బాబు కాలం | Nine years chandra babu naidu rule very horrible | Sakshi
Sakshi News home page

బాబు కాలం

Published Thu, May 1 2014 2:22 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

Nine years chandra babu naidu rule very horrible

నరకయాతన అనుభవించాం
 చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో నరకయాతన అనుభవించాం.. వర్షాలు రాక .. కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం.. ప్రతి సంవత్సరం విద్యుత్ చార్జీలు పెంచి మా నడ్డివిరిచేవారు.. బిల్లులు చెల్లించకుంటే కనికరం లేకుండా మోటార్లు, స్టార్టర్లు తీసుకెళ్లేవారు..నా స్టార్టర్‌ను కూడా అలాగే తీసుకెళ్లారు.
 -మల్లారెడ్డి, రైతు, కొండాయపల్లె, కమలాపురం మండలం
 
 బాబు పాలనలో వర్షాలు పడేవికావు
 బాబు హయాంలో వర్షాలు పడేవి కావు. బోరు బావుల్లో నీరు తోడుకునేందుకు క ష్టంగా ఉండేది.. బిల్లులు కట్టలేదని ఎక్కడ స్టార్టర్లు తీసుకెళుతారోనని  పొలాల వద్దకు రాత్రనక, పగలనక పరుగులు తీసేవాళ్లం.. వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమని నమ్ముతున్నాం.
 -రామసుబ్బారెడ్డి,రైతు,పెండ్లిమర్రి గ్రామం,కలసపాడు
 
 ప్రభుత్వ బోరు అన్నా వినలేదు
 వైఎస్ దయతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోరు వేశారు.. పత్తిపంట చేతికొచ్చే  సమయంలో బిల్లు కట్టలేదని స్టార్టర్ తీసుకెళ్లారు.. గవర్నమెంట్ వేసిన బోరు అని చెప్పినా వినలేదు.. దీంతో రూ. 30 వేలు నష్టపోయాను..          
 -ఓబుళాపురం మాతయ్య,
 రైతు, ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం
 
 తర్వాత కడతానన్నా వినలేదు
 డబ్బులు వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లు కడతానని చెప్పినా వినలేదు. చంద్రబాబు పాలనలో బలవంతంగా స్టార్టర్ తీసుకెళ్లారు.. దీంతో పంట పూర్తిగా నష్టపోయి అప్పుల పాలయ్యాను.. వైఎస్ మరణంతో   మా బతుకులు చిందరవందర అయ్యాయి.   
 - మాచవరంవెంకటరామిరెడ్డి,
 రైతు, ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం
 
 ఆయన కాలంలో అప్పులే మిగిలాయి
 చంద్రబాబు హయాంలో అప్పులే మిగిలాయి.. అప్పట్లో నాకున్న మూడెకరాల్లో పొద్దుతిరుగుడు సాగుచేశా.. పంటలు సరిగా పండకపోయినా బిల్లు కట్టాల్సిందేనని స్టార్టర్లు తీసుకెళ్లారు.. వైఎస్ పుణ్యాన అప్పులు తీర్చుకున్నాను.        
 - కర్రాపోలిరెడ్డి, రైతు,
 ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం
 
 వందేళ్లయినా మరచిపోం
 చంద్రబాబు పరిపాలనను వందేళ్లయినా మరచిపోలేం.. కరెంట్ బిల్లులు కట్టలేదని స్టార్టర్లు, మోటార్లు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారు. బిల్లులు కట్టలేక మోటార్లను వదులుకోవాల్సిన పరిస్థితి.. మా గ్రామంలో నాతో సహా 30 మంది రైతుల స్టార్టర్లు తీసుకెళ్లారు.. ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రస్తుతం కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో లేం.          
 -ఈశ్వరరెడ్డి, రైతు,సర్పంచ్,
 తెల్లపాడు,కలసపాడు,మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement