
జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్‌ప్లాజ్ రుసుం చెల్లిస్తుంటాం కదా. అయితే ఇకపై ఆ ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు. అవునండి..మీరు నిత్యం అదే రహదారి గుండా ప్రయాణిస్తూ, మీ ఇళ్లు స్థానికంగా టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అందుకు కొన్ని ధ్రువపత్రాలు సమర్పించి టోల్‌పాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో మాట్లాడి మీ దగ్గరున్న అడ్రస్ ప్రూఫ్ సమర్పించాలి. ఆ సమయంలో మీ ఫాస్టాగ్ అకౌంట్‌తో అడ్రస్‌ప్రూఫ్‌ను లింక్ చేసి లోకల్ పాస్ జారీ చేస్తారు. అందుకోసం రూ.340 చెల్లించాల్సి ఉంటుంది. ఇది నెలపాటు పని చేస్తుంది. వచ్చేనెల తిరిగి ఈ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.340 చెల్లించి నెలరోజులపాటు టోల్ ఛార్జీలు పేచేయకుండా ప్రయాణించవచ్చు. అయితే ఈ లోకల్‌పాస్ కేవలం సంబంధిత టోల్‌ప్లాజాలో మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం అక్కడి టోల్‌రేట్లకు తగినట్లుగా పూర్తి ఛార్జీలు ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సిందే.
ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!
2021 ఆర్థిక సంవత్సరంలో ఫాస్టాగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.34,778 కోట్లు ఆదాయం సమకూరింది. 2022లో అది 46 శాతం పెరిగి రూ.50,855 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి పది నెలలకాలంలో రూ.50 వేలకోట్ల మార్కును దాటింది.
Comments
Please login to add a commentAdd a comment