ముఖ్యమంత్రి కేసిఆర్ డిక్టేటర్‌లా వ్యవహరిస్తూ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ డిక్టేటర్‌లా వ్యవహరిస్తూ ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని తెలంగాణ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ హెచ్చరించారు.
ప్రాజెక్టుల రీడిజైన్‌లంటూ కేసిఆర్ ఇష్టానుసారంగా నిర్మాణ వ్యయాలను రెట్టింపు చేస్తూ టెండర్లు లేకుండా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి ఆరోపించారు.యూనివర్శీటీలకు వీసీలుగా తనకు నచ్చిన వారిని నియమించుకునేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నిర్వాకం వల్ల యూనివర్శీటీలకు కేంద్ర నిధులు రాకుండా పోతున్నాయన్న పాల్వాయి ఇందుకు బాధ్యతగా కడియం శ్రీహరి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.