సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ టారీఫ్ ఆర్డర్ జారీ చేసే వరకు రాష్ట్రంలో ప్రస్తుత చార్జీలే అమల్లో ఉంటాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016-17కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్) ను సమర్పించడంలో విద్యుత్ పంపణీ సంస్థ (డిస్కం) లు తీవ్ర జాప్యం చేయడంతో ఈ నెల 31 తేదీ లోపు కొత్త టారీఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ జారీ చేయలేకపోయింది.
డిస్కంలు ప్రతిపాదించిన చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహించి కొత్త టారీఫ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే అమల్లో ఉంటాయని తాజాగా ఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చింది.
అప్పటివరకు పాత విద్యుత్ చార్జీలే: ఈఆర్సీ
Published Thu, Mar 31 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement
Advertisement