Top Stories
ప్రధాన వార్తలు
కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఆర్డర్ కాపీలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. హెచ్ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రాధమికంగా తేలింది. అవి దుర్వినియోగం అయ్యాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని వ్యాఖ్యలు చేసింది.కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అనంతరం హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. 45అంశాలతో 35పేజీల ఆర్డర్ కాపీని విడుదల చేసింది. ఈ సందర్బంగా.. ఉన్నత న్యాయస్థానం (Telangana High Court) పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. హెచ్ఎండీఏ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు ఉన్న అధికారాలను కోర్టు ఎప్పుడూ అన్యాయంగా తీసుకోదు. ఏసీబీ చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యత గల హోదాలో ఉన్నారు. మరో నిందితుడితో కలిసి కేటీఆర్ హెచ్ఎండీఏ(HMDA) నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండీఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. సొంత లబ్ధి కోసమా.. లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా.. అనేదానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది.అయితే, నిధుల దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్(FIR)లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్ఐఆర్లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆధారాలు సేకరించాల్సిన సమయం దర్యాప్తు సంస్థలకు కావాలి. దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోలేదు’ అని ధర్మాసనం కామెంట్స్ చేసింది. ఇది కూడా చదవండి: ఏసీబీ దూకుడు.. ‘సుప్రీం’కు చేరిన ఈ-కార్ రేసు పంచాయితీ!
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.
బాబూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా?: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది.ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్ పార్టీకి బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు.
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ
Congress Vs BJP: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీసుపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ ఆఫీసు నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వైపు బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో, మరోసారి ఉద్రికత్త చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు కాషాయ పార్టీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. పార్టీ ఆఫీసుపై దాడి నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపైన కాంగ్రెస్ దాడి దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగానే వ్యవహరిస్తోంది. తిరగబడి మేము కూడా దాడి చేస్తే ఢిల్లీలో మీ జాతీయ నాయకులు ఎక్కడ దాక్కుంటారు. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలి.కేటీఆర్ తప్పించుకుని ఎన్ని రోజులు తిరుగుతారు. చంచల్గూడా వెళ్లాలా లేక తీహార్ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ డిసైడ్ చేసుకోవాలి. కేటీఆర్ జైలుకు వెళితే సానుభూతి రాదు. డబ్బులు ఎక్కువై కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం భయంకరమైన అవినీతికి పాల్పడింది. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. తెలంగాణ అధ్యక్ష పదవిపై ఎలాంటి చర్చ లేదు. దానిపై నన్ను ఎవరూ అడగలేదు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..‘బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దుండగులు దాడి చేయడం దారుణం. దాడుల వల్ల హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతిభద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు అధికారులను బలి పశువులను చేస్తున్నారు. నాడు కేటీఆర్ అధికారులను భయపెట్టి పని చేయించుకున్నారు. కేటీఆర్ నిర్దోషి అయితే నిలబడి ఎదుర్కోవాలి. అంతేగానీ కోర్టులకి వెళ్లి తప్పించుకోవడానికి చూడకూడదు.కాళేశ్వరంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది?. ధరణి స్కామ్‌పై ఏం కేసులు పెట్టారు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది. వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి చిన్న కేసులు పెడుతున్నారు. పెద్ద కేసుల నుంచి బీఆర్ఎస్ నేతలను తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్
భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారు లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) హర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పేరుతో ఓ సరికొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరూ సులభమైన పద్ధతిలో పొదుపు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చు.హర్ ఘర్ లఖ్పతి పథకం (Har Ghar Lakhpati Scheme)హర్ ఘర్ లఖ్పతి పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఓ సరికొత్త పొదుపు స్కీమ్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా కుటుంబం ఆర్థికంగా కొంత వృద్ధి చెందవచ్చు. అంతే కాకుండా క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది పెద్దవారికి మాత్రమే కాకుండా.. మైనర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.హర్ ఘర్ లఖ్పతి పథకం కింద ప్రజలు 12 నెలల నుంచి 120 నెలల (1 ఏడాది నుంచి 10 సంవత్సరాలు) వరకు పొదుపు చేసుకోవచ్చు. వివాహాలకు లేదా ఇంటి కొనుగోళ్లు వంటి వాటికి ప్లాన్ చేసుకునేవారికి ఇది కొంత ప్రయోజనకారిగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.వడ్డీ రేటు●సాధారణ ప్రజలకు 6.75 శాతం●సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం●స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు 8 శాతం●ఆదాయ పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. పన్ను మినహాయింపు వర్తిస్తుందినెలవారీ పెట్టుబడులుహర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పథకం కింద.. నెలవారీ పెట్టుబడులు చేయడం ద్వారా లక్ష రూపాయలు పొందవచ్చు. సాధారణ పౌరులకు, 6.75 శాతం వడ్డీతో మూడు సంవత్సరాలకు నెలకు రూ. 2,500 లేదా 6.50 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,407 పెట్టుబడి పెట్టడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్లు 7.25 శాతం చొప్పున మూడేళ్లపాటు నెలవారీ రూ. 2,480 లేదా 7 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,389 పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని పొందవచ్చు.ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. EMI ఆలస్యమైనా పర్లేదు!జరిమానాలువాయిదా ప్రకారం తప్పకుండా డిపాజిట్ చేయాలి. అలా చేయని సమయంలో లేదా ఆలస్యమైతే రూ.100కు రూ.1.50 పైసలు నుంచి 2 రూపాయలు జరిమానా పడుతుంది. అంతే కాకుండా ఆరు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటికి మీరు పొదుపు చేసిన మొత్తం సేవింగ్ ఖాతాకు బదిలీ అవుతుంది.అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?●హర్ ఘర్ లఖ్పతి రికరింగ్ డిపాజిట్ పథకం కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే.. సమీపంలోని SBI బ్రాంచ్ సందర్సించాలి.●ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ సమర్పించాలి.●ఖాతా ప్రారంభించే సమయంలోనే మెచ్యూరిటీ మొత్తాన్ని, ఈఎంఐ వంటి వాటిని లెక్కించుకోవాలి.
గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్ వెడ్డింగ్ లుక్స్
పాపులర్ సూఫీ సింగర్ తన ప్రేయసితో నిఖా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. పవిత్రమైన ప్రేమ పాటలకు పాపులర్ అయిన బిస్మిల్, షిఫాఖాన్తో జీవితాన్ని పంచుకున్నాడు. డిజైనర్ పెళ్లి దస్తులు, విలువైన ఆభరణాలతో వధూవరులిద్దరూ రాయల్ లుక్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. వీరి పెళ్లి ప్రయాణంలో విశేషం ఉంది. అదేంటో తెలుసు కోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.ప్రముఖ సూఫీ గాయకుడు, బిస్మిల్ ఎన్నోపవిత్రమైన ప్రేమ పాటలకి తన గాత్రాన్ని అందించాడని చెప్పుకున్నాం. గత ఏడాది జనవరి 5న, 'పింక్ సిటీ' జైపూర్‌లో, బిస్మిల్ షిఫా ఖాన్ (ఇపుడు భార్య)తో కలిసి ఒక యుగళగీతాన్ని పాడాడు. అలా సంవత్సరం గడిచిందో లేదో ఆమెతో కలిసి వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు. బంధువుల ద్వారా పరిచయమైన షిఫాతో ప్రేమలో పడిపోయాడు. సరిగ్గా ఏడాదికి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. జీవితంలో మరపురాని రోజు, తన నిఖా ఫోటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు స్టన్నింగ్ బ్రైడల్ లుక్ వధువు షిఫా ఖాన్ డార్క్ రెడ్ కలర్ డిజైనర్ లెహెంగా చోలీలో పెళ్లికూతురిలా మెరిసి పోయింది. చేతితో చేసిన డిజైన్, విలాసవంతమైన గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఎలిగెంట్ లుక్ నిచ్చాయి. లెహెంగాకు మ్యాచింగ్, జర్దోజీ దుపట్టా మరింత అందాన్నిచ్చింది. ఇంకా డైమండ్స్, పచ్చలు పొదిగిన లేయర్డ్ నెక్లెస్, చెవిపోగులు, మాంగ్ టీకా, ఉంగరాలు, ఎరుపు, తెలుపు ,బంగారు షేడ్స్‌తో కూడిన గాజులతో అద్భుతంగా కనిపించింది. నేనేం తక్కువ అన్నట్టు బిస్మిల్ లుక్క్రీమ్-హ్యూడ్ తలపాగా గ్రీన్, వైట్ షేడ్స్‌లో మెరిసే రాళ్లతో రూపొందించిన బంగారు బ్రూచ్తో అందంగా మెరిశాడు బిస్మిల్. వజ్రాలు పచ్చలతో కూడిన లేయర్డ్ నెక్లెస్‌తో తన పెళ్లి రోజుకు రింత ఐశ్వర్యాన్ని జోడించాడు. అంతేనా అతని చేతి గోల్డెన్ వాచ్మరింత విలాసాన్నిచ్చింది. అందమైన ఫోటోలుస్వచ్ఛమైన ప్రేమ, ఆనందంతో నిండిన తమ నిఖా ఫోటోలు అభిమానులను ఆకట్టు కున్నాయి. చుక్కలాంటి వధువు, షిఫా ఖాన్ నుదిటిపై ముద్దు పెట్టడం, నిఖానామాపై వధూవరులిద్దరూ సంతకాలు పెట్టడంతోపాటు, వేలిముద్రలు ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Bismil (@bismil.live)
బిల్డప్ బాబు.. తగ్గేదే లే అంటున్న రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు స్టైల్లోనే ప్రవర్తిస్తున్నారా? జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపే ప్రయత్నం చేస్తున్నారా?. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును గమనిస్తే ఈ అనుమానాలు రాకపోవు. ‘‘నేను మారా.. మీరూ మారాలి.. మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు నా వద్ద ఉన్నాయి’’. ‘‘ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించా..నా ప్రొగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించుకున్నా..దానిని అందరికి అందచేస్తా..’’, ‘‘హైదరాబాద్‌లో ఉంటున్న నాకు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నాకు అన్నీ తెలుసు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వంలో తప్పులు ఏమీ జరగలేదు..పొరపాట్లు జరిగాయని ఎవరైనా భావిస్తే నా దృష్టికి తీసుకు వస్తే సరిదిద్దుకునేందుకు వెనుకాడను. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పని చేశా.. మంత్రులు కూడా అలాగే పని చేశారు.. రేషన్ డీలర్లు, అంగన్వాడీల ఎంపిక జోలికి వెళితే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయి.. వచ్చే పంచాయతీ ఎన్నికలలో అన్ని చోట్ల గెలవాలి. అవి కీలకం. పదవుల గురించి తొందరపడవద్దు..అన్నీ జరుగుతాయి.." అని రేవంత్ అన్నట్లు వార్తా పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అంతేకాక.. ‘‘మొదటి సారి గెలవడం ఓకే .. రెండో సారి గెలవడమే గొప్ప.., సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్ లు వస్తాయి..’’ అని కూడా అన్నారంటూ కొన్ని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ ప్రసంగం అంతా పరిశీలించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని నడుపుతున్న స్టైల్లోనే, అందులోను చంద్రబాబు నాయుడు సరళిలోనే రేవంత్(Revanth) వ్యవహార శైలి ఉన్నట్లు కనిపిస్తుంది. 1995లో తన మామ ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసేవరకు తన వర్గ ప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం పనిచేసిన చంద్రబాబు సీఎం అయ్యాక మొత్తం సీన్ మార్చేశారు. ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి మొదట్లో కొన్ని ట్రిక్స్ అమలు చేసినా, వారిపై పట్టు వచ్చాక స్టైల్ మార్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలకు ఆయన టైమ్ లోనే ప్రాధాన్యత వచ్చింది. మీడియాను తన గుప్పెట్లో పెట్టుకుని లీకులు ఇప్పించే వారు. అవసరమైతే ఆయనే ఆయా మీడియా సంస్థలలోని కాస్త కీలకమైన జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు. .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరు కలిసినా, 'అలా అన్నారు..ఇలా అన్నారు.."అంటూ పూర్తిగా పాజిటివ్ యాంగిల్ లోనే కవరేజీ వచ్చేలా చేసుకునే వారు. కేబినెట్ సమావేశాలలో సైతం అదే ధోరణి. తాను మారానని, మీరూ మారాలని చెబుతుండే వారు. కాకపోతే ఆయన ఏమి మారారో, తాము ఎక్కడ మారాలో అర్థ అయ్యేది కాదు. తాను అవినీతి లేకుండా పనిచేస్తున్నట్లుగా పిక్చర్ ఇచ్చేవారు. కానీ పార్టీలోని ఇతర నేతలకు వాస్తవాలు తెలుసు. అయినా ఎవరికి వారు తమ అవసరాల రీత్యా ఆయన వద్ద మాత్రం తలూపి వచ్చేవారు. అక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ అక్రమం చేసినా బయట పడకుండా జరగాలన్నది చంద్రబాబు సిద్దాంతం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, మంత్రులు కూడా పనిచేయాలని, అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని చెప్పేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తద్వారా తాను ఒక్కడినే కష్టపడుతున్నానన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు. అదే ప్రకారం ప్రచారం చేయించుకునేవారు. విశేషం ఏమిటంటే గత టరమ్ లో మొదటి ర్యాంకు వచ్చిందని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరికి ఆ తర్వాత టిక్కెట్లు ఇవ్వలేదు. అది వేరే సంగతి. రేవంత్ వ్యాఖ్యలు చదివితే అచ్చం తన గురువు దారిలోనే ఉన్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ హై కమాండ్ బలహీనంగా ఉండడం రేవంత్ కు కలిసి వచ్చిన పాయింట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మంత్రుల, ఎమ్మెల్యేల జాతకాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో మినహాయించి మిగిలిన సీఎంలకు అంత స్వేచ్చ ఉండేది కాదు. పైగా వర్గపోరు ఉండేది. వైఎస్ కు కూడా వర్గాల తలనొప్పి ఉన్నా, అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేసేవారు. రేవంత్ కూడా ఇప్పటికైతే వర్గపోరు లేకుండా పాలన సాగిస్తున్నారు. కాని అవకాశం వస్తే ఆయనపై అధిష్టానంపై ఫిర్యాదు చేయడానికి పలువురు సిద్దంగానే ఉంటారు. ఇంతకీ రేవంత్ ఏమి మారారో ఎవరికి తెలియదు. నిజానికి పీసీసీ(PCC) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న తీరుకు చాలా తేడా ఉందన్నది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. రుణమాఫీ విషయంలో కొంతవరకు సఫలమైనా, బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కొన్ని వాగ్దానాలను నెరవేర్చినప్పటికి ఆరు గ్యారంటీలలో కీలకమైన హామీల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ గురించి ప్రజలు అడిగితే జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో ఆశించిన రీతిలో రియల్ ఎస్టేట్ సాగడం లేదు.హైడ్రా కూల్చివేతలు, మూసి హడావుడి వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా, వాటిపై నిర్దిష్ట కార్యాచరణ అంతంతమాత్రంగానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినా, దాని వల్ల ఎంత ఫలితం వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో.. తన ప్రభుత్వంలో తప్పులే జరగలేదని, ఏవైనా జరిగితే అవి పొరపాట్లేనని రేవంత్ అంటే పైకి అవునవును అని చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విషయాన్ని మరీ తెగేదాక లాగడం చాలామంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. సినిమా పరిశ్రమను నష్టపరిచేలా గతంలో ఏ ప్రభుత్వం వ్యవహరించలేదు. కాని ఇప్పుడు రేవంత్ వారిపైకి దూకుడుగా వెళ్లారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని అంటున్నారు. భాష విషయంలో కూడా రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన తీరులోనే ఉండడం కొంతమందికి రుచించడం లేదు. సాధారణ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవుతోందని, దానిని గుర్తించి సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. చంద్రబాబు మాదిరి 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే నమ్మడం కష్టమే నని ఒక నేత అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సి.ఎమ్.లు ఉదయం పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి విధానపరమైన నిర్ణయాలు చేసి,ఫైళ్లు ఏమైనా ఉంటే చూసి ఇంటికి వెళ్లిపోయేవారు. అక్కడనుంచి ఏవైనా అత్యవసర పనులకు అటెండ్ అయ్యేవారు.ప్రజలను, పార్టీ వారిని కలిసేవారు. చంద్రబాబు వచ్చాక ఈ ధోరణి మార్చుకున్నారు. పని ఉన్నా, లేకపోయినా ఆఫీస్ లో గడపడం అలవాటు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్. తెల్లవారు జామున అధికారులతో భేటీ అవుతుండేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారు తెల్లవారేసరికల్లా ప్రజలను గడవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే పదిగంటలకు ఆఫీస్ కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేవారు. కేసీఆర్ ఎక్కువగా క్యాంప్ ఆఫీస్ లోనే ఉండేవారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. నిజానికి ఏ సీఎం అన్ని గంటలు పనిచేయవలసిన అవసరం ఉండదు. అంత పని కూడా ఉండదు. చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా ఇతర పార్టీల నేతలతో అంతరంగికంగా సంబంధాలు పెట్టుకున్నారన్నది కొందరి భావనగా ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని భావిస్తున్నారు. అందువల్లే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటివారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగిడారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్డీయే, ఐఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని ఒక కాంగ్రెస్ నేత చమత్కరించారు. అంతేకాదు. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పాత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని, చంద్రబాబు, రేవంత్ లు రాజకీయంగా సహకరించుకుంటున్నారని ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఏది ఏమైనా రేవంత్ లో నిజంగా ప్రజలకు ,పార్టీకి ఉపయోగపడేలా మార్పు వస్తే మంచిదే. కాని ఆయన కూడా అధికార దర్పంతో ఉంటే అందరికి నష్టం అనే అభిప్రాయం నెలకొంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!
రాజస్థాన్(Rajasthan)కి చెందిన బిష్ణోయ్ తెగ(Bishnoi community) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఎవరామె..? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన పరి విష్ణోయ్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. అయితే ఆమె విజయ తీరాలను అంత సులభంగా చేరుకోలేదు. ఫిబ్రవరి 26, 1996న బికనీర్‌లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్ బిష్ణోయ్ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్ పోలీసు అధికారి. ఆమె ఇంటర్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్‌లోని ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్ జెఆర్ఎఫ్ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. అయితే సివిల్స్ ఎగ్జామ్ తొలి రెండు ప్రయత్నాలలో పరి ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక పరి తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్ ఇస్తూ..2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు. తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖ(Ministry of Natural Gas)లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్‌టక్(Gangtok)లో ఎస్డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!)
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.సంధ్య థియేటర్ విషాదం..అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్)అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్‌ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
ముగ్గు ఇలా కూడా పెట్టొచ్చా..! జస్ట్ కలర్స్‌తో..
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
రాష్ట్రపతి మెచ్చిన మిట్టీ కేఫ్..దివ్యాంగులకు చేయూత
పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయిన పేసు గుర్రం
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ హీరోయిన్‌తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
కాంగ్రెస్‌కు షాక్..! ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు
గేమ్ ఛేంజర్ ఈవెంట్: మృతుల కుటుంబాలకు రామ్‌చరణ్ ఆర్థిక సాయం
అమెరికాను హడలెత్తిస్తున్న మంచు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు.
భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
నా కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవానికి వెళ్లాలి
రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు.. ఇరగదీశాడు..!
ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
ముగ్గు ఇలా కూడా పెట్టొచ్చా..! జస్ట్ కలర్స్‌తో..
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
రాష్ట్రపతి మెచ్చిన మిట్టీ కేఫ్..దివ్యాంగులకు చేయూత
పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయిన పేసు గుర్రం
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ హీరోయిన్‌తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
కాంగ్రెస్‌కు షాక్..! ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు
గేమ్ ఛేంజర్ ఈవెంట్: మృతుల కుటుంబాలకు రామ్‌చరణ్ ఆర్థిక సాయం
అమెరికాను హడలెత్తిస్తున్న మంచు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు.
భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
నా కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవానికి వెళ్లాలి
రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు.. ఇరగదీశాడు..!
సినిమా
అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. మంగళవారం నాడు ఆయన చెన్నై విమానాశ్రయంలో కనిపించగా అక్కడున్న మీడియా కొన్ని ప్రశ్నలడిగింది. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగ్గా రజనీ.. 70 శాతం పూర్తయిందని చెప్పాడు. మిగతాది జనవరి 13 నుంచి 28 మధ్య షూటింగ్ చేస్తామన్నాడు. ఇంతలో ఓ జర్నలిస్ట్.. తమిళనాడులో మహిళ భ్రదత గురించి ప్రశ్నించగా రజనీ అసహనం వ్యక్తం చేశాడు. రాజకీయ ప్రశ్నలు అడగవద్దని చెప్పాను కదా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఏం జరిగింది?గతేడాది డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియుడితో మాట్లాడుతోంది. వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి వారిని వీడియో చిత్రీకరించినట్లు వెలుగుచూసింది. ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేసి యువతిని భయపెట్టి లొంగదీసుకున్నట్లు బయటపడింది. లైంగికదాడికి పాల్పడటమే కాకుండా తను చెప్పినప్పుడల్లా రావాలని, తాను చెప్పే సార్ వద్దకు వెళ్లాలని హెచ్చరించడం గమనార్హం. ఇదే తరహాలో మరో అమ్మాయిని కూడా బెదిరింపులతో లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు డీఎంకే పార్టీ కార్యకర్త అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
బాలీవుడ్ సినిమాలకు సంతకం చేశా.. చివరకు నన్నే పక్కనపెట్టేశారు!
సినిమాకు సంతకం చేసినవారిని పక్కనపెట్టేసి వేరే హీరోహీరోయిన్లతో సినిమాలు తీసిన సంఘటనలు కోకొల్లు. తనకూ అలాంటి చేదు అనుభవం ఎదురైందంటున్నాడు తెలుగు హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan). హిందీలో అలాంటి ఘోర అనుభవాలు ఎదుర్కొన్నానన్నాడు. ఇతడు షోర్ ద సిటీ (2010) మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు. 2019లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను ఓటీటీ మాధ్యమం ద్వారా పలకరించాడు.మొదట్లో ఎగ్జయిటయ్యా!హిందీలో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ బయటపెట్టాడు. అతడు మాట్లాడుతూ.. షోర్ ఇన్ ద సిటీ సినిమా కంటే ముందే నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. ఆ రెండూ కూడా ప్రముఖ నిర్మాణ సంస్థల బ్యానర్లో కావడంతో చాలా ఎగ్జయిట్ అయ్యాను. నేను అనుకుందొకటైతే జరిగింది మరొకటి! రెండేళ్లపాటు ముంబైలో ఖాళీగా కూర్చున్నాను. ఆ సమయంలో ఒక తమిళ్, రెండు తెలుగు చిత్రాలు నా చేతిలో ఉన్నప్పటికీ ఆసక్తి చూపించలేదు. సౌత్‌లో ఆఫర్స్ వదిలేసుకున్నా..ఆల్రెడీ హిందీలో రెండింటికి సంతకం చేసినందున వేరే ఆఫర్లను వదిలేసుకున్నాను. పోనీ ఇంత చేసినా నాకేమైనా ఉపయోగం ఉందా? అంటే అదీ లేదు! నన్ను అంతకాలం వెయిట్ చేయించి చివరి నిమిషంలో ఆ సినిమాల్ని వేరేవారితో మొదలుపెట్టారు. మోసపోయాననిపించింది. అందుకే దక్షిణాది ఇండస్ట్రీలోనే నిజాయితీగా ఉండాలనుకున్నాను. ఇక్కడే కొనసాగుతున్నాను.(చదవండి: ఒకప్పుడు క్షమించేవాళ్లు.. ఇప్పుడలా కాదు!: బాలీవుడ్ హీరో)కేవలం భాష కోసం..బాలీవుడ్ (Bollywood)లో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకోలేదు. కాకపోతే కేవలం హిందీ భాష కోసం అక్కడ సినిమాలు చేయాలనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. నా భాషలోనే సినిమాలు చేస్తాను. అది అందరికీ నచ్చుతుందనుకుంటే హిందీలోనూ రిలీజ్ చేస్తాను. ఇప్పుడందరూ చేస్తుందదేగా! అని చెప్పుకొచ్చాడు.కెరీర్ మొదలుసందీప్ కిషన్ చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు చోటా కె నాయుడు, శ్యామ్ కె నాయుడుకు దగ్గరి బంధువు. సినిమానే వృత్తిగా ఎంచుకోవాలని 2008లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఇందుకోసం మొదటగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వద్ద ఏడాదిపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే స్నేహగీతం సినిమా ఛాన్స్ అందుకున్నాడు. తెలుగులో హీరోగా..అడల్ట్ కామెడీ సినిమా ఆఫర్లు వస్తే తిరస్కరించాడు. అలాంటి చిత్రాల్లో నటించబోయేది లేదని తేల్చి చెప్పాడు. ప్రస్థానం సినిమాతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. స్నేహ గీతం చిత్రంతో హీరోగా మారాడు. రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి, డి ఫర్ దోపిడి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బీరువా, జోరు, రారా కృష్ణయ్య, ఒక్క అమ్మాయి తప్ప, శమంతకమణి, నక్షత్రం, మనసుకు నచ్చింది, ఏ1 ఎక్స్‌ప్రెస్, మైఖేల్ వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు.నిర్మాతగానూ..గతేడాది ఊరు పేరు భైరవకోనతో అలరించాడు. కెప్టెన్ మిల్లర్, రాయన్ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించాడు. ప్రస్తుతం కూలీ మూవీలో నటిస్తున్నాడు. ఇది కాకుండా అతడి చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. ఇతడు హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా! నిను వీడని నీడను నేనే, వివాహ భోజనంబు, ఏ1 ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు.చదవండి: ఈ హీరోయిన్ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్
Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’
క్రికెట్లో వరల్డ్ కప్ ఎలాంటిదో సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అలాంటిది. ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని కల కంటారు. గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం అస్కార్ గెలిచి.. భారత ఖ్యాతీని పెంచేసింది. ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే వాటిల్లో సూర్య ‘కంగువా’(Kanguva Movie ) ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’(Aadujeevitham: The Goat Life) కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ ,'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.‘లాపతా లేడీస్’ నో ఎంట్రీఇండియా నుంచి మొదటగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’(Laapataa Ladies ) ఆస్కార్‌కు ఎంపికైంది. అయితే ఈ చిత్రం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. డిసెంబర్ 17న ఆస్కార్ షార్ట్ లిస్ట్ చిత్రాలను అకాడమీ ప్రకటించింది. వాటిలో లాపతా లేడీస్ కు చోటు దక్కలేదు. కానీ భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌కి ఎంపికైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్’ హిందీ చిత్రం యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం సొంతం చేసుకుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో అధికారికంగా చోటు సాధించింది.ఆస్కార్ బరిలో ఫ్లాప్ చిత్రాలుఉత్తమ చిత్రం విభాగంలో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం(ది గోట్ లైఫ్) సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఆయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైప్ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది.అయితే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు రూ. 2000 కోట్లను కొల్లగొట్టే సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుంచి ప్రచారం చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించలేదు. నటన, మేకింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంది. BREAKING: Kanguva ENTERS oscars 2025🏆 pic.twitter.com/VoclfVtLBL— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025
ఈ హీరోయిన్ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్
ఆరంభం అదిరిపోతే ఆ కిక్కే వేరుంటుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) మహారాజ్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో గతేడాది విడుదలై ట్రెండింగ్‌లో నిలిచింది. తొలి సినిమానే సక్సెస్ సాధించాడని ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం జునైద్.. లవ్యాపా మూవీ (Loveyapa Movie) చేస్తున్నాడు. ఇందులో దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరూ వెండితెరపై కనిపించబోయే తొలి చిత్రం ఇదే కావడం విశేషం!సాంగ్ రిలీజ్ఖుషి గతంలో ద ఆర్చీస్ అనే సినిమా చేసింది. కానీ ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇకపోతే లవ్యాపా నుంచి ఇటీవలే లవ్యాపా హో గయా అనే పాట రిలీజ్ చేశారు. ఇది చూసిన జనాలు పాట బాగుంది, కానీ ఈ లవ్‌ట్రాక్ మాత్రం కాస్త విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే జునైద్ తండ్రి, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan).. పాట మాత్రమే కాదు సినిమా కూడా అదిరిపోయిందంటున్నాడు.శ్రీదేవిని చూసినట్లే ఉందితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. లవ్పాయా సినిమా రఫ్ కట్ చూశాను. మూవీ చాలా బాగుంది. వినోదాత్మకంగా ఉంది. నాకు నచ్చింది. సెల్ఫోన్ల వల్ల మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి? ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనేది చక్కగా చూపించారు. అందరూ బాగా నటించారు. సినిమాలో ఖుషిని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) ని చూసినట్లే ఉంది. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆవిడ ఎనర్జీ నాకు అక్కడ కనిపించింది అని చెప్పుకొచ్చాడు.(చదవండి: శుభవార్త చెప్పిన హీరోయిన్.. పట్టలేనంత సంతోషం, కొంత నిరాశ!)మరీ ఇంత అబద్ధమాడాలా?ఇది చూసిన నెటిజన్లు ఖుషిని గొప్ప నటి శ్రీదేవితో పోల్చవద్దని వేడుకుంటున్నారు. ప్లీజ్ యార్.. మరీ ఇంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు, పిల్లలపై ప్రేమతో ఏదైనా అనేస్తావా?.. అని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లవ్యాపా విషయానికి వస్తే.. తమిళ హిట్ మూవీ లవ్ టుడేకు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా ఫాంటమ్ స్టూడియోస్, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ కొత్త హీరోహీరోయిన్లను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!ఖుషి అక్క ఆల్రెడీ సత్తా చాటుతోంది!ఇప్పటికే ఖుషి అక్క జాన్వీ కపూర్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. సౌత్‌లో దేవర మూవీతో కుర్రాళ్ల మనసులో గిలిగింతలు పెట్టింది. రామ్చరణ్తోనూ ఓ సినిమా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మల తల్లి శ్రీదేవి అతిలోక సుందరిగా ప్రేక్షకల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది.గొప్ప నటి శ్రీదేవితెలుగులో కార్తీకదీపం, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలతో అలరించింది. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ అగ్రకథానాయికగా స్టార్డమ్ సంపాదించుకుంది. 2013లో శ్రీదేవిని భారతీయ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే 2018లో ఆమె ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
టీమిండియాకు మరో పరాభవం
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. చాలాకాలం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2 నుంచి బయటకు వచ్చింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా టీమిండియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచి సెకెండ్ ప్లేస్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. మరోపక్క భారత్ గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్.. బీజీటీలో ఒక్క మ్యాచ్ గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ (న్యూజిలాండ్ చేతిలో ఓటమి) కోల్పోయిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత ఆసీస్‌కు వదిలేసింది. బీజీటీ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. టీమిండియా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బీజీటీలో చివరి టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌పై తొలి టెస్ట్‌లో విజయంతోనే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.మరోవైపు బీజీటీలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని అగ్రపీఠాన్ని (ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో) పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 126 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 112 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానానికి పడిపోయిన భారత్ 109 రేటింగ్ పాయింట్లు కలిగి ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో ప్లేస్‌లో ఉంది. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో పాకిస్తాన్ ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్ (26), జింబాబ్వే (4), ఆఫ్ఘనిస్తాన్ (0) వరుసగా ఎనిమిది నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ 2-0 తేడాతో పాక్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్ట్‌లో పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది.
Ind vs Eng: తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!
ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!పంత్‌కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్‌గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్లో వస్తే మరోలా ఉంటుంది. పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్‌లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.తిలక్ వర్మకు లైన్ క్లియర్అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్‌లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్‌కు లైన్ క్లియర్‌గా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది. సంజూ, తిలక్ ఊచకోతతొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్‌లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్‌బర్గ్‌లో 47 బంతుల్లోనే 120 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్!
గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..
టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో రెడ్ బాల్ సిరీస్‌కు సిద్దమైంది. ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీ సైకిల్ 2024-25ను విజయంతో ముగించాలని కంగారులు భావిస్తున్నారు.అయితే ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా లంక పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన హాజిల్‌వుడ్ ప్రస్తుతం.. ప్రక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు.ఈ కారణంతోనే బీజీటీ మధ్యలో తప్పుకున్న హాజిల్‌వుడ్.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. ఈ సిరీస్‌కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా దూరం కానున్నాడు.అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో లంక టూర్‌కు దూరంగా ఉండాలని ప్యాట్ నిర్ణయించుకున్నాడు. హాజిల్‌వుడ్ స్ధానంలో జో రిచర్డ్సన్, కమ్మిన్స్ స్ధానంలో మైఖల్ నీసర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. జూన్ 11న లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.కాగా ఈ నామమాత్రపు సిరీస్‌కు వీరిద్దరితో పాటు స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడం అసీస్‌కు అంతసులువు కాదు. శ్రీలంకలో టర్నింగ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆసీస్‌తో పోలిస్తే లంక జట్టులోనే అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ప్రభాత్ జయసూర్య వంటి స్పిన్నర్‌ను ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.చదవండి: BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?.. బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్‌క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్‌లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్‌లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్‌లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది.
బిజినెస్
తొలిరోజే ఫుల్ సబ్‌స్క్రైబ్ అయిన ఐపీవో
ఫార్మా రంగానికి ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో(IPO) తొలిరోజు 13.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్లో 2.08 కోట్ల షేర్లకు గాను 27.75 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గ్రే మార్కెట్లో షేర్లు రూ.97 ప్రీమియంతో ట్రేడయ్యాయి. సేల్‌ను ప్రారంభించిన నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్(Subscribe) కావడం విశేషం.బిడ్డింగ్ రౌండ్లో ముందున్న నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) విభాగం 25.43 రెట్లు, రిటైల్(Retail) ఇన్వెస్టర్స్ 14.46, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIB) విభాగం 1.82 రెట్లు సబ్‌స్రైబ్ అయింది. షేర్లను జనవరి 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయనున్నారు. ఇష్యూ జనవరి 8న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133–140 మధ్య నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇన్వెస్టర్లు కనీసం 107 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.123 కోట్లు అందుకుంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!క్వాడ్రంట్ ఫ్యూచర్‌కు యాంకర్ నిధులురైల్వే సిగ్నలింగ్, రక్షణ(కవచ్) వ్యవస్థలకు సేవలందించే కంపెనీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ యాంకర్ ఇన్వెస్టర్లకు 45 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా దాదాపు రూ.131 కోట్లు అందుకుంది. ఎంఎఫ్ సంస్థలు వైట్ఓక్ క్యాపిటల్, కొటక్, ఎల్ఐసీ, బీవోఐసహా సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ తదితర 22 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ.290 ధరలో షేర్లను జారీ చేయనుంది. రూ.275–290 ధరల శ్రేణిలో నేడు ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ.290 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధి, రుణ చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది.
బంగారం, వెండి ధరల అప్డేట్.. తులం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Price) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు(Gold Rate) వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.78,860గా ఉంది. మంగళవారం బంగారం ధరల మాదిరి కాకుండా వెండి ధర(Silver price)ల్లో మార్పులొచ్చాయి. ఈ రోజు వెండి ధర కేజీకి రూ.1000 పెరిగి రూ.1.00,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఇంటి భోజనం మరింత భారం!
కూరగాయలు, ఇతర వంట సామగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా టమోటాలు, బంగాళదుంప ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 అదే నెలలో భోజనం ఖర్చులు 6 శాతం పెరిగి రూ.31.6కు చేరినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. అంతకుముందు నవంబర్‌లో మాత్రం ఇది రూ.32.7గా ఉందని తెలిపింది.ధరల పెరుగుదలకు కొన్ని కారణాలను నివేదిక విశ్లేషించింది.వెజిటేరియన్ థాలీ: వెజిటేరియన్ థాలీ(Veg Thali) తయారీకి అయ్యే సగటు ఖర్చు గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ.31.6కు చేరింది.నాన్ వెజిటేరియన్ థాలీ: నాన్‌వెజ్ థాలీ(Non Veg) ధర ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.63.3కు చేరింది.టమోటా ధరలు: డిసెంబర్లో కిలో టమోటా(Tamato) ధర 24 శాతం పెరిగి రూ.47కు చేరింది.బంగాళాదుంప ధరలు: కిలో బంగాళాదుంప ధర 50 శాతం పెరిగి రూ.36గా ఉంది.వంట నూనెలు: దిగుమతి సుంకం పెంపు కారణంగా వెజిటబుల్ ఆయిల్ ఖర్చులు 16% పెరగడం కూడా ఆహార ధరలు పెరిగేందుకు దోహదం చేసింది.చికెన్ ధరలు: బ్రాయిలర్ (చికెన్) ధర గతంలో కంటే 20% పెరిగింది. ఇది మొత్తం భోజన ఖర్చును గణనీయంగా ప్రభావితం చేసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!2024 నవంబరుతో పోలిస్తే డిసెంబరులో టమోటా ధరలు 12% తగ్గాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వీటి సరఫరా పెరిగినందునే, శాకాహార థాలీ ధర 3% తగ్గింది. ఉల్లి ధరలు నెలవారీగా 12%, బంగాళాదుంపల ధరలు 2% తగ్గాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు కొంత తగ్గడం, టమోటాల సరఫరా పెరగడం ప్రస్తుతం కొంత ధరలు నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది జనవరి నెల నివేదికలో ప్రతిబింబిస్తుంది.
పెట్రోకెమికల్స్‌పై అదానీ దృష్టి
న్యూఢిల్లీ: విభిన్న వ్యాపారాలు కలిగిన అదానీ గ్రూప్ తాజాగా పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్ సంస్థ ఇండోరమా రిసోర్సెస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇండోరమా రిసోర్సెస్‌తో కలిసి అదానీ పెట్రోకెమికల్స్ భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది.పరస్పరం సమాన భాగస్వామ్యం(50:50 శాతం వాటా)తో వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(వీపీఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. జేవీ ద్వారా రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్ బిజినెస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. దశలవారీగా రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్స్, హైడ్రోజన్ తదితర బిజినెస్‌ల కోసమే అదానీ పెట్రోకెమికల్స్‌ను నెలకొల్పినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వివరించింది. 2022లోనే గుజరాత్లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!అదానీ పెట్రోకెమికల్స్‌తో సంబంధం ఉన్న కొన్ని కీలక ఉత్పత్తులు కింది విధంగా ఉన్నాయి.పీవీసీ ప్లాంట్: అదానీ పెట్రోకెమికల్స్ గుజరాత్‌లోని ముంద్రాలో పాలివినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ సామర్థ్యం 2 మిలియన్ టన్నులు. మొదటి దశ 2026 నాటికి 1 మిలియన్ టన్నులు, రెండో దశ 2027 ప్రారంభం నాటికి మరో 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ యాసిడ్ (పీటీఏ) ప్లాంట్: వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (వీపీఎల్) పేరుతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ మహారాష్ట్రలో 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన పీటీఏ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఫ్యామిలీ
ప్రకృతి సోయగం.. కన్హా శాంతివనం..
చుట్టూ ప్రకృతి అందాలు, విశాలమైన ఓపెన్ ఎయిర్ మందిరాలు, క్రీడా ప్రాంగణాలు, ఉచిత మెడిటేషన, వసతి సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, అంతరించిపోనున్న మొక్క జాతుల నర్సరీ ఇది.. ప్రకృతి సోయగంగా విరాజిల్లుతున్న కన్హా శాంతి వనం.. 1,600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో లక్ష మంది ఒకే చోట, ఒకే సారి మెడిటేషన్ చేయడానికి అనువుగా మన హైదరాబాద్ కేంద్రంగా ఇది నిర్మితమైంది. నగర జీవనంలో ప్రతి ఒక్కరూ పలు రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. విద్యార్థి నుంచి ఉద్యోగి, వ్యాపారి, గృహిణి, వృద్ధుల వరకూ ఇలా అన్ని వయసుల వారు ఒత్తిడి బాధితులే. దీనిని అధిగమించేందుకు మెడిటేషన్ ఓ చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ప్రాధాన్యతను గర్తించాలి..ఈ నేపథ్యంలో కన్హా శాంతి వనం గురించిన మరిన్ని విశేషాలు.. కన్హా శాంతి ఆశ్రమం పర్యావరణం, ఆధ్యాత్మిక ప్రదేశం. సరళమైన జీవనానికి డెస్టినేషన్‌గా నిలుస్తుంది. ఆరోగ్యం, వివిధ అంశాలను ప్రోత్సహించే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్‌తో పాటు ఆధ్యాతి్మక శిక్షణ అందుబాటులో ఉంటుంది. వృద్ధులకు వెల్నెస్ సెంటర్, ఆయుర్వేద, నేచురోపతి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రధానంగా మెడిటేషనకేంద్రం నిర్మాణంలోనే ఓ ప్రత్యేకత ఉంది. వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడానికి మెడిటేషన్ ఫ్లోర్ కింద నీటిని నిల్వ చేస్తారు. కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వసతి, భోజనం, అన్నీ ఉచితంగా అందజేస్తారు. వివిధ దేశాల నుంచి.. ఈ మెడిటేషన్ ఆశ్రమానికి ప్రపంచంలోని 162 దేశాల్లో శాఖలు ఉన్నాయి. వివిధ కళాశాల విద్యార్థులు ఇక్కడ వర్క్‌షాప్ నిర్వహించడం, రీ ట్రీట్ ప్రొగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచి్చన వారు ఇక్కడి మెడిటేషన్ తరగతుల్లో భాగస్వాములవుతున్నారు.ప్రముఖులు సైతం.. రెండేళ్ల నుంచి నగరంలో ఈ పేరు అందరి నోటా నానుతోంది.. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలు కన్హా శాంతి వనం సొంతం కావడంతో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు సైతం ఈ వనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. పోస్టల్ పిన్ కోడ్ ఆధారిత సేవలు.. హార్ట్‌ఫుల్‌గా మెడిటేషన్లో శిక్షణ తీసుకోవాలనుకునే సులువైన పద్ధతిలో శిక్షకులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ వెబ్సైట్లో తపాలా శాఖ పిన్‌కోడ్ నమోదు చేయగానే అక్కడ ఉండే శిక్షకుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా కన్హా శాంతి వనంలో వారంలో రెండు బ్యాచ్‌లకు మెడిటేషన్ శిక్షణ పొందవచ్చు.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్.. కన్హా శాంతి వనం అబ్బురపరిచే ఆర్కిటెక్చర్‌కు అద్దం పడుతోంది. వర్షను నీటిని సైతం ఒడిసి పట్టేలా నిర్మాణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. ప్రస్తుత కన్హా వనం ప్రాంతం రెండు దశాబ్దాల క్రితం నెర్రెలు వారిన నేలలు కనిపించేవి. నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ నేడు ఈ వనంలో వర్షపు నీరు చుక్క కూడా వృథా కాకుండా చుట్టూ కృత్రిమ చెరువులు నిర్మించారు. వాటినే గార్డెన్, మొక్కలు, రన్నింగ్ వాటర్, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఇలా చేరుకోవచ్చు.. నగరంలోని సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, శంషాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సరీ్వసులు నడిపిస్తోంది. సొంత వాహనాల్లో రావాలనుకునే వాళ్లు హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై తిమ్మాపూర్ వద్ద చేగూరు రోడ్డుకు తిరిగితే ఆశ్రమం చేరుకోవచ్చు. మొదటి సారి వచ్చాను.. నా మిత్రులు శాంతి వనానికి పోదామన్నారు. ఇక్కడి వాతావరణం, మెడిటేషన్ కేంద్రం, అన్నీ బాగున్నాయి. వనంలో వివిధ ప్రాంతాలను సందర్శించడానికి ఉచిత వాహనం ఏర్పాటు చేశారు. – వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, నాగోల్ట్రైనర్గా 24 ఏళ్ల నుంచి.. కనీసం మూడు రోజులు మెడిటేషన్ ట్రై చేయండి. మార్పు మీకే కనిపిస్తుంది. గుండె, మెదడు రెండూ కలసి పనిచేస్తే ఆరోగ్యం. ప్రస్తుతం గుండె మాట మెదడు వినే పరిస్థితి కనిపించడం లేదు. గత 24 ఏళ్లుగా మెడిటేషన్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. బెంగళూరులో కొన్నాళ్లు, ఇక్కడ కొన్నాళ్లు శిక్షణ ఇస్తుంటాను. ఆన్‌లైన్‌లోనూ తరగతులు చెబుతాను. – సునీతా ప్రసాద్, మెడిటేషన్ ట్రైనర్ఇది సెక్యులర్ సిటీ.. కన్హా శాంతి వనంలో మెడిటేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి రుసుమూ వసూలు చేయడంలేదు. హైదరాబాద్ సెక్యులర్ సిటీ. సందర్శకుల్లో అన్ని వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తున్నాం. కేవలం రూ.10లకు భోజనం లభిస్తుంది. మూడు స్టార్ హోటల్స్ లోనూ భోజనం చేయవచ్చు. – కరుణాకర్, కన్హా శాంతివనం కో–ఆర్డినేటర్
క్యారమ్స్ కాశీమా
పైన లైట్ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్ బోర్డ్‌పై ‘టప్’ ‘టప్’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్ కాయిన్స్, స్ట్రైకర్... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్ ప్లేయర్‌గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్‌లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్ బాషా.ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్‌లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్ అందజేశారు. ‘క్యారమ్స్’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.నాన్న కల సాకారం చేస్తానుక్యారమ్స్ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.– కాశీమా – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై
హూప్ హూప్ హుర్రే...ఈ కుట్టీ ఎవరో తెలుసా?
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్‌లో హూప్తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్‌నెస్‌కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్‌లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.‘మూవ్మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్తో మూవ్మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్‌నెస్‌కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్‌ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్‌ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.చిన్న వయసులోనే...‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్మెంట్ థెరపీ’ కూడా చేసింది. ‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.తిహార్ జైలులో...తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్‌తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.ఇలా చేయాలి‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్లో హూప్ రింగ్‌లు 28 ఇంచ్‌ల నుంచి 39 ఇంచ్‌ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న. మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్‌లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు.
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు
ఫొటోలు
National View all
అలరించిన ‘సుస్వరాల హరివిల్లు’
దాదర్: ఆంధ్ర మహాసభ, స్వరమాధురి సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర
కాంగ్రెస్‌కు షాక్..! ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) షెడ్యూల
బాబా ఆశారాంకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ:అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబ
చచ్చినోడు తిరిగొచ్చాడు
సేలం: కావేరి నదిలో మునిగి మృతి చెందాడని భావించి అంత్యక్రియలు
NRI View all
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
International View all
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
ట్రూడో రాజీనామా.. భారత్‌కు అనుకూలమా? ప్రతికూలమా?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు.
కెనడా ప్రధానిగా పియరీ పొయిలీవ్రే?
ఒట్టావా: జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవికి, లిబరల్ పా
డీప్‌ఫేక్స్ చేసినా.. షేర్ చేసినా.. జైలుకే!
డీప్‌ఫేక్.. నటి రష్మిక మందన పేరుతో వైరల్ అయిన ఓ వీడియో తర్వాత విస్తృతంగా చర్చ నడిచిన టెక్నాలజీ.
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే..
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటా నిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇప్పుడు భారత్‌ను తాకి
క్రైమ్
యువకుడి దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): స్వల్ప వివాదం పెద్దదిగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెంలో జరిగింది. సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.. కొండాయపాళేనికి చెందిన గంట ఉదయ్ కుమార్, అభిషేక్ (23)లు అన్నదమ్ములు. అదే ప్రాంతానికి చెందిన దాసు వారికి దూరపు బంధువు. దాసు మద్యానికి బానిసయ్యాడు. మత్తులో ఇష్టానుసారం ప్రవర్తించేవాడు. అసభ్యకర పదజాలంతో దూషించేవాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాసు తన ఇంటికి సమీపంలో గట్టిగా కేకలు వేస్తుండటంతో ఉదయ్ వారించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఉదయ్ అతడిపై చేయి చేసుకోవడంతో దాసు వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని పడారుపల్లిలో ఉంటున్న తన భార్య, అత్త, బావమరుదులు శ్రీకాంత్, శ్రీనివాసులు, స్నేహితుడు సూర్యకు చెప్పాడు. అందరూ కలిసి సోమవారం తెల్లవారుజామున కొండాయపాళేనికి చేరుకుని ఉదయ్‌తో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న అభిషేక్, ఉదయ్ స్నేహితుడు ప్రవీణ్ అలియాస్ చింటూ అడ్డుకున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన వారు తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో విచక్షణారహితంగా ఈ ముగ్గురిపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో అభిషేక్‌కు తీవ్రగాయాలై మృతిచెందగా, ఉదయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. మృతుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..
భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్‌లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్‌కాంత్ పీఎస్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు.
టీడీపీ కార్యకర్త అరాచకం.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి
సాక్షి, ఆమదాలవలస: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పచ్చ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వారే అధికారంలో ఉన్నారనే కారణంగా పలు అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆమె గర్భవతి కాగా.. బెదిరింపులకు దిగాడు.టీడీపీ కార్యకర్త ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. కోటిపల్లి రాజు అనే యువకుడు 9వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలిక గర్భిణి అని తేలడంతో బాధితురాలి తల్లి ఆదివారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అయితే, తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై యువకుడిని ప్రశ్నించగా తాను టీడీపీ కార్యకర్తనని, తనకు పార్టీ నేతల అండదండలున్నాయంటూ బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎంఆర్ హాస్టల్ ఘటనలో ఇద్దరి రిమాండ్
మేడ్చల్‌రూరల్: గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో వీడియోల చిత్రీకరణ ఘటనలో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని రిమాండ్ చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోదరుడు, సీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ గోపాల్‌రెడ్డి సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కళాశాల గర్ల్స్ హాస్టల్లో డిసెంబర్ 31 రాత్రి బాత్రూంలోకి ఓ విద్యార్థిని వెళ్లగా, ఆ సమయంలో ఎవరో వెంటిలెటర్ నుంచి తొంగి చూస్తున్నట్టు గుర్తించింది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా, సకాలంలో స్పందించలేదు. దీంతో హాస్టల్లోని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరిగిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి కళాశాలకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బిహార్‌కు చెందిన కిశోర్‌కుమార్, గోవింద్కుమార్తో పాటు మరికొందరు మెస్‌లో పనిచేస్తున్నారు. హాస్టల్ వెనుక భాగంలో యాజమాన్యం ఏర్పాటు చేసిన గదుల్లో వారు ఉంటున్నారు. విద్యార్థుల ఆరోపణలు, ఆందోళన నేపథ్యంలో మెస్‌లో పనిచేసే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా, కిశోర్‌కుమార్, గోవింద్కుమార్లు బాత్రూం వెంటిలేటర్ ద్వారా తొంగి చూసినట్టు నేరం అంగీకరించారు. దీంతో వారిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినులు ఫిర్యాదు చేసిన సమయంలో వారిని కించపరుస్తూ మాట్లాడిన హాస్టల్ వార్డెన్లు ప్రీతిరెడ్డి, ధనలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనను బయటకు రాకుండా చూడాలని, పోలీసులు, విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరకుండా చూసుకోవాలని హాస్టల్ వార్డెన్లపై ఒత్తిడి తీసుకొచ్చిన సీఎంఆర్ సెట్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, సీఎంఆర్ ఐటీ కళాశాల డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్ గోపాల్‌రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు.