న్యూఢిల్లీ: వివిధ కారణాలు చూపుతూ విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరిస్తుండటంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) స్పందించింది. ఇటువంటి ఘటనలు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతర్గత పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదనే కారణంగా హాల్ టికెట్లు ఇవ్వటం లేదనీ, ఫీజులు వసూలు చేస్తున్నారనీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యాదులు రావటంతో సీబీఎస్‌ఈ ఈ మేరకు పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 5వ తేదీ నుంచి పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు సీబీఎస్‌ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment