TSRTC Decided To Reduce Advance Reservation Charges - Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం..

Published Mon, Jun 26 2023 7:55 PM | Last Updated on Mon, Jun 26 2023 8:37 PM

TSRTC Decided To Reducing Advance Reservation Charges - Sakshi

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ స‌ర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ ఛార్జీల‌ు ఈ మేరకు తగ్గనున్నాయి.  

ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీట‌ర్ల‌కు రూ.30గా ఛార్జీని టీఎస్‌ఆర్టీసీ నిర్ణ‌యించింది. సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ సర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నుంది. 

"టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌కు మంచి స్పంద‌న ఉంది. ప్ర‌తి రోజు స‌గ‌టున 15 వేల వ‌ర‌కు త‌మ టికెట్ల‌ను ప్ర‌యాణికులు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ను త‌గ్గించ‌డం జ‌రిగింది. ఈ స‌దుపాయాన్ని ప్ర‌యాణికులంద‌రూ ఉప‌యోగించుకుని.. సంస్థ‌ను ఆద‌రించాలి." అని టీఎస్ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కోరారు.

ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి నియామకం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement