
బహిరంగ చర్చకు సిద్ధం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
తలారి సత్యం మృతికి తాను కారణమని ఆరోపణలు చేయడం తగదని, అంబేద్కర్ సాక్షిగా ప్రజాకోర్టులో బహిరంగ ...
నందిపేట(ఆర్మూర్) : తలారి సత్యం మృతికి తాను కారణమని ఆరోపణ లు చేయడం తగదని, అంబేద్కర్ సాక్షిగా ప్రజాకోర్టులో బహిరంగ చర్చ కు తాను సిద్ధమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మం డలంలోని అయిలాపూర్ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.
యువకుల మృతిపై ప్రతిపక్షా లు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్మూర్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీసీఎంలతో పాటు ఇతర పార్టీలు అఖిల పక్షం పేరుతో విచిత్రంగా ఒకటయ్యాయన్నా రు. అఖిల పక్షంలోని పార్టీలకు కార్యకర్తలు కరువయ్యారని, ఒకరిద్దరు నాయకులు పోగై శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.