పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులపై మళ్లీ భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించింది. యూనిట్కు 50 పైసలు నుంచి రూపాయి వరకు వివిధ కేటగిరీల్లో ఛార్జీలు పెంచనున్నారు. వినియోగదారులపై 9,339 కోట్ల రూపాయలు భారం పడనుంది.
0 - 150 యూనిట్ల వరకు 50 పైసలు పెంచనున్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు, ఎల్టీ, కమర్షియల్ కేటగిరికి యూనిట్కు రూపాయి పెంచుతారు. కస్టమర్ ఛార్జీలు 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచుతారు. భారీ పరిశ్రమలకు యూనిట్కు 50 పైసలు పెరగనుంది. ఇప్పటికే కిరణ్ ప్రభుత్వంలో ప్రజలపై 24,204 కోట్ల రూపాయల భారం పడింది. ఛార్జీల పెంపు ద్వారా 12,500 కోట్లు రూపాయలు, సబ్ ఛార్జీల ద్వారా 11,704 కోట్ల రూపాయలు భారం పడింది.