cheapest price
-
అత్యంత చవకైన ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసిన బోట్..!
పాపులర్ వేరబుల్స్ బ్రాండ్ బోట్ (boAt) యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సెగ్మెంట్లో అత్యంత చౌకైన ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. ఆడియో వేరబుల్స్ మార్కెట్లోకి బోట్ 411 ఎయిర్‌డోప్స్‌ను (boAt 411 Airdopes) కంపెనీ లాంచ్ చేసింది. సరసమైన ధరలకు బడ్జెట్ ఉత్పత్తులను అందించడంలో బోట్ ప్రసిద్ధి చెందింది. కంపెనీ ఇంతకుముందు వేవ్ ప్రో 47 అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. బోట్ 411 ఎయిర్‌డోప్స్ ఇయర్‌బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, డ్యూయల్-ఎనేబుల్డ్ మైక్, టచ్ కంట్రోల్స్‌తో సహా అనేక ఫీచర్లతో రానుంది. ఇయర్‌బడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో తక్కువ ధరకే ఇయర్‌బడ్స్‌ను బోట్ తొలిసారిగా అందిస్తోంది. ధర ఏంతంటే..! బోట్ 411 ఎయిర్‌డోప్స్ ఇయర్‌బడ్స్ రూ. 1999 ఆకర్షణీయమైన ధరకు రానున్నాయి. బ్లాక్ స్టార్మ్, బ్లూ థండర్, గ్రే హరికేన్‌తో వంటి కలర్ వేరియంట్స్‌లో లభించనుంది. ఈ ఇయర్‌బడ్స్ బోట్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. బోట్ 411 ఎయిర్‌డోప్స్ స్పెసిఫికేషన్లు 10mm డ్రైవర్ boAt సిగ్నేచర్ సౌండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాంబియంట్ సౌండ్ మోడ్ అత్యుత్తమ కాలింగ్ నాణ్యతను అందించేందుగాను డ్యూయల్ ENx మైక్స్ చదవండి: ఆంబ్రేన్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే! -
అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్..! కేవలం రూ.329తో 1000జీబీ డేటా..!
BSNL: గత ఏడాది దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలు పోటీ పడుతూ మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా బీఎస్ఎన్ఎల్ పలు ప్లాన్స్‌ను ప్రకటించింది. తాజాగా బ్రాడ్ బ్యాండ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ. 329తో 1 టీబీ డేటా..! బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ఫైబర్ ఎంట్రీ ప్లాన్ రూ. 329ను ప్రకటించింది.ఈ ప్లాన్ కాల పరిమితి నెలరోజులు. ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్‌లో అత్యంత చౌకైన ప్లాన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్‌తో 1000జీబీ(1టీబీ) డేటా వరకు యూజర్లు గరిష్టంగా 20Mbps వేగాన్ని పొందవచ్చును. తరువాత నామమాత్రం స్పీడ్‌తో బ్రాడ్ బ్యాండ్ సేవలను యూజర్లకు కల్పిస్తోంది బీఎస్ఎన్ఎల్. కాగా ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అదనంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, STD కాలింగ్‌ను కూడా యాక్సెస్‌ను చేయవచ్చును. ఫైబర్ ఎంట్రీ ప్లాన్‌తో పాటుగా పైబర్ ఎక్స్పీరియన్స్, ఫైబర్ బేసిక్, ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్స్ నెలకు రూ. 399 నుంచి రూ. 599 అందుబాటులో ఉన్నాయి. సదరు ప్లాన్స్‌పై అదనపు డేటాతో పాటుగా, పలు ఓటీటీ సర్వీసులను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లే లక్ష్యంగా..! బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల పెంపును లక్ష్యంగా చేసుకొని బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త భారత్ ఫైబర్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్లను ప్రకటించింది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ విషయంలో ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ నుంచి బీఎస్ఎన్ఎల్ గట్టిపోటీను ఎదుర్కొంటుంది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా?
రాత్రీపగలు తేడా లేదు.. ఎప్పుడైనా ఐదు నిమిషాలు కరెంటు పోయిందంటే ఇబ్బందే. లైట్లు, ఫ్యాన్ల వంటి అత్యవసరాల నుంచి టీవీలు, ఇతర సాంకేతిక ఉత్పత్తుల దాకా ఏది నడ వాలన్నా విద్యుత్ కావాల్సిందే. ఈ కరెంటు చార్జీలు ఒకచోట భగ్గుమంటుంటే.. మరోచోట చాలా తక్కువగా ఉంటుంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో సగటున కరెంటు చార్జీలు ఎంత ఉన్నాయనే దానిపై ‘గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్’ ఓ పరిశోధన చేసి జాబితా లను రూపొందించింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. కొన్ని పేద దేశాల్లో కరెంటు చార్జీ లు అతితక్కువగా ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువున్నట్టు గుర్తించింది. మన రాష్ట్రం లో కరెంటు చార్జీల పెంపుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వివరాలేమిటో చూద్దామా.. నివేదికలో గృహ విద్యుత్ చార్జీల లెక్క ఇదీ.. ►ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో 2021 చివరినాటికి ఉన్న విద్యుత్ చార్జీలను పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు. ►మొత్తం ప్రపంచవ్యాప్తంగా సగటున గృహ విద్యుత్ చార్జీలు రూ.10.22 పైసలుగా.. వాణిజ్య విద్యుత్ చార్జీలు రూ.9.30గా ఉన్నాయి. ►క్కువ గృహ విద్యుత్ చార్జీల్లో భారతదేశం సగటున యూనిట్‌కు రూ.5.73 ధరతో 41వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో విద్యుత్ చార్జీలు మన కంటే తక్కువ. ఇక మనదేశంలో వాణిజ్య విద్యుత్ (దుకాణాలు, పరిశ్రమల వంటి వాటికి ఇచ్చే) ధర సగటున రూ.8.30గా ఉంది. ► అమెరికా రూ.11.39 ధరతో 88వ స్థానంలో నిలిచింది. ►మన దేశంలో సగటున యూనిట్‌కు ధర (రూ.లలో)- 5.73 ► తక్కువ గృహ విద్యుత్ చార్జీలు ఉన్న దేశాల్లో మన స్థానం -41 -
ఏ దేశంలో ఐఫోన్ 7 ఖరీదు తక్కువో తెలుసా?
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐ ఫోన్ 7 ఖరీదును చూసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఐ ఫోన్ 7 ఖరీదుపై పెద్ద ఎత్తున జోక్ లు పేలుతున్నాయి. మరి ఐ ఫోన్ 7అతి తక్కువ ధరకు దక్కించుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకసారి కిందకు వెళ్లాల్సిందే. దేశం కరెన్సీ ఐ ఫోన్ 7(32జీబీ)ధర భారత్ రూ.60 వేలు రూ.60,000 ఇటలీ 799 యూరోలు రూ.60,046 నార్వే 7,390నార్వీగియన్ క్రోన్లు రూ.59,893 స్వీడన్ 7,495స్వీడిష్ క్రోనాలు రూ.59,032 న్యూజిలాండ్ 1199 న్యూజిల్యాండ్ డాలర్లు రూ.56,285 డెన్మార్క్ 5,799 డానిష్ క్రోన్లు రూ.58,548 ఫిన్ లాండ్ 779 యూరోలు రూ.58,543 ఐ లాండ్ 779యూరోలు రూ.58,543 పోర్చుగల్ 779యూరోలు రూ.58,543 బెల్జియం 769యూరోలు రూ.57,791 ఫ్రాన్స్ 769యూరోలు రూ.57,791 నెదర్లాండ్స్ 769యూరోలు రూ.57,791 స్పెయిన్ 769యూరోలు రూ.57,791 ఆస్ట్రియా 759యూరోలు రూ.57,040 జర్మనీ 759యూరోలు రూ.57,040 లక్సెంబర్గ్ 743యూరోలు రూ.55,837 మెక్సికో 15,499 మెక్సికన్ పెసోలు రూ.54,842 ఆస్ట్రేలియా 1079 ఆస్ట్రేలియన్ డాలర్లు రూ.54,429 చైనా 5,388 యువాన్లు రూ.53,833 యూకే 599 పౌండ్లు రూ.53,169 తైవాన్ 24,500 న్యూ తైవాన్ డాలర్లు రూ.51,990 స్విట్జర్లాండ్ 759 స్విస్ ఫ్రాంక్ లు రూ.52,066 సింగపూర్ 1048 సింగపూర్ డాలర్లు రూ.51,600 హాంకాంగ్ 5,588 హాంకాంగ్ డాలర్లు రూ.48,199 జపాన్ 72,800 జపనీస్ యెన్లు రూ.47,433 యూఏఈ 2,599 యూఏఈ దిర్హామ్ లు రూ.47,342 కెనడా 899 కెనడియన్ డాలర్లు రూ.46,097 యూఎస్ఏ 649 అమెరికన్ డాలర్లు రూ.43,423 నోట్: ధరలన్నీ శనివారం నాటి(10-09-2016) భారతీయ మారక విలువల ప్రకారం ఇచ్చాం. యూకే, భారత్ లాంటి దేశాల్లోని ధరలు ట్యాక్స్ లతో కలిపి ఇవ్వడం జరిగింది. యూఎస్ తదితర దేశాల్లో ప్రాంతాల వారీగా పన్నుల్లో మార్పులు ఉండొచ్చు.