సెలబ్రెటీలకు ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్ట్‌లు ఉంటారు. వాళ్లు మేకప్ వేసుకున్నట్లు అనిపించకుండా నేచురల్‌గా ఉండేలా చేయడంలో మంచి నైపుణ్యం ఉన్నవారు. అలాంటి ఆర్టిస్ట్‌లు ఒక్క వ్యక్తికి మేకప్ వేయడానికి ఎంత తీసుకుంటారో వింటే షాకవ్వుతారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌లలో ఒకరు నిషా సింగ్. ఆమె ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్‌ల వద్ద మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. అలాగే కొన్ని బాలీవుడ్ సనిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆమె ఓ కల్చర్ సెంటర్(ఎన్‌ఎంఏసీసీ) ఈవెంట్ హాజరయ్యేందుక వెళ్తున్న నీతాఅంబానికి మేకప్ వేయాల్సి వచ్చింది. మొదట నిషా నీతాకు తన పని నచ్చుతుందా అని సందేహించారు. ఆ ఈవెంట్‌లో ఆమె బనార్సీ చీరలో అందంగా కనిపించేలా చేశారు. తొలుత నీతా అంబానీకి తానే మేకప్ వేయడానికి వెళ్తున్నానా! అని ఆశ్చర్యం వేసింది, పైగా ఎలా వేస్తానో? అని గాబరా పడిపోయానంటోంది నిషా.
అయితే తాను వేసిన మేకప్ నీతా అంబానికీ నచ్చడమే గాక ఆకట్టుకునేలా వేశారని తనని మెచ్చకున్నట్లు చెప్పుకొచ్చారు నిషా. నీతా అంబానీతో కలిసి పనిచేయడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చారు నిషా. బీర్‌సింగ్‌లో పుట్టిన నిషా ప్రస్తుతం ముంబైలో నివశిస్తున్నారు. ఆమె ఏడేళ్లు మేకప్, హెయిర్ స్ట్రైలింగ్‌లో మంచి శిక్షణ పొందిన ఆర్టిస్ట్. పైగా గౌరిఖాన్ మీరా రాజ్‌పుత్, కరణ్ జోహార్, కియారా అద్వానీ, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, షానాయ కపూర్, సారా అలీఖాన్, వాణి కపూర్, మానుషి చిల్లర్, అతియా శెట్టి, యామీ గౌతమ్ వంటి ప్రసిద్ధ బాలీవుడ్ ప్రముఖులతో కలసి పనిచేశారు.
నిషా సింగ్ తల్లి రామ్‌లఖాన్ సింగ్ టాటా మోటార్స్‌లో ఉద్యోగి కాగా, ఆమె తండ్రి అజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇద్దరూ ఇప్పుడు రిటైరయ్యారు. అంతేగాదు మేకప్ ఆర్టిస్ట్‌గా ధడక్, జగ్ జగ్ జీయో, భూల్ భూలయ్యా 2, పృథ్వీరాజ్ చౌహాన్, ఘోస్ట్ స్టోరీస్ వంటి చలనచిత్రాలకు కూడా పనిచేయడం విశేషం. ఆమెకు సోషల్ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్నారు. అంతేగాదు ప్రముఖ సెలబ్రెటీ క్లయింట్‌లకు సంబంధించిన వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటారు. ఇక ఒక్కో క్లయింట్‌కి నిషా సుమారు రూ. 30 వేలకు పైనే చార్జ్ చేస్తుందట.
(చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!)
Comments
Please login to add a commentAdd a comment