్జీలను పెంచక తప్పదని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన వ్యయంలో పెరుగుదల, 2014 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేపట్టాల్సి ఉండటం, పెరిగిన నిర్వహణ ఖర్చులను కారణంగా చూపుతూ.. చార్జీల పెంపు ప్రతిపాదనలను ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ముందుంచారు. 2014-19 వరకు బహుళ సంవత్సర టారిఫ్‌లో భాగంగా విద్యుత్‌సరఫరా, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) నిర్వహణపై ట్రాన్స్‌కో సమర్పించిన ప్రతిపాదనలపై ఈఆర్‌సీ మంగళవారం బహిరంగ విచారణను చేపట్టింది. ట్రాన్స్‌కో వాదనను విచారణలో పాల్గొన్న విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ నేతలు, పరిశ్రమల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి వాదనలు..
 
 -    ‘రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రం కలిసి ఉంటుందా? విడిపోతుందా? తెలియని పరిస్థితి. రాష్ట్రం కలిసి ఉంటుందనే ఆలోచనతో విచారణ జరుపుతున్నారు. విభజన జరిగితే ఎలా అనేది కూడా ఆలోచించాలి. ఇవి 5 సంవత్సరాల చార్జీల ప్రతిపాదనలు కాబట్టి వీటిపై విచారణ ఇప్పుడు వద్దు. ప్రతీ ఏటా డిస్కంలలాగా ట్రాన్స్‌కో కూడా ప్రతిపాదనలు ఇవ్వాలి. విద్యుత్ సరఫరా నష్టాలు 2009-10లో 4.2 శాతమని పేర్కొన్న ట్రాన్స్‌కో 2013-14 నాటికి 3.89 తగ్గిస్తామంది. అయితే, 2014-15లో సరఫరా నష్టాలు 4.15 శాతం ఉంటాయని ఇప్పుడంటోంది. సరఫరా నష్టాలను తగ్గించడంలో ట్రాన్స్‌కో విఫలమైనట్టు దీంతో స్పష్టమౌతోంది’
 
 - విద్యుత్‌రంగ నిపుణుడు వేణుగోపాల్‌రావు
-    ‘ఈ ప్రతిపాదనలపై ఐదేళ్ల వరకు కాకుండా... విభజన జరిగే వరకూ అనే షరతుతో విచారణ జరపాలి’
 - న్యూ డెమోక్రసీ నేత గాదె దివాకర్
 -    ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనల్లో అవకతవకలు కనిపిస్తున్నాయి. ఆడిట్ అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’
 - ఫ్యాప్సీ ప్రతినిధి అనిల్ రెడ్డి
 -    ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనలపై డిస్కంలు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు. ట్రాన్స్‌కో, డిస్కంలు కుమ్మక్కయ్యాయా?  సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంలో పారదర్శకత పాటించడం లేదు’
 - విద్యుత్ రంగ నిపుణుడు తిమ్మారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement