చంద్రబాబూ.. గుణపాఠం నేర్వరా?
విద్యుత్ చార్జీలను పెంచితే
మళ్లీ ప్రజా ఉద్యమమే
సీపీఎం నేత బాబూరావు హెచ్చరిక
బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళులు
విజయవాడ :
పేదలపై విద్యుత్ భారాలు మోపితే ప్రతిఘటన తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీ.హెచ్.బాబూరావు తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2000 సంత్సరంలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో జరిగిన ప్రజా ఉద్యమంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జరిపించిన పోలీసు కాల్పుల పాశవిక దాడికి 16 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఆదివారం సుందరయ్యభవన్‌లో నగర సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అమర వీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాబూరావు మాట్లాడుతూ 2000వ సంత్సరంలో విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేసి వాటిని తిప్పికొట్టారని గుర్తుచేశారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ విద్యుత్ చార్జీల పెంపునకు పూనుకోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ఆర్.తులసీరావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనా«థ్ తదితరులు పాల్గొన్నారు.