విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట | YSRCP Protests Against Power Charges Hike In AP | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

అన్నమయ్య జిల్లాలో నిరసనలు, ర్యాలీలు

అన్నమయ్య జిల్లా :

  • తంబళ్లపల్లె నియోజక వర్గంలో బి. కొత్తకోటలో  విద్యుత్ చార్జీలు పెంపు నిరసిస్తూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
  • విద్యుత్ చార్జీలు తగ్గించాలని  ఏ.ఈ కార్యాలయంలో వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు
2024-12-27 14:57:03

ఒక్క హామీ అయినా నెరవేర్చారా? 

విశాఖ..

  • గుడివాడ అమర్నాథ్ కామెంట్స్‌..
  • ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు..
  • విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారు..
  • 15,500 కోట్ల పెను భారాన్ని పేదలపై మోపారు..
  • ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు
  • మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు..
  • ఒక్క హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదు..
  • ఒకేసారి విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని విడతల వారీగా పెంచుతున్నారు..
  • వెయ్యి రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లు 1400 నుంచి 1500 వరకు వస్తుంది..
  • ప్రజల మీద వేసే భారాన్ని తగ్గించాలి..
  • ఎస్సీ ఎస్టీ కాలనీలో అంధకారంలోకి వెళ్లిపోయాయి..
  • 75 వేల కోట్ల అప్పు చేసిన డబ్బు ఏమైంది.
  • ఒక్క రూపాయి అయినా పేదవాడికి పంచారా..
  • బాబు షూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉంది. 
     
2024-12-27 14:01:51

రైతులకు ద్రోహం చేసిన ఒకేఒక్కడు చంద్రబాబు..

గుంటూరు..

  • అంబటి రాంబాబు కామెంట్స్‌..
  • చంద్రబాబు అధికారంలో పెరిగినంతగా విద్యుత్ ఛార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదు.
  • చంద్రబాబు ప్రభుత్వంలో బషీర్ బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు.
  • చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచం, తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
  • అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు
  • విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు నడ్డి విరిచారు.
  • కూటమి నేతలు మాకు11 మంది ఎమ్మెల్యేలు అని అనుకోకండి, మా వైపు నలభై శాతం ఓట్లున్నాయి.
  • పులివెందులలో వైఎస్‌ జగన్ వెంట ఎంత మంది వచ్చారో చూశారా..
  • ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన వెంట నడుస్తున్నారు
  • చంద్రబాబుకు ఓటు వేసినందుకు జనం చెంపలేసుకొని జగన్ వెంట నడుస్తున్నారు.
  • నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను కానీ ఇప్పుడు పెరిగినంత విద్యుత్ చార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదు
  • కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది
  • చంద్రబాబు మెడలో వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తాం
  • రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు
  • రైతులు ధాన్యం కొనకుండా మోసం చేశారు.
  • రైతులకు ఇంత పెద్ద ద్రోహం చేసింది ఒకే ఒక్కడు చంద్రబాబు
  • ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు.
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని రాతలు రాస్తున్నాయి
  • అభివృద్ధి ఆ పత్రికలకు తప్ప ఎక్కడా  జరగటం లేదు.
  • రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదామనుచున్నారు. గ్యాప్ ఇచ్చి పెంచుదామని ఆగారు.
  • 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తానని మందు బాబులను మోసం చేశారు
2024-12-27 14:01:51

చార్జీలు తగ్గించాల్సిందే..

చిత్తూరు జిల్లా..

  • ఎమ్మెల్సీ భరత్‌ కామెంట్స్‌..  
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ చార్జీలను పెంచుతున్నారు..
  • విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు..
  • కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి
  • పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని విద్యుత్‌ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు.
2024-12-27 13:56:16

మాట తప్పిన చంద్రబాబు..

విజయవాడ

  • మాజీ మంత్రి వెల్లంపల్లి కామెంట్స్..
  • కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పి కరెంట్ ఛార్జీలు పెంచింది..
  • సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసింది..
  • ఆరు నెలల పరిపాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు..
  • పెంచిన కరెంటు చార్జీలను తక్షణమే తగ్గించాలని, ఎన్నికలలో హామీ అమలు చేయాలి.
2024-12-27 13:56:16

బాబు షూరిటీ.. బాదుడు గ్యారెంటీ

నగరి..

  • ఆర్కే రోజా కామెంట్స్‌..
  • విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా నిరసన
  • ప్రభుత్వం తక్షణమే విద్యుత్ చార్జీలు తగ్గించాలని రోజా డిమాండ్
  • చంద్రబాబు ప్రజలపై మోయలేని విద్యుత్ చార్జీల భారం మోపారు
  • ఏ ముఖ్యమంత్రి మోపనంత చార్జీల భారం 6 నెలల్లోనే చంద్రబాబు మోపారు
  • బాబు ష్యురిటీ బాదుడు గ్యారంటీ అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉంది
  • ఓటేసిన ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కాటేస్తోంది
  • ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా ఎగనామం పెట్టారు
  • ఇప్పుడు బాదుడుతో ప్రజలను హింసిస్తున్నారు
  • 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవాలి
2024-12-27 12:38:25

బాబు మోసం బయటపడింది..

కాకినాడ..

  • పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ పోరుబాట
  • సిటీ పార్టీ ఆఫీసు నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
  • విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేత
  • కురసాల కన్నబాబు కామెంట్స్‌..
  • చంద్రబాబు మోసం మరోసారి బయట పడింది
  • ప్రజలపై పన్నుల భారం, విద్యుత్ ఛార్జీల పెంపు, అప్పులే చంద్రబాబు సంపద సృష్టి
  • విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు‌.
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే ప్రజలపై భారం వేశారు.
  • బాబు షూరిటీ.. భవిష్యత్ గారెంటీ కాదు.. బాబు షూరీటీ.. బాదుడు గ్యారెంటీ అని నిరూపించారు.
  • తక్షణమే ప్రజలపై వేసిన విద్యుత్ భారాన్ని ఎత్తివేయ్యాలి.
  • ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలి. 
2024-12-27 12:38:25

అవసరం తీరాక మోసం చేయడమే బాబు నైజం: మిథున్‌ రెడ్డి

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కామెంట్స్..

  • రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు
  • చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముందు మాటలకు ఇప్పటి చేతలకి సంబంధం లేదు
  • ప్రజలు ఓట్లు వేశారు..
  • వారి అవసరం తీరగానే వారిని మోసం చేస్తూ, ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు
  • విద్యుత్‌తో పాటుగా అనేక రూపాల్లో ప్రజలను దోచుకునే కార్యక్రమం జరుగుతోంది.
  • ప్రజలు అందరూ ఇది గమనించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి
  • ప్రజలు స్పందించక పోతే రానున్న రోజుల్లో మరిన్ని మార్గాల ద్వారా దోపిడీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది
  • ఈరోజు రాష్ట్రం అంటే కేవలం కొన్ని గ్రామాలు అన్నట్టుగా పాలన సాగుతుంది
  • రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి?.
  • ఇప్పటికే అమరావతికి 60వేల కోట్ల రూపాయలు పైగా అప్పులు చేశారు
  • ఒక్క అమరావతికే లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి?
  • ప్రభుత్వం ఇకనైనా విద్యుత్ బిల్లు తగ్గించాలి, అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి
2024-12-27 12:24:59

హామీలు మరచి.. చార్జీల పెంపు..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..

  • రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల బాదుడుతో ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుంది
  • చంద్రబాబు నాయుడు గతంలో కడపతో సహా అనేక చోట్ల విద్యుత్ చార్జీలు పెంచబోమని మాటిచ్చారు
  • అదేవిధంగా వీలైతే  విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు
  • ఆయన ఇచ్చిన హామీ మేరకు పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించాలి..
  • అదేవిధంగా గతంకంటే తక్కువగా విద్యుత్ బిల్లులు వసూలు చేయాలి
  • విద్యుత్‌పై చంద్రబాబు నాయుడు అనేక బూటకపు హామీలు ఇచ్చారు
  • ఇచ్చిన హామీలు అన్ని మరచిపోయి ఆరు నెలల్లో రూ. 6072.86 కోట్లు,
  • ఆ వెంటనే రూ. 9412.50 కోట్లు భారం ప్రజలపై మోపారు
  • మొత్తంగా 15485.36 కోట్ల బాదుడుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు
  • గతంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తే వారిపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు
  • మరో పక్క ఎస్సీ, ఎ‍స్టీలకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు కూడా మంగళం పలుకుతున్నారు.
  • వారికి ఉచిత విద్యుత్ కొనసాగించాలి
  • వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు కూడా వెంటనే అందించాలి
2024-12-27 12:21:39

బాబు బాదుడు మానుకోవాలి: భూమన

తిరుపతి..

  • భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్
  • సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చారు
  • విద్యుత్ చార్జీలు పెంచాము, తప్పనిసరిగా తగ్గిస్తాము అని అన్నారు
  • ప్రతీ ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి వినియోగదారులే విద్యుత్ అమ్మేలా చేస్తామన్నారు
  • సూపర్ సిక్స్ హామీలలో ముఖ్యమైన అంశం విద్యుత్ బాదుడు అంశం
  • 87వేల కోట్ల అప్పు చంద్రబాబు చేస్తే వైఎస్‌ జగన్ సీఎం అయ్యాక డిస్కంలకు బకాయిలు చెల్లించారు.
  • అధికారంలోకి రావడానికి విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు దోచుకుంటున్నారు.
  • ప్రతీ కుటుంబానికి 400 అదనపు భారం పడింది
  • దాదాపు 9 వేల కోట్లు ఆరు నెలల కాలంలో పెంచారు
  • ఎస్సీ, ఎస్టీలకు 200 యునిట్లు ఉచితంగా ఇస్తామని నేడు తుంగలో తొక్కారు.
  • అందుకే వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు 175 నియోజకవర్గంలో వినతిపత్రం ఇచ్చాము
  • గతంలో చంద్రబాబు సీఎం ఉన్న సందర్భంలో గుర్రాలతో ప్రజలను తొక్కించారు
  • ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. 
2024-12-27 12:19:06

టీడీపీ కార్యకర్తలే జగన్‌ సీఎం అవాలనుకుంటున్నారు: కాకాణి

నెల్లూరు..

  • విద్యుత్ చార్జీలకు నిరసనగా రూరల్ నియోజకవర్గంలోని ఆందోళనలు.
  • నిరసనల్లో పాల్గొన్న రూరల్ ఇంచార్జ్‌ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, అతిధిగా హాజరైన జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి..
  • వైఎ‍స్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆందోళనకి శ్రీకారం చుట్టిన నేతలు.
  • ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచను అంటూ చంద్రబాబు మాట్లాడిన వీడియోను చూపించిన కాకాణి..
  • అబద్దాలు చెప్పడం వైఎస్‌ జగన్ రక్తంలోనే లేదు..
  • చంద్రబాబు లాగా వైఎస్‌ జగన్ అబద్దాలు చెప్పి ఉంటే.. జీవితాంతం సీఎం చైర్‌లో జగన్ మాత్రమే ఉండేవారు..
  • కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలే.. వైఎస్‌ జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. 
2024-12-27 11:00:50

పార్టీ నేతల పోరుబాట..

చిత్తూరు జిల్లా..

  • పుంగనూరు పట్టణంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
  • పుంగనూరు పట్టణంలో విద్యుత్ చార్జీలు పెంపు నిరసిస్తూ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
  • పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప నిరసనలు
  • వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ ఎత్తున పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

కృష్ణా జిల్లా..

  • విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పోరుబాట
  • పామర్రులో కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
  • పామర్రు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పామర్రు సబ్ స్టేషన్ వరకూ ర్యాలీ
  • ర్యాలీ అనంతరం డీఈకి వినతిపత్రం ఇవ్వనున్న కైలే అనిలే కుమార్, పార్టీ నేతలు

తిరుపతి..

  • పెరిగిన విద్యుత్ చార్జీలపై గలమెత్తిన వైఎస్సార్‌సీపీ
  • తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
  • భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంఛార్జ్‌ భూమన కరుణాకర్ రెడ్డి,  ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, పార్టీ నేతలు. 
     
2024-12-27 10:48:48

బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారు: వాసుపల్లి గణేష్

విశాఖ..

  • మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్‌..
  • చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు.
  • బాబు, పవన్‌కు వెన్నుముక లేదు.. వారి మాటలు అలానే ఉంటాయి..
  • వినియోగదారులు కరెంట్ అమ్మేలా చేస్తా అని బాబు అన్నారు..
  • కరెంట్ అమ్మడం దేవుడెరుగు..
  • కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు..
  • విద్యుత్ వినియోగదారులపై భారం మోపడం సంపద సృష్టా?
  • ఉచిత కరెంట్ విధానాన్ని చంద్రబాబు ఎత్తేశాడు.
  • డిస్కంలకు అప్పులు చేసి చంద్రబాబు దిగిపోతే వైఎస్‌ జగన్‌ వాటిని చెల్లించారు..
  • చంద్రబాబు ప్రజల్లోకి వస్తే కరెంటు వైర్లతో బుద్ధి చెప్తారు..
     
2024-12-27 10:29:59

వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళనలు..

కాకినాడ

  • విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతల పోరుబాట
  • కాకినాడ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట పార్టీ నేతల ఆందోళన
  • సిటీ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి డీఈ కార్యాలయం వరకు ర్యాలీ
  • పోరుబాటలో పాల్గొననున్న కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
  • తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పిఠాపురంలో వంగా గీతా,
  • పెద్దాపురంలో దవులూరి దొరబాబు, జగ్గంపేటలో తోట నరసింహం ఆధ్వర్యంలో పోరుబాట.
  • పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్న నేతలు
2024-12-27 10:14:13

వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరుబాట

విద్యుత్‌ చార్జీల బాదుడిపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల పోరుబా

విశాఖ :

  • విద్యుత్ చార్జీల బాదుడిపై విశాఖ సౌత్ నియోజకవర్గంలో పోరుబాట..
  • పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు..
  • మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ..
  • హాజరైన సీనియర్ నేతలు కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ తదితరులు


కర్నూలు..

  • ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ పోరుబాటు
  • అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
  • ఇచ్చిన హామీలను మరచి విద్యుత్ ఛార్జీల పెంచడంపై మండిపడుతున్న సామాన్య ప్రజలు
  • పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ప్రజల తరపున పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ


అనంతపురం..

  • విద్యుత్ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు
  • అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ
  • విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్
  • అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం నుంచి పవర్ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ
  • పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
  • శింగనమల నియోజకవర్గంలో ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిరసన
  • ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
2024-12-27 10:11:02

ప్రకాశంలో ఫ్లెక్సీల కలకలం..

  • దర్శిలో ఫ్లెక్సీల కలకలం..
  • వైఎస్సార్‌సీపీ విద్యుత్ పోరుబాట నేపథ్యంలో రెచ్చగొట్టేలా టీడీపీ శ్రేణుల ఫ్లెక్సీలు..
  • టీడీపీ వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పోలీసులకు, మున్సిపల్‌ కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు.
  • టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మునిసిపల్ అధికారులు.
  • విద్యుత్ పోరుబాటకు ఆటంకాలు సృష్టిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం.
2024-12-27 10:11:02

ఏపీ ప్రజలకు కరెంట్ షాక్..

  • నమ్మించి నట్టేట ముంచిన సీఎం చంద్రబాబు
  • ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు పెంచం.. తిరిగి తగ్గిస్తాం అంటూ హామీ
  • టీడీపీ, జనసేన మేనిఫెస్టోలోనూ విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ
  • ఆరు నెలల్లోనే బట్టబయలైన సీఎం చంద్రబాబు నిజ స్వరూపం
  • రాష్ట్ర చరిత్రలో ఆరు నెలల్లోపు  ఏ ముఖ్యమంత్రి వేయని భారం మోపిన సీఎం చంద్రబాబు
  • విద్యుత్ చార్జీల పెంపుపై నోరు మెదపని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
  • ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం అంటూ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హామీ
  • విద్యుత్ చార్జీల బాదుడు చూసి వినియోగదారుల తీవ్ర ఆందోళన
2024-12-27 09:01:04

నిరసనలపై ప్రభుత్వం కుట్రలు..

  • వైఎస్సార్‌సీపీ నిరసనలను అడ్డుకునేందుకు ‍ప్రభుత్వం కుట్రలు..
  • నిరసన ర్యాలీలను అడ్డుకునేందుకు ఖాకీలను ఉసిగొల్పుతున్న ప్రభుత్వం
  • అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసుల బెదిరింపులు
  • అయినాసరే పోరుబాటలో కరెంటు బిల్లు బాధితులు
  • బిల్లు భారం భరించలేక ఏలూరు జిల్లా గవరవరంలో ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం
2024-12-27 08:09:06

నేడే విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

  • నేడే విద్యుత్ చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
  • రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయం
  • అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు
  • చంద్రబాబు మోసాలపై గట్టిగా నిలదీయాలని నిర్ణయం
  • విద్యుత్ ఛార్జీలను పెంచేదిలేదనీ, వీలైతే తగ్గిస్తానంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ
  • అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం
  • చంద్రబాబు "బాదుడు" నిర్ణయాలపై వైఎస్సార్‌సీపీ నిరసనలు
2024-12-27 08:09:06
Advertisement
 
Advertisement
 
Advertisement