మొక్క నాటుతున్న హైకోర్టు జడ్జి యు.దుర్గాప్రసాదరావు
మొక్కలు నాటి పట్టించుకోకుండా ఉండొద్దని, నాటిన మొక్కల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలని హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవాసదన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.
ఖమ్మం లీగల్ : మొక్కలు నాటి పట్టించుకోకుండా ఉండొద్దని, నాటిన మొక్కల సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలని హైకోర్టు న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవాసదన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం ఆయన ఖమ్మం చేరుకున్నారు. మొదట గాంధర్వ మొక్క నాటిన న్యాయమూర్తి.. ఆ మొక్కను ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు. అనంతరం జిల్లా ప్రధాన జడ్జి సీహెచ్.విజయ్‌మోహన్, హైకోర్టు విశ్రాంత జడ్జి సీతాపతి తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో న్యాయసేవా సదన్ కార్యదర్శి వి.ఎ.ఎల్.సత్యవతి సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయమూర్తికి ఘనస్వాగతం..
జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన హైకోర్టు జడ్జి యు.దుర్గాప్రసాదరావుకు జిల్లా ప్రధాన జడ్జి సిహెచ్.విజయమోహన్ ఆధ్వర్యంలో శనివారం ఘనస్వాగతం పలికారు. తొలుత ఖమ్మం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం చేరుకున్న ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిల్లా కోర్టుకు చేరుకుని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత జిల్లాకోర్టులో నిర్వహించిన వర్క్‌షాపులో పాల్గొన్నారు.