power charges hike
-
/telugu-news/andhra-pradesh/liveblog/ysrcp-protests-against-power-charges-hike-ap-2306760
-
విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట
కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట.. ప్రజలకు అండగా నిలుస్తూ.. -
‘విద్యుత్ చార్జీల పెంపుపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టండి’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని(power tariff hike) మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను విధించడం దుర్మార్గమని అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి రాగానే ఏకంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారంను విధించడం దారుణం. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలి. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించాలి. అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. ‘విద్యుత్ చార్జీల పెంపుదల అన్ని వర్గాలపై ఆర్థికంగా భారంను మోపుతోంది. అయా వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వారంతా వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ కార్యక్రమం ద్వారా పాలకులకు అర్థం కావాలి. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని సూచించారు.‘పార్టీ శ్రేణులు, గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి. ఇందుకోసం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం ద్వారానే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రజలకు వైఎస్సార్సీపీ(YSRCP కష్ట సమయంలో అండగా ఉంది అనే సంకేతాలను పంపాలి. అలాగే తాజాగా వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ నేతలు రైతులను కలుసుకోవాలి. వారికి వచ్చిన కష్టంలో అండగా ఉంటామనే భరోసాను అందించాలి’ అని పిలుపునిచ్చారు. -
బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. కొండనాలిక మందేస్తే ఉన్న ఉన్న నాలుక ఊడినట్లు ప్రజల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకోం. ప్రజల తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం దుర్మార్గం. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు కరెంట్ చార్జీల పేరుతో రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారు’ అని మండిపడ్డారు. -
బాబు.. బాదుడే.. బాదుడు.. ఒకవైపు అప్పులు.. మరోవైపు విద్యుత్ చార్జీల పెంపు
-
AP: బాదుడే.. బాదుడు.. ఇప్పుడు రూ. 9,412 కోట్లు
సాక్షి, అమరావతి/కర్నూలు న్యూసిటీ: కూటమి పాలనలో ప్రజలపై రెండో సారి భారీ విద్యుత్ చార్జీల భారం పడింది. రూ.9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్‌కు రూ.0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది. డిసెంబర్ వినియోగం నుంచే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ చార్జీలు వసూలు చేస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకే రాష్ట్ర ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. ఈ చార్జీలను యూనిట్‌కు రూ.1.27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా చార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్‌కు రూ.2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన రూ.6.072.86 కోట్లు, తాజాగా వసూలు చేస్తున్న రూ.9,412.50 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల భారం ప్రజలపై మోపింది. రూ.0.92 వరకూ అదనం 2023–24 సంవత్సరానికి రూ.12,844.88 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు డిస్కంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో రూ.3,432.38 కోట్లు తగ్గించి, రూ.9,412.50 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు దాదాపు రూ.0.91, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.0.92, ఏపీఈపీడీసీఎల్‌లో పరిధిలో రూ.0.90 చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకోమని డిస్కంలకు ఏపీఈఆర్సీ చెప్పింది. మాట మార్చడం.. మాట తప్పడమే బాబు నైజం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవలి ఎన్నికల్లో ఆయనిచ్చిన సూపర్ సిక్స్ హామీలు, కరెంటు చార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగులో తొక్కేసి ఆయన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకొని గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందంటూ అబద్ధాలాడేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఐదు నెలలు తిరక్కుండానే చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పాను’ అంటూ నాలుక మడతెట్టేశారు. విద్యుత్ చార్జీలపై బాబు వంచనకు మచ్చు తునకలు కొన్ని.. 19 మార్చి 2019, కడప : కరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలూ ఇస్తున్నాం. భవిష్యత్‌లో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 27 మే 2020, టీడీపీ మహానాడు : కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే.. మీరు (జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. 10 ఆగస్ట్ 2022, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించే వాళ్లం. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. 16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం : తమ్ముళ్లూ.. ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా? ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడైనా కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2 ఆగస్ట్, 2023, పులివెందుల : కరెంట్ చార్జీలను పెంచను.. తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. వినూత్న ఆలోచనతో 2000లో కరెంట్ సంస్కరణలు తెచ్చి 2004కు మిగులు విద్యుత్ తెచ్చా. ఎండతో కరెంటు వస్తుంది. సోలార్ నేనే తీసుకొచ్చా. రూ.14 ఉండే కరెంటు రూ.2కు వచ్చి0ది. ఎండతో, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రూ.2 నుంచి రూ.3కే కరెంట్ వస్తుంది. రానున్న ఐదేళ్లలో కరెంట్ చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తెస్తా. గ్రిడ్‌కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. 16 ఆగస్ట్ 2023, విజన్ డాక్యుమెంట్ విడుదల, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తి విధానాలతో యూనిట్ ధర రూ.8 నుంచి రూ.2కు పడిపోయింది. హైడ్రోజన్, అమ్మోనియా హబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. 4 మార్చి 2024, పెనుగొండ : ఎవరి మార్కు ఎంత అని అడుగుతున్నాడు.. నేను చెబుతున్నా జగన్.. నీ మార్కు తెలుసుకో. రూ.200 ఉండే కరెంటు బిల్లు రూ.800 చేయడం నీ మార్కు. కరెంటు చార్జీల బాదుడు నీ మార్కు. నేడు ఏఆర్ఆర్ సమర్పించనున్న డిస్కంలు 2025–26 సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్, రిటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) శనివారం ఏపీఈఆర్సీకి సమర్పించనున్నాయి. తమ పరిధిలోని నివేదికలతో డిస్కంల సీఎండీలు ఏపీఈఆర్సీ ముందు హాజరుకానున్నారు. -
కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా?: వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచి మాట తప్పడమే మీ (చంద్రబాబు) నైజమని మరోసారి రుజువు చేశారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేయడం మానండి. విద్యుత్ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు చార్జీలు పెంచడమేనా..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది చంద్రబాబూ? అంటూ సూటిగా ప్రశ్నించారు.‘టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ఎందుకు పెడచెవిన పెట్టారు? ప్రజలపై అదనపు చార్జీల భారం వేయడమే మీ విజనా?’ అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీరు తప్పు చేసి మాపై నిందలా?⇒ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోపే వినియోగదారులపై ఎఫ్‌పీసీసీఏ చార్జీల భారం రూ.6,072.86 కోట్లు మోపింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సిగ్గు లేకుండా వదిలేసి ఎఫ్‌పీసీసీఏ చార్జీల పేరిట వసూలు చేస్తున్నప్పటికీ.. అవి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్యకలాపాలకు సంబంధించిన చార్జీలంటూ మా ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రయత్నించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వమే ఈ చార్జీలు భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఏపీఈఆర్సీ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజులపాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసినా కూటమి ప్రభుత్వం చార్జీలు భరించేందుకు ముందుకు రాలేదంటే అర్థం ఏమిటి? ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానానికి అర్థమేమిటి బాబూ?⇒ ప్రజలపై చార్జీల భారం వేయాలన్నదే మీ ఉద్దేశమని ఇక్కడ స్పష్టమైంది. గతంలోనూ ఇలాగే చార్జీలు పెంచి, ఇదేమి న్యాయం అని అడిగిన ప్రజలను బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి.. తుపాకీలతో కాల్పించి చంపించిన చరిత్ర మీదే. ఇప్పటికైనా విద్యుత్ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు.ఆ రోజే డిస్కంలను అప్పులపాలు చేశారు⇒ గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పులపాలు చేశారు. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది.⇒ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. 2016–18లో 78 యూనిట్లకు రూ.145.30 నుంచి రూ.202.80 అంటే 39.57 శాతం, 80 యూనిట్లకు రూ.150.50 నుంచి రూ.208 అంటే రూ.38.21 శాతం పెంచేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారని మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.⇒ 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉండగా.. విద్యుత్ శాఖను అసమర్థంగా నిర్వహించిన కారణంగా డిస్కంలకు సంచిత నష్టాలు రూ.22,089 కోట్లు వచ్చాయి. అప్పటికే ఉన్న రూ.6,625 కోట్ల నష్టాలతో కలుపుకుని మొత్తంగా రూ.28,715 కోట్లకు నష్టాలు పెరిగాయి. డిస్కంల సంచిత నష్టాలు 4.35 శాతం రెట్లు పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ రంగ సంస్థలపై అప్పులతోపాటు బకాయిల భారం 2014లో రూ.29,552 కోట్లు ఉండగా, అది 2019లో రూ.86,215 కోట్లకు చేరింది.⇒ టీడీపీ ప్రభుత్వం కాలానుగుణంగా ట్రూ అప్ పిటిషన్లను ఏపీఈఆర్సీకి దాఖలు చేయాలి. కానీ అలా చేయలేదు. అందువల్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు టీడీపీ సర్కార్ హయాం నాటి ట్రూ అప్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. అయితే ఆ భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపకుండా అతి తక్కువ భారం పడేలా చేసింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ట్రూఅప్, ఎఫ్‌పీసీసీఏ తదితర కొత్త పేర్లతో ప్రజలపై భారం మోపి కష్టాలపాలు చేస్తోందంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు నానా రాద్ధాంతం చేశాయి. -
దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా?.వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : ‘కరెంట్ చార్జీలు పెంచడమేనా, ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక’ అంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ‘కరెంట్ ఛార్జీలు పెంచడమేనా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక.. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో మీరిచ్చిన హామీ ఏమైంది చంద్రబాబు? టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్తు ఛార్జీలను తగ్గించే వాళ్లం అని చెప్పిన మీరు ప్రజలు ఎంత వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా చంద్రబాబూ? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు, ఈ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది. ప్రజలపై అదనపు ఛార్జీలను వేయడమేనా మీ విజన్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచి మాట తప్పడమే మీ నైజమని మరోసారి రుజువు చేశారు.’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు ఛార్జీలు పెంచడమేనా @ncbn pic.twitter.com/cDwrehq2N3— YS Jagan Mohan Reddy (@ysjagan) October 27, 2024 -
పొంగులేటి.. బాంబులు అంటే ఈడీ సోదాల గురించేనా?: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో కేసీఆర్ పాలన విద్యుత్ రంగానికి స్వర్ణయుగమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందనా కేటీఆర్ తెలిపారు. అలాగే, ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ..‘2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో పారిశ్రామికవేత్తలు పవర్ హాలీడే వద్దని రోడ్డెక్కారు. నేతన్నలు పవర్ లేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ మళ్లీ పది నెలల నుంచి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను మేం వ్యతిరేకిస్తున్నాం. మధ్యతరగతి నడ్డి విరిచే నిర్ణయం ఇది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం వివిధ విద్యుత్ సంస్థలు 12 వందల కోట్ల రాబడి కోసం చేసిన ప్రతిపాదనను మేం ఖండిస్తున్నాం.మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల విద్యుత్ భారాన్ని నాడు ప్రభుత్వం భరించిందే తప్ప ప్రజలపై భారం వేయలేదు. ఇళ్లకు 300 యూనిట్లు దాటితే 50 రూపాయలు యూనిట్‌కు పెంచడం దుర్మార్గం. 300 యూనిట్లు 70 శాతం ప్రజలు దాటడం ఖాయం. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలన్నింటినీ ఒకే మాదిరిగా లెక్క కట్టడం సరికాదు. దీంతో కుటీర పరిశ్రమలు ఇంకా కుంటుపడే అవకాశం ఉంది. రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ పదేళ్ల పాలనలో రూపాయి ఛార్జీలు పెంచలేదు. కానీ, ఈ ప్రభుత్వం పది నెలల్లోనే 18 వేల కోట్ల అదనపు భారాన్ని ఎందుకు మోపుతున్నారో ఈ సర్కారు సమాధానం చెప్పాలి. బాధ్యతాయుతమైన ఈఆర్సీ ప్రజాకోణంలో యోచించాలి. ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయాలి. తెలంగాణలో సహకార విద్యుత్ సంస్థ ఒకే ఒక్కటి మన సిరిసిల్ల జిల్లాలో ఉంది. డిస్కంలతో పోలిస్తే మా సెస్ ఎంతో బెటర్. కాబట్టి సెస్‌ను కాపాడాలని కోరుతున్నాను. సెస్‌లో డిమాండ్‌కు తగ్గట్టు ఏడు హెచ్‌పీ మోటార్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాను. సెస్ కోసం వచ్చే సబ్సిడీ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి. రైతులే నడిపించే సంస్థ సెస్. ఈ పది నెలల్లోనే పదిమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం.బాంబులు అంటే పొంగులేటి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ల గురించి చెబుతారేమో బహుశా?. మామీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి. చిట్టినాయుడు బెదిరింపులకి మేము భయపడం. ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడం. మళ్ళీ మేము వస్తాం. ఒక్కొక్కడి సంగతి చెబుతాం. జగిత్యాల ఎమ్మెల్యే గాడిదలు కాయడానికి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకున్నాడా?. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ వ్యభిచారి. రాజకీయ వ్యభిచారం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులనే చంపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
శ్రీలంకలో కరెంట్ చార్జీల మోత.. ఐఎంఎఫ్ ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం..
కొలంబో: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) నిబంధనలు శ్రీలంక ప్రజల పాలిట పెనుభారంగా మారుతున్నాయి. ఐఎంఎఫ్ విధించిన నిబంధనలకు తలొగ్గిన శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ చార్జీలను 66 శాతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంటు చార్జీలు పెంచడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి. బిల్లుల పెంపు నేపథ్యంలో విద్యుత్ కోతలకు గురువారం నుంచే తెరపడింది. ఇకపై నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో గత ఏడాది కాలంగా కరెంటు కోతలు కొనసాగాయి. నిత్యం ఒక గంట నుంచి 14 గంటలదాకా కరెంటు సరఫరా నిలిపివేశారు. రుణం ఇవ్వాలంటే విద్యుత్ చార్జీలు పెంచాలని ఐఎంఎఫ్ స్పష్టం చేయడంతో శ్రీలంక ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల రుణం తీసుకోనుంది. చదవండి: ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణలు వర్షం.. -
దుర్గమ్మసాక్షిగా విద్యుత్ చార్జీలపై అబద్ధాలా?
విజయవాడ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ సీఎం చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ధ్వజమెత్తారు. శుక్రవారమిక్కడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుకు నోటి వెంట అబద్ధాలు మాత్రమే వస్తాయన్నారు. 2014 కాకినాడ ఎన్నికల సభలో అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకొచ్చాక రెండుసార్లు పెంచారన్నారు. దీంతో ప్రజలపై రూ.4,759 కోట్ల పెనుభారం పడిందన్నారు. అదే సమయంలో మూడోవిడత కూడా విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలిపారు. కనకదుర్గమ్మ సాక్షిగా విద్యుత్ చార్జీలపై అబద్ధాలాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు కుమారుడికి మినహా నిరుద్యోగుల్లో ఎవరికీ ఉద్యోగమివ్వలేదని విమర్శించారు. చంద్రబాబును గ్రామాల్లోకి వెళితే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని అన్నారు. సీఎంకు పర్యటనలే ముఖ్యం..: ఒకవైపు ఆసుపత్రుల్లో వందలాది మంది ప్రజలు విషజ్వరాలు, డెంగీతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు, మంత్రులు దసరా సంబరాల్లో మునిగితేలుతున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. ఎప్పుడు అమెరికా వెళదామా.. లేకపోతే సొంతబృందంతో జపాన్, సింగ్‌పూర్, ఇటలీ టూర్ పెట్టుకుందామా అని ఆలోచించడం మినహా చంద్రబాబుకు మరొకటి ఉండదన్నారు. మూడున్నరేళ్లపాటు రాజధాని నిర్మాణంపై బొమ్మలు చూపించి మోసం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కొత్తగా సినీ దర్శకుడు రాజమౌళిని రాజధాని డిజైన్లకు రూపకల్పన చేయమనడం విడ్డూరమన్నారు. ప్రతిదానికీ అడ్డుపడుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షంపై చేతగాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కోట్లాది రూపాయలు దండుకుని నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్నవర్షానికే కారిపోతుంటే ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టినప్పుడు దుర్మార్గంగా పక్కరాష్ట్రాల సీఎంల కాళ్లు పట్టుకుని కోర్టుల్లో కేసులు వేయించింది నీవు కాదా చంద్రబాబూ? అని ప్రశ్నించారు. -
‘సీఎంను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు’
-
చార్జీలు పెంచక భారీ నష్టాలు
♦ విద్యుత్ సంస్థల పనితీరుపై కాగ్ వెల్లడి ♦ 2014–15లో ఉత్తర డిస్కం నష్టాలు రూ.1,348 కోట్లు ♦ వినియోగదారుల నుంచి రూ.909 కోట్లు అధికంగా వసూళ్లు ♦ రూ.8,237.63 కోట్ల వ్యవసాయ సబ్సిడీలో రూ.1,176.80 కోట్లు నిరుపయోగం ♦ పలు ప్రభుత్వ రంగ సంస్థల అంశాలూ ప్రస్తావన సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలను సవరించకపోవడంతో 2014–15లో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు రూ.1,348.21 కోట్లు నష్టాలు వచ్చాయని కాగ్ పేర్కొంది. విద్యుత్ చార్జీల పెంపు (వార్షిక టారిఫ్) ప్రతిపాదనలు సమర్పించకపోవడం.. 2013–14కు సంబంధించిన చార్జీలనే 2014–15లోనూ అమలు చేయాల్సి రావడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. టీఎస్ఎస్పీడీసీఎల్ పనితీరుపై మరిన్ని అంశాలను బహిర్గతం చేసింది. హా డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా నెట్వర్క్ అభివృద్ధికి 2011–16 మధ్య ఈఆర్సీ ఆమోదించిన దాని కన్నా రూ.752.04 కోట్లు తక్కువగా పెట్టుబడులు పెట్టింది. హా కేవలం 56.25 శాతం వ్యవసాయ కనెక్షన్లను మాత్రమే హెచ్‌వీడీఎస్ పథకం కిందకి మార్పిడి చేసింది. పంపిణీ నష్టాలను తగ్గించుకోలేక ఈ కాలంలో రూ.194.27 కోట్ల నష్టం జరిగింది. హా నిర్దేశించిన గరిష్ట పరిమితులను అధిగమించి కొన్ని వర్గాల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడంతో.. ఆ వర్గాలపై 2011–15 మధ్య రూ.909.37 కోట్ల భారం పడింది. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు, ఉద్యోగుల ఖర్చులు, పరిపాలన, సాధారణ ఖర్చులు పెరగడంతో 2013–14లో అధికంగా ఖర్చు చేసిన రూ.98.81 కోట్లను ట్రూఅప్ చార్జీలుగా వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతి కోరలేదు. హా 2016 మార్చి 31 నాటికి ప్రభుత్వం/స్థానిక సంస్థల నుంచి రూ.820.89 కోట్ల బిల్లులు, ఇతర వినియోగదారుల నుంచి రూ.249.03 కోట్ల బిల్లులు వసూలు చేసేందుకు చర్యలు ప్రారంభించలేదు. హా వ్యవసాయ కనెక్షన్లకు ఏడు గంటలకు బదులు.. ఆరు గంటల కన్నా తక్కువగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లించిన రూ.8,237.63 కోట్లలో రూ.1,176.80 కోట్లు ఉపయోగపడలేదు. రూ.50 కోట్ల రాబడికి గండి ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ప్రాంగణాల్లో స్థాపించిన ఐటీయేతర వాణిజ్య కార్యకలాపాలైన హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, ఆస్పత్రులు, బ్యాంకులకు సైతం రాయితీలను వర్తింపజేయడంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) రూ.50.35 కోట్లు నష్టపోయింది. ఐటీతో సంబంధం లేని పరిశ్రమలకు సైతం రాయితీలను వర్తింపజేయడంతో మరో రూ.10.96 కోట్లు నష్టపోయింది. కాంట్రాక్టర్‌కు అనుకూలంగా జెన్కో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) టర్బైన్ జనరేటర్ పనుల్లో లోపాలకు కారణమైన కాంట్రాక్టర్‌పై రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) చర్యలు తీసుకోలేదు. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (బీఓపీ) పనుల కాలపరిమితిని కాంట్రాక్టర్‌కు అనుకూలంగా పొడగించడం వల్ల క్రేన్ కొనుగోలు కోసం రూ.2.12 కోట్ల అదనపు వ్యయం చేయాల్సి వచ్చింది. ఆర్టీసీకి రూ.52.4 లక్షల నష్టం కాంట్రాక్టర్‌తో ఒప్పందం ప్రకారం బస్సు లపై ప్రకటనల గణన నిర్వహించ కపోవడంతో రూ.52.4 లక్షల లైసెన్స్ ఫీజును తెలంగాణ ఆర్టీసీ నష్టపోయింది. టీఎస్ఐఐసీకి రూ.73.75 కోట్ల నష్టం ఐటీ పార్కుకు కేటాయించిన 109.36 ఎకరాల్లో 12.15 ఎకరాలను రహేజా గ్రూపు సంస్థ ఐటీయేతర అవసరాలకు బదిలీ చేయడంతో రాష్ట్ర పరిశ్రమల మౌలి క సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)కి రూ.73.75 కోట్ల నష్టం జరిగింది. ‘సింగరేణి’ కాలువలో రూ.44.14 కోట్లు గనుల అవసరాల కోసం ఎన్టీఆర్ కాల్వను ఇందిరాసాగర్–రుద్రమకోట ఎత్తిపోతల పథకంతో అనుసంధానం చేసేందుకు 4.76 కి.మీ. బదులు 28 కిలోమీటర్ల మేర నిర్మించడంతో సింగరేణి సంస్థ అంచనాకు మించి రూ.44.14 కోట్ల వ్యయం చేసింది. -
కేసీఆర్ డిక్టేటర్ లా వ్యవహరిస్తున్నారు: షబ్బీర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ డిక్టేటర్లా వ్యవహరిస్తూ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని తెలంగాణ కౌన్సిల్లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ హెచ్చరించారు. ప్రాజెక్టుల రీడిజైన్లంటూ కేసిఆర్ ఇష్టానుసారంగా నిర్మాణ వ్యయాలను రెట్టింపు చేస్తూ టెండర్లు లేకుండా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి ఆరోపించారు.యూనివర్శీటీలకు వీసీలుగా తనకు నచ్చిన వారిని నియమించుకునేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నిర్వాకం వల్ల యూనివర్శీటీలకు కేంద్ర నిధులు రాకుండా పోతున్నాయన్న పాల్వాయి ఇందుకు బాధ్యతగా కడియం శ్రీహరి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
మే నుంచి విద్యుత్ చార్జీల పెంపు
ఏప్రిల్‌లో ప్రస్తుత చార్జీలే అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఏప్రిల్లోప్రస్తుత చార్జీలే వసూలు చేస్తారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన విద్యుత్ చార్జీలను ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీతో అమలు చేయడం ఆనవాయితీ. అయితే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2016-17 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను ఈఆర్సీకి గత నవంబర్‌కు బదులు మార్చి 8న సమర్పించాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించడం, వాటిపై డిస్కంల వివరణ, అనంతరం బహిరంగ విచారణ జరిపి కొత్త టారిఫ్ ఖరారు చేసేందుకు సమయం లేకపోవడంతో చార్జీల పెంపు అమలును మేకు వాయిదా వేసినట్టు ఈఆర్సీ వర్గాలు తెలిపాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ తేదీలను ఈఆర్సీ ఖరారు చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9న కరీంనగర్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటిదాకా విచారణ జరుగుతుంది. పెంపుపై చర్చించేందుకు ఈ నెల 17న ఈఆర్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర సలహా కమిటీ సమావేశం జరుగుతుంది. -
విద్యుత్ చార్జీలపై పోరాడతాం: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను ఒక్కపైసా కూడా పెంచేది లేదని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికే కరువు, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు. -
చార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్షం భగ్గుమంది. వైఎస్సార్సీపీ నిరసనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. పెంచిన చార్జీలను వెనక్కి తీసుకోవాలని విపక్షం గట్టిగా డిమాండ్ చేసింది. ప్రజలపై రూ. 941 కోట్ల భారాన్ని మోపిన విద్యుత్ చార్జీల పెంపు కన్నా సభలో చర్చించే ప్రధాన సమస్య ఏముంటుందని పాలకపక్షాన్ని నిలదీసింది. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని విపక్ష సభ్యులు సభలో పెద్దఎత్తున నినదించారు. మూడు రోజుల సమావేశాల బహిష్కరణ అనంతరం మంగళవారం సభలో అడుగుపెట్టిన వైఎస్సార్సీపీ.. కరెంట్ చార్జీల పెంపుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో సభ ప్రారంభమైన గంట వ్యవధిలోనే రెండు సార్లు వాయిదా పడింది. మూడోసారి సభ ప్రారంభంకాగానే చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ప్రకటన చేశారు. అనంతరం విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్తు చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, అందువల్ల తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో చివరకు విపక్షం సభ నుంచి వాకౌట్ చేసింది. ముఖ్యమంత్రి వివరణ తర్వాత సభ వాయిదా పడింది. విపక్ష నిరసన ప్రారంభమిలా.. తమ వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు కలగజేసుకుని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించిందని, ప్రశ్నోత్తరాల అనంతరం దీనిపై సభలో సీఎం ప్రకటన చేస్తారన్నారు. దీనికి విపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపింది. వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపడుతున్నట్టు ప్రకటించారు. సమయం ఎంతిస్తారో చెప్పమంటే... వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ చొరవ తీసుకుని స్పీకర్ వద్దకు వెళ్లి.. ఎలాగూ సీఎం ప్రకటన ఉన్నందున దీనిపై ఇప్పుడే చర్చిస్తే బాగుంటుందని సూచించారు. దీనికి స్పీకర్ ఒకసారి తిరస్కరించిన తీర్మానంపై చర్చ ఉండదన్నారు. ఆ దశలో జ్యోతుల సీఎం చేసే ప్రకటనపై చర్చకు ఎంత సమయం ఇస్తారో చెప్పాలని కోరారు. ఎంత అవకాశం ఉంటే అంత ఇస్తామని స్పీకర్ బదులిస్తున్న సమయంలో యనమల మళ్లీ జోక్యం చేసుకుని విద్యుత్ చార్జీలపై చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలంటూ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. ఇంతలో అచ్చెన్నాయుడు మైకందుకుని తమంత సానుకూల ప్రభుత్వం ఎక్కడా లేదని, ఈ విషయాన్ని గుర్తించకుండా బాధ్యతారహితంగా విపక్షం వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో విపక్ష సభ్యులు ‘విద్యుత్ చార్జీల పోటు, పేద ప్రజలపై వేటు, పెంచిన చార్జీలు తగ్గించాలి, సభలో చర్చించాలి’ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘వద్దు, వద్దు, కరెంటు చార్జీలు పెంచవద్దు’ అంటూ నినాదాలు చేశారు. మీరు లేకపోతే.. ఉప్పూ, కారం లేనట్టే పరిస్థితి గందరగోళంగా తయారవుతున్న దశలో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు కలగజేసుకుని ప్రతిపక్షం లేని రెండు రోజుల సమావేశాలు ఉప్పు, కారం లేనట్టు చప్పగా సాగాయన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. ఆ వెంటనే మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఏపీఈఆర్సీ విద్యుత్ చార్జీల పెంపుపై ఐదు చోట్ల బహిరంగ విచారణలు జరిపితే విపక్షం ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. దీనికి విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. విపక్షం వాకౌట్... చంద్రబాబు ప్రకటనపై చర్చ అనంతరం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మైక్ తీసుకుని ‘‘చంద్రబాబు మనసులో మార్పు వస్తుందని ఆశించాం. ఎన్నికల ముందు చార్జీలు తగ్గిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. దీంతో బాబుకు జ్ఞానోదయం అయిందేమోనని, మారారేమోనని అనుకున్నాం. ఇప్పుడు చూస్తే బాబు ఏమాత్రం మారలేదని స్పష్టమైంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం..’’ అని ప్రకటించి వెళ్లిపోయారు. విపక్ష సభ్యులు బయటకు వెళ్లిన తర్వాత కూడా మంత్రులు అచ్చెన్నాయుడు, యనమలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రతిపక్ష నేత జగన్ లక్ష్యంగా విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వివరణతో సభ బుధవారానికి వాయిదా పడింది. జగన్‌కు మైకు ఇచ్చినట్టే ఇచ్చి... ఈ దశలో స్పీకర్ కోడెల విపక్ష నేత జగన్మోహన్రెడ్డిని మాట్లాడమని మైకు ఇచ్చారు. దాంతో ఆయన లేచి అధ్యక్షా.. ‘‘విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెప్పారు, కానీ ఈవేళ పెంచారు’’ అని అంటూ ఉండగానే మైకు కట్ అయింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు, స్పీకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తిరస్కరించిన అంశంపైన మాట్లాడే వీలులేదని స్పీకర్, అటువంటప్పుడు ఎందుకు మైకు ఇచ్చారని విపక్ష సభ్యులు వాదించుకున్నారు. సభ్యుల్ని ప్రశాంతంగా కూర్చోవాలని చెప్పేందుకు జగన్మోహన్రెడ్డికి మైకు ఇచ్చానే గానీ తిరస్కరించిన అంశంపై మాట్లాడేందుకు కాదని స్పీకర్ అన్నారు. ఈ దశలో మంత్రులు యనమల, రావెల కిశోర్‌బాబు, అచ్చెన్నాయుడు విపక్షంపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారమే వైఎస్సార్సీపీ సభ్యులు సభలోకి వచ్చి గొడవ చేస్తున్నారని, సస్పెండ్ కావడమో లేక బయటకు వెళ్లిపోవడమో ప్రతిపక్షం ఉద్దేశంగా ఉందని యనమల చేసిన వ్యాఖ్యకు విపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. నినాదాలు మార్మోగించింది. దీంతో స్పీకర్ సభను రెండుసార్లు వాయిదా వేశారు. -
'విద్యుత్ ఛార్జీలు ప్రజలు భరించలేరు'
హైదరాబాద్: తెలంగాణ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయడం తగదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి రూ. 7800 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు మోపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు దివాళ తీస్తుందో వివరించాలన్నారు. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒకే సారి విద్యుత్ ఛార్జీలు పెరిగాయని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోని వచ్చిన 8 నెలలకే విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజలు భరించలేరన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని షబ్బీర్ అలీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఉద్యమం చేస్తుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. -
విద్యుత్ ఛార్జీల పెంపు వెనుక అవినీతి: మైసూరా
-
అల్పాదాయ వర్గాలకు ఉపశమనం!
* విద్యుత్ చార్జీల పెంపుపై డిస్కంల కసరత్తు పూర్తి * 200 యూనిట్ల వరకు 50 పైసలు పెంచాలని ప్రతిపాదన * ఉన్నత వర్గాలు, పరిశ్రమలపైనే అధిక భారం * కనీసం యూనిట్‌కు రూ. 2 పెంచాలని యోచన * హెచ్‌టీ కేటగిరీల విలీనంతో మరింత ఆదాయం * ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించాక తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతి పాదనలపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. విద్యుత్ కోతలతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో వెనుకాముందాడుతోంది. పేద, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా చార్జీల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సూచించింది. దీంతో వార్షిక సగటు రాబడి అంచనా(ఏఆర్ఆర్)ల తయారీలో డిస్కంలు ఆఖరి కసరత్తు చేస్తున్నాయి. ‘ఏఆర్ఆర్ల తయారీ దాదాపుగా పూర్తయింది. ఈఆర్సీ ఇచ్చిన గడువు ప్రకారం 12వ తేదీన సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్త రాష్ట్రం కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై భారం మోపకూడదనేది సర్కారు ఆలోచన. 0-200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు దాదాపు ఇప్పుడున్న చార్జీలే అమలవుతాయి. ఒక్కో యూనిట్‌పై కనీసం 50 పైసలు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రికి నివేదించేందుకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేశాం. అల్పాదాయ వర్గాలపై 50 పైసల చొప్పున పెంచితే వారిపై ఎంత భారం పడుతుంది... ఇప్పుడున్న రేటునే కొనసాగిస్తే విద్యుత్ సంస్థలకు ఎంత నష్టం వస్తుంది వంటి విశ్లేషణలను అందులో పొందుపరిచాం. 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడే ఎల్టీ, హెచ్‌టీ కేటగిరీలన్నింటిలోనూ ఒక్కో యూనిట్‌పై కనీసం రూ. 2 చొప్పున పెంచాలనే ఆలోచన ఉంది. హెచ్‌టీ కేటగిరీలను విలీనం చేసే ప్రతిపాదనలున్నాయి. పీక్ అవర్స్‌లో అదనపు చార్జీలు కొనసాగుతాయి. అధికాదాయ వర్గాలు, పరిశ్రమల నుంచి ఎక్కువ చార్జీలను రాబట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి సూచనల మేరకు చార్జీల పెంపు ప్రతిపాదనల్లో తుది మార్పులు చేస్తాం’ అని ఏఆర్ఆర్ తయారీలో పాలుపంచుకున్న ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పెంపును 20 శాతానికి కట్టడి చేసే యత్నం చార్జీల పెంపు ద్వారా వచ్చే ఏడాదిలో రూ. 4695 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకునేం దుకు డిస్కంలు ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసుకున్నాయి. ఇందుకోసం ప్రస్తుతమున్న చార్జీలను 22.52 శాతం పెంచాల్సి ఉంటుంది. కానీ అల్పాదాయ వర్గాలపై భారం లేకుండా సర్దుబాటు చేయడానికి ఈ పెంపును 15 నుంచి 20 శాతానికి కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం హెచ్‌టీ విభాగంలోని ఏడు కేటగిరీలను విలీనం చేస్తే ఆదాయం పెరుగుతుందని డిస్కంలు యోచిస్తున్నాయి. పరిశ్రమలు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కాలనీలు, సీజనల్ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వంటివి వివిధ కేటగిరీలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు రూ. 4.58 నుంచి రూ. 5.41 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ కేటగిరీని తొలగించి ఇతర పరిశ్రమలతో విలీనం చేస్తే తమపై చార్జీల భారం ఎక్కువగా పడుతుందని ఆ పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏఆర్‌ఆర్‌లు సమర్పించే గడువును తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) ఈ నెలాఖరుకు పొడిగించే అవకాశముంది. షెడ్యూల్ ప్రకారం 12వ తేదీలోగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని డిస్కంలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈఆర్సీ చైర్మన్‌తోపాటు సభ్యులంతా ప్రస్తుతం అధికారిక పర్యటనపై కొచ్చిన్‌లో ఉన్నారు. వారంతా ఈ నెల 13న తిరిగి విధులకు హాజరవుతారు. దీంతో ఏఆర్ఆర్ల సమర్పణకు గడువు పొడిగించనున్నట్లు తెలిసింది. -
చార్జీల పెంపు తప్పదు: ట్రాన్స్‌కో
సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని మించి వ్యయమవుతోందని, విద్యుత్ చార్జీలను పెంచక తప్పదని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన వ్యయంలో పెరుగుదల, 2014 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేపట్టాల్సి ఉండటం, పెరిగిన నిర్వహణ ఖర్చులను కారణంగా చూపుతూ.. చార్జీల పెంపు ప్రతిపాదనలను ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందుంచారు. 2014-19 వరకు బహుళ సంవత్సర టారిఫ్‌లో భాగంగా విద్యుత్‌సరఫరా, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నిర్వహణపై ట్రాన్స్‌కో సమర్పించిన ప్రతిపాదనలపై ఈఆర్సీ మంగళవారం బహిరంగ విచారణను చేపట్టింది. ట్రాన్స్‌కో వాదనను విచారణలో పాల్గొన్న విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ నేతలు, పరిశ్రమల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి వాదనలు.. - ‘రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రం కలిసి ఉంటుందా? విడిపోతుందా? తెలియని పరిస్థితి. రాష్ట్రం కలిసి ఉంటుందనే ఆలోచనతో విచారణ జరుపుతున్నారు. విభజన జరిగితే ఎలా అనేది కూడా ఆలోచించాలి. ఇవి 5 సంవత్సరాల చార్జీల ప్రతిపాదనలు కాబట్టి వీటిపై విచారణ ఇప్పుడు వద్దు. ప్రతీ ఏటా డిస్కంలలాగా ట్రాన్స్‌కో కూడా ప్రతిపాదనలు ఇవ్వాలి. విద్యుత్ సరఫరా నష్టాలు 2009-10లో 4.2 శాతమని పేర్కొన్న ట్రాన్స్‌కో 2013-14 నాటికి 3.89 తగ్గిస్తామంది. అయితే, 2014-15లో సరఫరా నష్టాలు 4.15 శాతం ఉంటాయని ఇప్పుడంటోంది. సరఫరా నష్టాలను తగ్గించడంలో ట్రాన్స్‌కో విఫలమైనట్టు దీంతో స్పష్టమౌతోంది’ - విద్యుత్‌రంగ నిపుణుడు వేణుగోపాల్‌రావు - ‘ఈ ప్రతిపాదనలపై ఐదేళ్ల వరకు కాకుండా... విభజన జరిగే వరకూ అనే షరతుతో విచారణ జరపాలి’ - న్యూ డెమోక్రసీ నేత గాదె దివాకర్ - ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనల్లో అవకతవకలు కనిపిస్తున్నాయి. ఆడిట్ అకౌంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’ - ఫ్యాప్సీ ప్రతినిధి అనిల్ రెడ్డి - ‘ట్రాన్స్‌కో ప్రతిపాదనలపై డిస్కంలు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు. ట్రాన్స్‌కో, డిస్కంలు కుమ్మక్కయ్యాయా? సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంలో పారదర్శకత పాటించడం లేదు’ - విద్యుత్ రంగ నిపుణుడు తిమ్మారెడ్డి -
విద్యుత్‌చార్జీల పిడుగు
-
88% వినియోగదారులపై భారం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంవత్సరం అని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం భారీగా విద్యుత్ షాకులిచ్చేందుకు సర్కారు సిద్ధమయింది. అన్నదాతలపై కూడా జాలి చూపకుండా చార్జీలు పెంచుతోంది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోదారులు 2.53 కోట్ల మంది కాగా.. ఇందులో సుమారు రెండు కోట్ల మంది గృహ వినియోగదారులే ఉన్నారు. మొత్తం 88.17% వినియోగదారులపై భారం పడనుంది. మిగతావి ఉచిత విద్యుత్ కనెక్షన్లు. మీటర్లు ఉన్న రైతులకు యూనిట్‌కు ఒక పైసా పెంపు మాత్రమే ప్రతిపాదించినా ప్రతి రైతుకూ ఏటా రూ.825 అదనపు భారం పడనుంది. ఐదు అశ్విక శక్తి (హార్స్ పవర్)గల మోటార్లతో ప్రతిరోజు ఏడు గంటలు విద్యుత్ వినియోగిస్తే 226 యూనిట్లు ఖర్చవుతుంది. ఒక్కపైసా చొప్పున రోజుకు రూ.2.26.. 365 రోజులకు రూ.825 మేరకు అదనపు భారం పడుతుందన్నమాట. కోతలు మాత్రం తప్పవు! సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలను ఏటా భారీగా పెంచుతున్న ప్రభుత్వం... కోతలను ఎత్తివేసేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనూ విద్యుత్ కోతలు కొనసాగుతాయని డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 99,046 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. ఇందులో కేవలం 85,582 ఎంయూల మేరకు మాత్రమే సరఫరా చేయగలమని, 13,464 ఎంయూల లోటు ఉంటుందని తెలిపాయి. రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్ఎన్జీ) ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి లోటు తీర్చుతామని డిస్కంలు పేర్కొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని గ్యాసు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు ఆర్-ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు గ్యాస్ పైపులైను లేదు. గ్యాస్ స్వాపింగ్ ద్వారా కేజీ బేసిన్ గ్యాసును మనం తీసుకుని... మనం కొనుగోలు చేసిన ఆర్-ఎల్ఎన్జీని గుజరాత్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఉత్తరప్రదేశ్‌లోని ఎల్ఎన్జీ ప్లాంట్లకు ఇచ్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఈ ప్లాంట్లకు కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆర్-ఎల్ఎన్జీతో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేదు. అంటే 13,464 ఎంయూల మేరకు కోతలు తప్పవన్నమాట. ఐదేళ్లలో రూ. 33,538 కోట్ల భారం! మరో ఐదేళ్లూ చార్జీలు పెంచబోమని అప్పట్లో వైఎస్ హామీ సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా విద్యుత్ చార్జీలను పెంచుతోంది. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుకుని 2013-14 వరకు వరుసగా నాలుగేళ్లు చార్జీలను పెంచిన ప్రభుత్వం... ఐదో ఏడాది (2014-15)లోనూ చార్జీల పెంపునకు సిద్ధపడింది. ఇప్పటివరకు విద్యుత్ చార్జీలు, సర్దుబాటు చార్జీల రూపంలో ప్రభుత్వం రూ.24,218 కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. తాజా ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదిస్తే మొత్తం చార్జీల భారం ఏకంగా రూ.33,538 కోట్లకు చేరుకోనుంది. ‘గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచలేదు... వచ్చే ఐదేళ్లూ పెంచేది లేదు..’ అన్న వైఎస్ హామీకి నిలువునా తూట్లు పొడుస్తూ ప్రభుత్వం ఐదేళ్లూ చార్జీలను పెంచడం గమనార్హం. మరోవైపు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామన్న వైఎస్ ఎన్నికల హామీకి కూడా సర్కారు నీళ్లొదిలింది. రైల్వేపై రూ.90 కోట్ల భారం! సాక్షి, హైదరాబాద్: రైల్వే వాడుకుంటున్న కరెంటుకు యూనిట్‌కు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. దీంతో రైల్వేపై ఏటా రూ.90 కోట్ల వరకు భారం పడుతుంది. గత మార్చిలో పెంచిన చార్జీల వల్ల రూ.165 కోట్ల భారం పడటంతో, అసలే నష్టాల్లో ఉన్న రైల్వేకు ఇది మరో శరాఘాతం. రైల్వే ట్రాక్షన్ (రైలుకు వాడే కరెంటు) కోసం వాడే కరెం టు యూనిట్ ధరను గత మార్చిలో రూ.6.36కు పెంచారు. తాజాగా దాన్ని రూ.6.86కు పెంచాలని ప్రతిపాదించారు. స్టేషన్లు, రైల్వే కాలనీలకు వాడే కరెంటు చార్జీలను కూడా యూనిట్‌కు 50 పైసలు చొప్పున పెంచాలని ప్రతిపాదించారు. పరిశ్రమలపై ఇక ‘హార్మోనిక్’ చార్జ్..! సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే విద్యుత్ కోతలు, చార్జీలతో పరిశ్రమలపై పెనుభారం మోపిన ప్రభుత్వం... హార్మోనిక్ సర్‌చార్జీ పేరుతో మరింత మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. నిర్ణీత లోడు మేరకు విద్యుత్‌ను వినియోగించకుండా.. అకస్మాత్తుగా హెచ్చుతగ్గులతో విద్యుత్‌ను వినియోగించే పరిశ్రమల నుంచి భారీగా సర్‌చార్జీ వసూలు చేసేందుకు ప్రణాళిక వేసింది. ‘హార్మోనిక్ సర్‌చార్జీ’ పేరిట ఇటువంటి పరిశ్రమల నుంచి నెలకు చెల్లించే మొత్తం విద్యుత్ చార్జీలో 25 శాతం అదనంగా రాబట్టాలని నిర్ణయించింది. దేశంలో తమిళనాడు తర్వాత మన రాష్ట్రంలోనే ఇది అమలు కానుండటం విశేషం. మరమగ్గాలకు సబ్సిడీ విడుదల సాక్షి, హైదరాబాద్: మరమగ్గాలకు వాడుతున్న విద్యుత్‌కు 50 శాతం రాయితీ కింద ప్రభుత్వం రూ. 25.27 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన సబ్సిడీ 2010 ఏప్రిల్ నుంచి 2012 ఏప్రిల్ కాలానికి సంబంధించినదిగా పేర్కొంది. సర్దుబాటు చార్జీలు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. -
విద్యుత్‌చార్జీల పిడుగు 9,320 కోట్లు
* పేదలు, మధ్యతరగతి వర్గాలే సర్కారు టార్గెట్ * అదనపు రాబడికి డిస్కంల ప్రతిపాదనలు * 2014-15కు ఈఆర్సీకి ఆదాయ, వ్యయ నివేదికల సమర్పణ * బడ్డీకొట్ల నుంచి పరిశ్రమల వరకు అన్ని కేటగిరీలకూ షాకులు * గృహ వినియోగదారులపై ఎక్కువ భారం.. * రూ. 2,456 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధం * స్లాబులు విభజించి వాయించారు.. సగటున 31% పెంపు * 50 యూనిట్లలోపు వారిపైనా.. రైతులకూ పరోక్ష వడ్డన * వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలు! సాక్షి, హైదరాబాద్: 2.23 కోట్లు - ఇది విద్యుత్ చార్జీల పెంపుభారం పడుతున్న వినియోగదారుల సంఖ్య. 9,320 కోట్లు - కొత్త విద్యుత్ చార్జీల పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయదలచుకున్న మొత్తం. గత నాలుగేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించనుంది. అయితే ఈసారి గృహాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు అనే తేడా లేకుండా (ఉచిత విద్యుత్ మినహా) అన్ని కేటగిరీలనూ, రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులెవర్నీ వదలకుండా చార్జీలు పెంచేందుకు సిద్ధమయింది. ముఖ్యంగా గృహవినియోగదారులకు భారీ షాకులిచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజలపై ఏకంగా రూ.9,320 కోట్ల మేరకు అదనపు విద్యుత్ చార్జీల భారం మోపే దిశలో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 2014-15కు సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లను బుధవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. చార్జీల పెంపులో ఏ ఒక్కరినీ మినహాయించకుండా అందరికీ షాక్‌లు ఇస్తూ ‘సమన్యాయం’ పాటించింది. గృహ వినియోగదారులు, చిన్న చిన్న బడ్డీ కొట్లు మొదలుకుని చిన్న, పెద్ద పరిశ్రమలతో పాటు తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మరమగ్గాలు, బొమ్మల తయారీ వంటి కాటేజీ పరిశ్రమలపైనా చార్జీల భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్న రైతులనూ ప్రభుత్వం వదల్లేదు. యూనిట్‌కు పైసా చొప్పున కస్టమర్ చార్జీల రూపంలో వసూలు చేయనునుంది. ఫిక్స్డ్, డిమాండ్, కస్టమర్ చార్జీల రూపంలో పరోక్షంగానూ వాయించేందుకు సిద్ధమైంది. ఇక కొత్తగా ‘హార్మోనిక్ సర్‌చార్జీ’ పేరుతో పరిశ్రమల నుంచి నెల మొత్తం విద్యుత్ చార్జీలో 25 శాతం అదనంగా వసూలు చేయనుంది. ఇక గృహ వినియోగదారులకు సగటున రూ.1.20 మేరకు చార్జీలు పెంచింది. అయితే 150 యూనిట్లు దాటి వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రం ఏకంగా రూ.4.87 వరకు చార్జీల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు రూ.52,753 కోట్ల ఆదాయం అవసరమని తేలగా... ప్రస్తుత విద్యుత్ చార్జీల వల్ల కేవలం రూ.36,344 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని డిస్కంలు అంచనా వేశాయి. మిగిలిన రూ.16,409 కోట్లలో ఉచిత విద్యుత్‌తో పాటు ఇతర వర్గాల సబ్సిడీ కోసం రూ. 7,089 కోట్లను సబ్సిడీగా భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలిన రూ.9,320 కోట్లను ప్రజలను బాది వసూలు చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే డిస్కంలు చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి. జనవరిలో బహిరంగ విచారణ అనంతరం మార్చి మూడో వారంలో ఈఆర్సీ తుది ఆదేశాలు జారీ చేయనుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తాయి. బడ్డీ కొట్టైనా నడ్డి విరుగుతుంది పొట్ట కూటి కోసం చిన్న చిన్న టీస్టాళ్లు, జిరాక్స్ సెంటర్లు, బడ్డీ కొట్లను నడుపుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. లో-టెన్షన్ (ఎల్టీ) -2 కేటగిరీ కిందకు వచ్చే వీటి విద్యుత్ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. వీరికి విద్యుత్ చార్జీలను యూనిట్‌కు ఏకంగా రూపాయి మేరకు పెంచుతూ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. వాస్తవానికి వీటికి ఇప్పటికే విద్యుత్ చార్జీలు భారీగా ఉన్నాయి. నెలకు 50 యూనిట్లలోపు వినియోగించే వారు ఇప్పటికే యూనిట్‌కు రూ.5.40 చొప్పున చెల్లిస్తున్నారు. దీనిని రూ.6.40కి పెంచారు. ఇక 50 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 50 యూనిట్లకు ప్రస్తుతం రూ.6.63 చెల్లిస్తుండగా ఇక నుంచి రూ.7.63 చెల్లించాల్సి రానుంది. 51-100 యూనిట్ల వారికి రూ.7.38 నుంచి రూ.8.38కి, 101-300 వరకు రూ.8.13 నుంచి రూ.9.13కు, 301-500 యూనిట్లకు రూ.8.63 నుంచి రూ.9.63కు 500 యూనిట్లు దాటితే రూ.9.13 నుంచి ఏకంగా కూ.10.13కు చార్జీలు పెంచారు. కుటీర పరిశ్రమలు ఇక కుదేలు రాష్ట్రంలో విద్యుత్ కోతల దెబ్బకు కుటీర పరిశ్రమలు ఇప్పటికే కునారిల్లుతున్నాయి. మరమగ్గ కార్మికులు ఆత్మహత్యల బాటపడుతున్నారు. గత ఏడాదిలో కుటీర పరిశ్రమలకు ఏకంగా 66 శాతం మేరకు చార్జీలను పెంచిన ప్రభుత్వం ఈసారీ వదల్లేదు. వీటికి చార్జీలను యూనిట్‌కు 67 పైసల మేరకు పెంచింది. వ్యవసాయాధారిత పరిశ్రమలకూ షాక్‌నిచ్చింది. ఉప్పుకయ్యలు, గ్రామీణ నర్సరీలను కూడా కాటేజీ పరిశ్రమల కేటగిరీలోకి మార్చి... యూనిట్ విద్యుత్ చార్జీలను 72 పైసల మేరకు పెంచింది. పుట్టగొడుగులు, చేపలు,రొయ్యల పెంపకం, కుందేళ్ల పెంపకం, ఫ్లోరీ కల్చర్‌కు కూడా షాక్‌లు ఇచ్చింది. కేవలం కోళ్ల పరిశ్రమకు మాత్రమే చార్జీలను తగ్గించింది. ఇక వీధుల్లో చీకట్లే రాష్ట్రవ్యాప్తంగా అనేక పంచాయతీలు, మునిసిపాలిటీలు ఇప్పటికే విద్యుత్ బిల్లులు బకాయిపడి ఉన్నాయి. దీంతో డిస్కంలు కనెక్షన్లు కట్ చేస్తున్నాయి. తాజాగా పెరగనున్న చార్జీలతో ఇక వీధుల్లో చీకట్లే మిగలనున్నాయి. తాగునీటి సరఫరాకూ ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అనేక పంచాయతీల్లో తాగునీటి విద్యుత్ కనెక్షన్లకూ బకాయిల భారం వెన్నాడుతోంది. దీంతో తాగునీటికి కూడా కొన్ని పంచాయతీలల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. వీధి దీపాలకు యూనిట్ విద్యుత్ చార్జీలు 0.38 నుంచి 0.93 రూపాయల మేరకు పెరగగా, తాగునీటి సరఫరాకు రూ. 1.29 నుంచి రూ.1.43 వరకు పెరిగాయి. పరిశ్రమలకు పెను ముప్పు గత రెండు సంవత్సరాలుగా అమలవుతున్న విద్యుత్ కోతలతో రాష్ట్రంలో పారిశ్రామికరంగం పెనుప్రమాదంలో పడింది. వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. వందలాది పరిశ్రమలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేక నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారిపోయాయి. కొన్ని పరిశ్రమల ముందు టు-లెట్ బోర్డులు వెలిశాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాదిలో కూడా పరిశ్రమలను ప్రభుత్వం వదల్లేదు. యూనిట్‌కు 28 పైసల నుంచి 51 పైసల వరకూ పెంచింది. చెరకు క్రషింగ్ యూనిట్లకైతే ఏకంగా యూనిట్ చార్జీని రూ.4.63 నుంచి రూ.7.03కి అంటే ఏకంగా రూ.2.40 పెంచింది. భారీ పరిశ్రమలకూ ప్రభుత్వం భారీగానే షాక్‌లు ఇచ్చిం ది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను కూడా హెచ్‌టీ-1 కేటగిరీలోకి చేర్చుతూ ప్రతిపాదనలు సమర్పించిన ప్రభుత్వం... వీటి విద్యుత్ చార్జీలను యూనిట్‌కు 83 పైసల వరకు పెంచింది. ఇక భారీ వాణిజ్య సంస్థ లు, మల్టీప్లెక్స్‌లు, విమానయాన సంస్థలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు కూడా యూనిట్‌కు 50 పైసల చొప్పున చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. పరోక్ష చార్జీలూ పెరిగాయ్ విద్యుత్ చార్జీల పెంపుతో ప్రత్యక్షంగా చెల్లించే విద్యుత్ చార్జీలతో పాటు డిమాండ్, ఫిక్స్డ్, కస్టమర్ వంటి పరోక్షచార్జీలనూ ఎల్టీ-2 కేటగిరీలోని చిన్న చిన్న వాణిజ్య సంస్థలు ప్రస్తుతం కిలోవాట్‌కు రూ.50 చెల్లిస్తుండగా... ఇక నుంచి రూ.100 చెల్లించాల్సి రానుంది. ఎల్టీ కేటగిరీలోని పరిశ్రమలు, సీజనల్ పరిశ్రమలకు కూడా కిలోవాట్‌కు రూ.50 నుంచి రూ.100కు పెంచారు. చెరకు క్రషింగ్ యూనిట్లకు ఫిక్స్డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ.20 నుంచి రూ.60కి పెరగనున్నాయి. కాటేజీ పరిశ్రమలకు రూ.20 నుంచి రూ. 40కు పెంచేందుకు ప్రతిపాదించాయి. పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఒక హెచ్‌పీకి ప్రస్తుతం ఫిక్స్డ్ చార్జీలు రూ.30 చెల్లిస్తుండగా... వీటిని రూ.60కి పెంచారు. భారీ పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు కేవీఏకు రూ. 350 నుంచి ఏకంగా రూ. 600కు పెంచారు. అంటే కేవీఏకు ఏకంగా రూ. 250 పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. కస్టమర్ చార్జీలు కూడా పెరగనున్నాయి. పేదలు, మధ్యతరగతే సమిధలు..! ప్రతిపాదిత విద్యుత్ చార్జీలను గమనిస్తే ప్రభుత్వం గృహ వినియోగదారులపై కక్ష కట్టిందా అన్పించక మానదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా విపరీతంగా చార్జీలు పెంచేసింది. గృహ వినియోగదారులకు 100 యూనిట్లకు ఉన్న స్లాబును 50 యూనిట్లుగా విభజించి గతంలో చార్జీలను పెంచిన ప్రభుత్వం... ఈసారి దాన్నీ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఎల్టీ-1 కిందకు వచ్చే గృహ వినియోగదారులను ఎల్టీ 1(ఏ) నుంచి 1 (డీ) వరకూ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ప్రతి కేటగిరీలో చార్జీలను వేర్వేరుగా నిర్ణయించింది. నెలకు 50 యూనిట్లలోపు వినియోగించేవారిని ఎల్టీ-1(ఏ) కేటగిరీ కింద చేర్చింది. వీరికి చార్జీలను యూనిట్‌కు రూ.1.45 నుంచి రూ.1.95కు పెంచింది. అంటే 50 పైసలు పెంచిందన్నమాట. ఇక 100 యూనిట్లు వినియోగించేవారిని ఎల్టీ1(బీ) కింద చేర్చి మొదటి 50 యూనిట్లకు రూ.2.60 చొప్పున 51-100 యూనిట్లకు రూ.3.25 చొప్పున వసూలు చేయనుంది. ఇక 150 యూనిట్లు వాడితే తొలి 50 యూనిట్లకు రూ. 3.10, 51-100 యూనిట్లకు రూ.3.75, 101-150 యూనిట్లకు రూ.5.38 చొప్పున వసూలు చేయూలని నిర్ణయించింది. ఇక నెలకు 150 యూనిట్లు దాటితే మాత్రం నడ్డి విరిగేలా వడ్డించేందుకు సర్కారు సిద్ధమైంది. మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు ఏకంగా రూ.6.32 చొప్పున, 201-250 యూనిట్లకు రూ.6.94, 251-300కు రూ.7.55, 301-400కు రూ.8.16, 401-500 యూనిట్లకు ఏకంగా రూ.8.77 చొప్పున వసూలు చేయనుంది. ఇక 500 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.9.38 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ విధంగా కేటగిరీలను విభజించి వాయించడం ద్వారా ఒక్క గృహ వినియోగదారుల నుంచే రూ.2,456 కోట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది. 200 యూనిట్లైతే రెట్టింపు చార్జీ! 112.6% మేర పెంపు గృహ వినియోగదారులకు చార్జీల పెంపులో ప్రభుత్వం ప్రధానంగా పేదలు, మధ్యతరగతి వర్గాలనే లక్ష్యంగా చేసుకుంది. సుమారు 2 కోట్ల గృహ వినియోగదారుల్లో ఈ వర్గాలకు చెందిన కోటిన్నర మందిని లక్ష్యంగా చేసుకుని చార్జీలను భారీగా పెంచింది. ప్రధానంగా 200 యూనిట్లలోపు వినియోగించే పేద, మధ్యతరగతి వారిని భారీగా బాదేసింది. తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలు పరిశీలిస్తే... 50 యూనిట్ల వారు ప్రస్తుతం నెలకు రూ.72.50 చెల్లిస్తుంటే (ఇతర చార్జీలను మినహాయించి) తాజా ప్రతిపాదనలతో రూ.97.50 మేరకు చెల్లించాల్సి రానుంది. అంటే 34% మేరకు చార్జీలను పెంచారన్నమాట. ఇక 100 యూనిట్లలోపు వినియోగించే వారికి ఏకంగా 69% పెంచగా... 200 యూనిట్లు వినియోగించే మధ్యతరగతి వారి నెల బిల్లు ఏకంగా రూ.600 నుంచి రూ.1276 (112.6%)కు పెరగనుంది. అదే పెద్దల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. 500 యూనిట్లు వాడే వినియోగదారులు ప్రస్తుతం రూ.3,007 చెల్లిస్తుండగా... ఈ మొత్తం కేవలం రూ.3,693.50కు మాత్రమే పెరగనుంది. అంటే పెరుగుదల శాతం 26.92 మాత్రమే. -
విద్యుత్ చార్జీల వాతలకు మరో నెల గడువు
ఈఆర్సీని కోరిన డిస్కంలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీ ఈఆర్సీ)ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కోరాయి. ఈ మేరకు ఈఆర్సీ కార్యదర్శికి తాజాగా లేఖ రాశాయి. 2014-15లో ఎంత మేర లోటు ఏర్పడుతుందనే అంశంపై డిస్కంలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. దీని ప్రకారం ఏకంగా రూ.12 వేల కోట్ల మేరకు లోటు ఉంది. ఈ మొత్తాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే వరుసగా నాలుగేళ్ల నుంచి విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు సర్దుబాటు చార్జీలు వడ్డించటంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఎన్నికల సమయంలో చార్జీలు పెంచితే ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేమనే ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలో లోటు తగ్గించే అవకాశాలను పరిశీలించడంతోపాటు భారాన్ని తగ్గించేందుకు వీలుగా మరో నెల సమయాన్ని కోరినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31 నాటికి విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కంలు కోరాయి. ఒకవేళ ఆ గడువు నాటికి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ సుమోటోగా చార్జీలను నిర్ణయించనుంది. -
రెండోరోజూ కొనసాగిన బంద్
భివండీ, న్యూస్‌లైన్: కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా భివండీ వస్త్ర పరిశ్రమల యజమానులు పాటిస్తున్న బంద్ రెండోరోజు ప్రశాంతంగా కొనసాగింది. నిత్యం మరమగ్గాల చప్పుళ్లతో హడావుడిగా ఉండే పట్టణం బంద్ వల్ల ప్రశాంతంగా కనిపిస్తోంది. అయితే పరిశ్రమలు స్తంభించిపోవడంతో వాటిపై ఆధారపడి ఉన్న పాన్‌షాపులు, టీ కొట్లు తదితర చిన్న వ్యాపారాలూ దెబ్బతింటున్నాయి. ప్రతినిత్యం పనిచేస్తేనే ఈ చిన్నవ్యాపారులు కుటుంబాలను పోషించుకోగలుగుతారు. మరోవైపు బంద్ ఈ నెల 15 వరకు కొనసాగనున్నందున.. చాలా మంది కార్మికులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. గత రెండు రోజుల నుంచి సుమారు 500 మందికిపైగా కార్మికులు స్వగ్రామాలకు వెళ్లారని పరిశ్రమల యజమానులు తెలిపారు. మగ్గాలు పున:ప్రారంభమైనా కార్మికులు లేకపోవడంతో ఉత్పత్తి కష్టంగా మారుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భివండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో ప్రాంతాధికారి కార్యాలయం ఎదురుగా గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు సురేష్ టావురే మాట్లాడుతూ...బంద్ పాటిస్తూనే మరోవైపు రాస్తారోకో, ధర్నా, ఆందోళన, మోర్చాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సురేష్ డిమాండ్ చేశారు. -
ఇక మరిన్ని షాక్‌లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మరిన్ని షాక్‌లు తప్పవు. ఇకపై ఏటా విద్యుత్ చార్జీ లు భారీగా పెరగనున్నాయి. కరెంటు చార్జీలను ఏటా బాదేయాల్సిందేనని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసేవరకు అయ్యే మొత్తం వ్యయాన్ని వినియోగదారుల నుంచే రాబట్టాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ వాస్తవిక సగటు వ్యయానికి, వాస్తవిక సగటు వసూలుకు మధ్య తేడా భారీగా ఉందని పేర్కొంది. ఈ అంతరాన్ని వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోగా భర్తీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ నిర్వహణ బాధ్యత బిల్లు-2013ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తీసుకొస్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలకు పంపించింది. దీనిపై తగిన సూచనలు చేయాలని పేర్కొంది. తర్వాత ఈ బిల్లును ఆయా రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో ఆమోదించాలని ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరగనున్నాయని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటా బాదుడే బాదుడు: రాష్ట్రంలో ఒక యూనిట్ విద్యు త్ను ఉత్పత్తి చేసి, వినియోగదారులకు సరఫరా చేసేందుకు అవుతున్న సగటు వ్యయం రూ.5.23గా ఉంది. అయితే, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం రూ. 3.57 మాత్రమే. వైఎస్సార్ హయాంలో ఒక్క పైసా విద్యుత్ చార్జీలు పెంచకపోవడమే ఇందుకు కార ణం. చార్జీలు పెంచకుండా.. సబ్సిడీ రూపం లో ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరిం చింది. అయితే వైఎస్ మరణం తర్వాత ఏటా విద్యుత్ చార్జీలు పెంచుతూ వచ్చారు. రోశయ్య ప్రభుత్వం, కిరణ్ సర్కారు ఇప్పటివరకు రెగ్యులర్, సర్దుబాటు చార్జీల రూపం లో దాదాపు రూ.22 వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై మోపాయి. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలవల్ల రాష్ర్ట ప్రజలపై మరోసారి విద్యుత్ భారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసేందుకవుతున్న మొత్తానికి... వినియోగదారుని నుంచి వసూలు చేస్తున్న మొత్తానికి రూ.1.66 తేడా ఉంది. ఈ అంతరాన్ని వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోగా భర్తీ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో వచ్చే ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్‌లు తగులుతూనే ఉంటాయన్నమాట. అలాగే ఏటా విద్యుత్ పంపిణీకవుతున్న మొత్తాన్ని వినియోగదారుని నుంచే రాబట్టుకోవాల్సిందేననీ కేంద్రం స్పష్టంచేసింది. వాస్తవానికి ఏటా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఖర్చు పెరుగుతుంది. ఉత్పత్తికయ్యే ఇంధనం ధరలతోపాటు ఇతర ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. ఫలితంగా ప్రస్తుతమున్న అంతరాన్ని పూడ్చడంతోపాటు ఏటా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి అయ్యే వ్యయం పెరుగుదల కూడా వినియోగదారులపై పడనుంది. -
మళ్లీ సర్దుబాటు వడ్డన : యూనిట్‌కు 49 పైసలు