ఎటువంటి ఇంధన వనరులతో ప్రమేయం లేకుండా కేవలం విద్యుత్ ఛార్జింగ్‌తో అత్యంత వేగంగా నడిచే కారును టెస్లా సంస్థ రూపొందించింది. ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్ చేస్తే ఆగకుండా 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతమని టెస్లా సంస్థ సీఈఓ ఆలాన్ ముస్క్ తెలిపారు. 1.9 సెకండ్లలో ఈ కార్ 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ కారు అందుకుంటుందని ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇదొక సంచలనాత్మక ఆవిష్కరణ అని టెస్లా సంస్థ పేర్కొంది. సౌతాఫ్రికాకు చెందిన యువ సైంటిస్ట్ దీనిని రూపొందించినట్లు టెస్లా పేర్కొంది. ఈ కారును శుక్రవారం కాలిఫోర్నియాలో ఆటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.
ఎలక్ట్రిక్ కార్ ప్రత్యేకతలు
- ఈ కారుకు నాలుగు ఇండిపెండెంట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ మోటార్లు.. నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తాయి.
- ఈ కారులో గంటకు 60 మైళ్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు.
- ఈ కారులో నలుగురు కూర్చుని సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుంది.
- వెయ్యి కిలోమీటర్ల దూరం వరకూ చార్జింగ్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు.
- కేవలం రెండు సెకెండ్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని ఈ కార్ అందుకోగలదు.
Comments
Please login to add a commentAdd a comment