సజావుగా సాగేనా? | Today, the electricity tariff hike proposed Referendum | Sakshi
Sakshi News home page

సజావుగా సాగేనా?

Published Sat, Apr 9 2016 2:41 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM

సజావుగా సాగేనా? - Sakshi

సజావుగా సాగేనా?

నేడు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ
 
కరీంనగర్ : విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. విద్యు త్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజాభిప్రాయ సేకరణ  జరగనుంది. రిటైల్ సప్లయ్ టారిఫ్, క్రాస్ రాయితీ, అదనపు చార్జీల ప్రతిపాదనపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అసలే కరువు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతుండగా, చార్జీల పెంపు ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణ సజావుగా సాగేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ అభిప్రాయ సేకరణలో విపక్షాలు, ఉద్యమ సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ మండలి తీరుపై ధ్వజమెత్తాలని నిర్ణయించినట్లు సమాచారం.
 ఓ వైపు కరువు తాండవం, అప్పులబాధతో రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాట ధర లేక, ఆరుతడి పంటలు సైతం చేతికందని స్థితిలో రైతులు నిరాశ నిస్పృహలతో ఉంటే విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి. నీళ్లు లేక విద్యుత్ మోటార్లను ఉపయోగించుకునే స్థితిలోనే రైతులు లేరని, ఇక చార్జీల పెంపు ఎందుకని ప్రశ్నించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం దినసరి విద్యుత్ కోటా 10.553 మిలియన్ యూనిట్లు ఉంటే 9.9952 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగమవుతోందని, డిమాండ్ తగ్గిందని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement