
విద్యుత్ చార్జీలపై పోరాడతాం: షబ్బీర్ అలీ
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను ఒక్కపైసా కూడా పెంచేది లేదని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికే కరువు, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు.