ఇంగ్లిష్ భాష వినియోగంలో భారత్ నంబర్‌వన్
ప్రపంచ సగటులో ముందంజలో ఇండియా
న్యూఢిల్లీ: ఇంగ్లిష్ భాష మాట్లాడటంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లోనే ఆంగ్లభాష వినియోగం అధికంగా ఉందని పియర్సన్ నివేదికలో వెల్లడైంది. ఇంగ్లిష్ భాష మాట్లాడటంలో ప్రపంచదేశాలు చూపుతున్న ప్రావీణ్యంపై పియర్సన్ సంస్థ రూపొందించిన ‘గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ–2024’నివేదికలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంలో భారత్, ఫిలిప్సీన్స్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, యూరప్ దేశాల్లో ఇంగ్లిష్ భాష మాట్లాడగల సామర్థ్యంపై నివేదికలో ఎక్కువ వివరాలు ఉన్నాయి.
వేర్వేరు దేశాల్లో దాదాపు 7,50,000 మందిలో ఆంగ్లభాషపై పట్టు, పాండిత్యాన్ని అధ్యయనకారులు పరీక్షించారు. ఈ మేరకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని అంచనావేసే వెర్సాంట్ టెస్ట్‌ను చేశారు. ఇందులో ఇంగ్లిష్ భాషానైపుణ్యం విషయంలో ప్రపంచ వ్యాప్త సగటు 57 స్కోర్‌కాగా భారత్‌లో ఇది 52గా నమోదైంది. అయితే దేశాలవారీగా చూస్తే ఇంగ్లిష్‌లో మాట్లాడే సంఖ్య పరంగా చూస్తే ప్రపంచ సగటు 54 స్కోర్‌తో పోలిస్తే భారత స్కోర్ ఏకంగా 57 ఉండటం విశేషం. ఇంగ్లిష్‌లో రాయగల సామర్థ్యానికి సంబంధించిన ప్రపంచ సగటు స్కోర్ 61కాగా భారత స్కోర్ సైతం 61 కావడం ఆశ్చర్యకరం.
రాష్ట్రాలవారీగా ఢిల్లీ టాప్
రాష్ట్రాలవారీగా చూస్తే 63 స్కోర్‌తో ఢిల్లీ అగ్రస్థానంలో, రాజస్థాన్(60), పంజాబ్(58) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ‘‘ప్రస్తుత ఆర్థికమయ ప్రపంచంలో ఇంగ్లిష్ సామర్థ్యం కేవలం ఒక నైపుణ్యంకాదు అదొక చక్కటి ఆస్తిగా మారింది. వ్యాపారవేత్తలు తమ సంస్థలో ఉద్యోగ నియామకాల, సిబ్బందిని మెరుగుపర్చుకునే క్రమంలో వారికి ఈ ఇంగ్లిష్ నైపుణ్య సంబంధ సమాచారం ఎంతో దోహదపడుతోంది. అంచనా తప్పి తక్కువ అర్హత ఉన్న ఉద్యోగిని పొరపాటున నియమించుకోవడం, తద్వారా సంస్థ విశ్వసనీయ దెబ్బతినడం వంటి తప్పులు జరక్కుండా ఇప్పుడు భారతీయ వ్యాపారవేత్తలు మరింత మెరుగ్గా వ్యవహరిస్తున్నారు.
డిజిటల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అంతర్జాతీయ వ్యాపార సత్సంబంధాలకు పెంపుకు దోహదపడేలా ఇంగ్లిష్‌లో రాయగలిగేలా సిబ్బంది నియమించుకుంటున్నారు. ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల్లో ప్రపంచ సగటు 56 స్కోర్‌ను మించి భారత స్కోర్ 63 ఉండటం ఇందుకు నిదర్శనం ’’అని పియర్సన్ ఇంగ్లిస్ లాంగ్వేజ్ లెరి్నంగ్ డివిజన్ అధ్యక్షుడు గోవనీ గోవానెల్లీ అన్నారు. భారత్‌లో ఇంగ్లిష్ నైపుణ్యానికి సంబంధించిన మార్కెట్ పెరిగిందని, భవిష్యత్‌లో ఇది మరింత విస్తరించనుందని ఆయన చెప్పారు. అయితే భారత్‌లో ఆరోగ్యసంరక్షణ రంగంలో స్కోర్ మరీ తక్కువగా 45 వద్దే ఆగిపోయింది. టెక్నాలజీ, కన్సలి్టంగ్, బీపీఓ సేవలకు సంబంధించిన స్కోర్ చాలా మెరుగ్గా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment