
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కార్యాలయంలోకి సందర్శకుల ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించారు. ఆఫీసులోకి ప్రవేశించాలనుకునేవారు తమ వివరాలను సెక్యూరిటీ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈఆర్‌సీ కార్యదర్శి అనుమతి ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు చెప్పారు. పని వేళల్లో సందర్శకులు అధికారులను కలవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ, అవసరాల అంచనాల(ఏఆర్‌ఆర్‌ల)ను ఈఆర్‌సీకి గురువారం రహస్యంగా సమర్పించాయి. 2018–19లో అమలుచేయనున్న విద్యుత్ చార్జీల వివరాలనూ వీటితోపాటు పొందుపరిచాయి. ఏఆర్‌ఆర్ నివేదికలు, విద్యుత్ చార్జీల వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.