సాక్షి, అమరావతి: గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 15 కిలో మీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కానీ గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment