
రాత్రీపగలు తేడా లేదు.. ఎప్పుడైనా ఐదు నిమిషాలు కరెంటు పోయిందంటే ఇబ్బందే. లైట్లు, ఫ్యాన్ల వంటి అత్యవసరాల నుంచి టీవీలు, ఇతర సాంకేతిక ఉత్పత్తుల దాకా ఏది నడ వాలన్నా విద్యుత్ కావాల్సిందే. ఈ కరెంటు చార్జీలు ఒకచోట భగ్గుమంటుంటే.. మరోచోట చాలా తక్కువగా ఉంటుంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో సగటున కరెంటు చార్జీలు ఎంత ఉన్నాయనే దానిపై ‘గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్’ ఓ పరిశోధన చేసి జాబితా లను రూపొందించింది.
చిత్రమైన విషయం ఏమిటంటే.. కొన్ని పేద దేశాల్లో కరెంటు చార్జీ లు అతితక్కువగా ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువున్నట్టు గుర్తించింది. మన రాష్ట్రం లో కరెంటు చార్జీల పెంపుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వివరాలేమిటో చూద్దామా..
నివేదికలో గృహ విద్యుత్ చార్జీల లెక్క ఇదీ..
►ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో 2021 చివరినాటికి ఉన్న విద్యుత్ చార్జీలను పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు.
►మొత్తం ప్రపంచవ్యాప్తంగా సగటున గృహ విద్యుత్ చార్జీలు రూ.10.22 పైసలుగా.. వాణిజ్య విద్యుత్ చార్జీలు రూ.9.30గా ఉన్నాయి.
►క్కువ గృహ విద్యుత్ చార్జీల్లో భారతదేశం సగటున యూనిట్‌కు రూ.5.73 ధరతో 41వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో విద్యుత్ చార్జీలు మన కంటే తక్కువ. ఇక మనదేశంలో వాణిజ్య విద్యుత్ (దుకాణాలు, పరిశ్రమల వంటి వాటికి ఇచ్చే) ధర సగటున రూ.8.30గా ఉంది.
► అమెరికా రూ.11.39 ధరతో 88వ స్థానంలో నిలిచింది.
►మన దేశంలో సగటున యూనిట్‌కు ధర (రూ.లలో)- 5.73
► తక్కువ గృహ విద్యుత్ చార్జీలు ఉన్న దేశాల్లో మన స్థానం -41
Comments
Please login to add a commentAdd a comment