Pearson
-
భారత్.. ఆంగ్లంలో అందరికంటే మిన్నగా..
న్యూఢిల్లీ: ఇంగ్లిష్ భాష మాట్లాడటంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లోనే ఆంగ్లభాష వినియోగం అధికంగా ఉందని పియర్సన్ నివేదికలో వెల్లడైంది. ఇంగ్లిష్ భాష మాట్లాడటంలో ప్రపంచదేశాలు చూపుతున్న ప్రావీణ్యంపై పియర్సన్ సంస్థ రూపొందించిన ‘గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ–2024’నివేదికలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంలో భారత్, ఫిలిప్సీన్స్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, యూరప్ దేశాల్లో ఇంగ్లిష్ భాష మాట్లాడగల సామర్థ్యంపై నివేదికలో ఎక్కువ వివరాలు ఉన్నాయి. వేర్వేరు దేశాల్లో దాదాపు 7,50,000 మందిలో ఆంగ్లభాషపై పట్టు, పాండిత్యాన్ని అధ్యయనకారులు పరీక్షించారు. ఈ మేరకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని అంచనావేసే వెర్సాంట్ టెస్ట్‌ను చేశారు. ఇందులో ఇంగ్లిష్ భాషానైపుణ్యం విషయంలో ప్రపంచ వ్యాప్త సగటు 57 స్కోర్‌కాగా భారత్‌లో ఇది 52గా నమోదైంది. అయితే దేశాలవారీగా చూస్తే ఇంగ్లిష్‌లో మాట్లాడే సంఖ్య పరంగా చూస్తే ప్రపంచ సగటు 54 స్కోర్‌తో పోలిస్తే భారత స్కోర్ ఏకంగా 57 ఉండటం విశేషం. ఇంగ్లిష్‌లో రాయగల సామర్థ్యానికి సంబంధించిన ప్రపంచ సగటు స్కోర్ 61కాగా భారత స్కోర్ సైతం 61 కావడం ఆశ్చర్యకరం. రాష్ట్రాలవారీగా ఢిల్లీ టాప్రాష్ట్రాలవారీగా చూస్తే 63 స్కోర్‌తో ఢిల్లీ అగ్రస్థానంలో, రాజస్థాన్(60), పంజాబ్(58) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ‘‘ప్రస్తుత ఆర్థికమయ ప్రపంచంలో ఇంగ్లిష్ సామర్థ్యం కేవలం ఒక నైపుణ్యంకాదు అదొక చక్కటి ఆస్తిగా మారింది. వ్యాపారవేత్తలు తమ సంస్థలో ఉద్యోగ నియామకాల, సిబ్బందిని మెరుగుపర్చుకునే క్రమంలో వారికి ఈ ఇంగ్లిష్ నైపుణ్య సంబంధ సమాచారం ఎంతో దోహదపడుతోంది. అంచనా తప్పి తక్కువ అర్హత ఉన్న ఉద్యోగిని పొరపాటున నియమించుకోవడం, తద్వారా సంస్థ విశ్వసనీయ దెబ్బతినడం వంటి తప్పులు జరక్కుండా ఇప్పుడు భారతీయ వ్యాపారవేత్తలు మరింత మెరుగ్గా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అంతర్జాతీయ వ్యాపార సత్సంబంధాలకు పెంపుకు దోహదపడేలా ఇంగ్లిష్‌లో రాయగలిగేలా సిబ్బంది నియమించుకుంటున్నారు. ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల్లో ప్రపంచ సగటు 56 స్కోర్‌ను మించి భారత స్కోర్ 63 ఉండటం ఇందుకు నిదర్శనం ’’అని పియర్సన్ ఇంగ్లిస్ లాంగ్వేజ్ లెరి్నంగ్ డివిజన్ అధ్యక్షుడు గోవనీ గోవానెల్లీ అన్నారు. భారత్‌లో ఇంగ్లిష్ నైపుణ్యానికి సంబంధించిన మార్కెట్ పెరిగిందని, భవిష్యత్‌లో ఇది మరింత విస్తరించనుందని ఆయన చెప్పారు. అయితే భారత్‌లో ఆరోగ్యసంరక్షణ రంగంలో స్కోర్ మరీ తక్కువగా 45 వద్దే ఆగిపోయింది. టెక్నాలజీ, కన్సలి్టంగ్, బీపీఓ సేవలకు సంబంధించిన స్కోర్ చాలా మెరుగ్గా ఉండటం విశేషం. -
త్వరలో సంపన్నులకు మరణమే ఉండదు!
జీవితంలో మనుషులకు ఉండే నానా భయాల్లో ఎక్కువగా భయపెట్టేవి జరామరణ భయాలే! జరామరణాలనేవి లేకపోతే ఇక దేనికీ భయపడాల్సిన అవసరమే ఉండదనే భావన జనాల్లో చిరకాలంగా ఉంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఎంతగా అభివృద్ధి చెందినా, జరామరణాలను జయించే సాధనాలేవీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. కొంతకాలంగా వార్ధక్యాన్ని జయించే దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటి ఫలితాలు కొన్ని ఆశలనూ రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఇక చావుకు చెల్లుచీటీ రాసి పారేయొచ్చునని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెబుతున్నారు అమెరికన్ ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్. మరో ముప్పయ్యేళ్లలోనే ప్రపంచంలోని సంపన్నులు మరణాన్ని జయించగలుగుతారని, ఆ తర్వాత ఇంకో ముప్పయ్యేళ్లకు పేద దేశాల్లోని ప్రజలు కూడా దీనిని సాధించగలుగుతారని చెబుతున్నారు. జరామరణాలపై తరతరాలుగా కొనసాగుతున్న భావనలు, వాటిని జయించడానికి జరుగుతున్న శాస్త్ర పరిశోధనలు, వాటిపై శాస్త్రవేత్తల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం... జరామరణాలను జయించడం మానవమాత్రుల వల్ల కాదనే ఇప్పటి వరకు మనకు తెలుసు. వివిధ మతగ్రంథాలు, పురాణాలు కూడా ఇదే సంగతి చెబుతున్నాయి. మృత్యువును జయించలేరు గనుకనే మానవులను మర్త్యులు అంటారు. జరామరణాలు లేని దేవతలు అల్లక్కడెక్కడో స్వర్గంలో ఉంటారని, అమృతపానం కారణంగా మృత్యువు వారి దరిచేరదని, అందువల్లనే వారు అమర్త్యులని ప్రస్తుతించాయి మన పురాణాలు. జరామరణాలకు సంబంధించి మన పురాణాల్లో అనేక ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మం మృతస్య చ‘ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి‘‘’’ – అంటే ‘పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం శోకించడం తగదు’ అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ‘గీత’బోధ చేశాడు. స్వర్గంలో ఉండే దేవతలే కాదు, భూమ్మీద పుట్టిన వారిలోనూ కొందరు వరప్రభావంలో చిరంజీవులుగా ఉన్నట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. ‘‘అశ్వత్థామా బలిర్వా్యసో హనుమానశ్చ విభీషణః‘ కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః‘‘’’ అనే శ్లోకం ప్రకారం మన పురాణాలు పేర్కొన్న చిరంజీవులు ఏడుగురు. వారు: అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు. పురాణాల సంగతి పక్కనపెడితే, ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు సైతం మనుషులను అత్యంత తీవ్రంగా భయపెట్టేది మరణ భయమేనని గుర్తించారు. మరణాన్ని జయించడానికి మనుషులు తరతరాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ప్రాచీన గ్రీకు రసవాదులు కొందరు మరణాన్ని నివారించగల ‘ఫిలాసఫర్స్ స్టోన్’ (వేదాంతుల శిల) తయారీకి విఫలయత్నాలు చేశారు. ‘లాపిస్ ఫిలాసఫోరమ్’గా గ్రీకు గాథలు ప్రస్తావించిన ఈ శిలకు నానా మహత్తులు ఉంటాయట. దీనిని తాకిస్తే, పాదరసం వంటి అల్పలోహాలు బంగారంగా మారిపోతాయట. దీని మహిమతో జరామరణాలను జయించడమూ సాధ్యమవుతుందట. గ్రీకుగాథలు ప్రస్తావించిన ఈ ‘వేదాంతుల శిల’ ఎవరి చేతికీ అందిన దాఖలాల్లేవు. అలాగే, దీని మహిమవల్ల చిరంజీవులైన వారు ఉన్నట్లు కూడా దాఖలాల్లేవు. పురాణగాథలు, వాటిలోని కల్పనలు ఎలా ఉన్నా, త్వరలోనే మనుషులందరూ చిరంజీవులు కావచ్చని ఆధునిక శాస్త్రవేత్తలు తమ భవిష్యత్ అంచనాలతో ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు మరణం అనివార్యం... పురాణాలు మొదలుకొని ఆధునిక శాస్త్ర పరిశోధనల ఇప్పటి వరకు చెబుతున్నదేమిటంటే, జీవులకు మరణం ఒక అనివార్యమైన దశ. పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. అనివార్యమైన మరణానికి కారణాలు సవాలక్ష. వ్యాధులు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటి వాటి వల్ల కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, వీటిన్నింటినీ తప్పించుకున్న వారు వార్ధక్యం కారణంగా శరీరం వడలిపోయి, ఏదో ఒక సమయంలో రాలిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. జీవితంలో వార్ధక్యం ఒక సహజ పరిణామంగానే ఇటీవలి కాలం వరకు వైద్యనిపుణులు పరిగణిస్తూ వచ్చారు. అయితే, ఇరవయ్యో శతాబ్దిలో కొందరు వైద్య నిపుణులు వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని, దీనిని నయం చేయవచ్చనే వాదన లేవనెత్తారు. వార్ధక్యాన్ని నివారిస్తే, దాని వల్ల సంభవించే మరణాన్ని నివారించడం కూడా సాధ్యమేనని వారి వాదన. రాబర్ట్ ఎం పెరిమాన్ అనే అమెరికన్ వైద్యుడు తొలిసారిగా ఈ వాదన లేవనెత్తుతూ, 1954లో ‘ది ఏజింగ్ సిండ్రోమ్’ పేరిట రాసిన వ్యాసం ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ గేరియాట్రిక్ సొసైటీ’లో ప్రచురితమై, వైద్యరంగంలో చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా రేగిన ఈ చర్చతో కొందరు శాస్త్రవేత్తలు వార్ధక్యానికి మూలకారణం కనుగొనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. వారిలో మొదటిగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన అనాటమీ ప్రొఫెసర్ లియొనార్డ్ హేఫ్లిక్ 1962లో కృతకృత్యుడయ్యాడు. మానవ శరీరంలోని ఒక్కో జీవకణం అంతరించిపోయేలోగా అది పొందే విభజనకు ఒక నిర్దిష్టమైన పరిమితి ఉంటుందని గుర్తించాడు. జీవకణాలు విభజన పొందే ప్రతిసారీ క్రోమోజోమ్‌ల చివర క్యాప్‌లా ఉండే ‘టెలోమెరిస్’ కుంచించుకు పోతూ ఉంటుందని, ఇది పూర్తిగా కుంచించుకు పోయాక జీవకణం మరిక విభజన చెందదని, ఈ ప్రక్రియ కారణంగానే వార్ధక్యం సంభవిస్తోందని వివరించాడు. హేఫ్లిక్ పరిశోధనతో వెలుగులోకి వచ్చిన వాస్తవాల నేపథ్యంలో మానవుల జీవకణాల్లోని క్రోమోజోమ్‌లను అంటిపెట్టుకుని ఉండే ‘టెలోమెరిస్’ కుంచించుకు పోవడాన్ని నిలువరించగలిగితే నిత్య యవ్వనం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. అప్పట్లో ఈ దిశగా పరిశోధనలు సాగించేందుకు ప్రభుత్వాలేవీ నిధులు ఖర్చు చేయడానికి సుముఖత చూపకపోవడంతో ఈ అంశమై స్తబ్దత ఏర్పడింది. దాదాపు ఆరు దశాబ్దాల స్తబ్దత తర్వాత 2015లో ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వార్ధక్యాన్ని వ్యాధిగా పరిగణించడమే కాకుండా, దీనిని అధికారికంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఫలితంగా 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో ‘వార్ధక్య సంబంధ వ్యాధుల’కు ఒక ఎక్స్టెన్షన్ కోడ్ కేటాయించింది. వార్ధక్యాన్ని వ్యాధి అనలేం వార్ధక్యం కూడా వ్యాధేననే వాదన కొందరు శాస్త్రవేత్తలు వినిపిస్తుంటే, వార్ధక్యాన్ని వ్యాధి అనలేమని ఇంకొందరు చెబుతున్నారు. భూమ్మీద ప్రస్తుతం నివసిస్తున్న సుమారు 770 కోట్ల మంది మనుషులూ తప్పించుకోలేని దశను వ్యాధిగా నిర్వచించడం సాధ్యం కాదని డెన్మార్క్‌లోని అర్హర్స్ యూనివర్సిటీ సెల్యులర్ ఏజింగ్ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త సురేశ్ రత్తన్ చెబుతున్నారు. ఆయన చెబుతున్న ప్రకారం– వార్ధక్యం అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, కొన్ని రకాల కేన్సర్లు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వయసు మళ్లే దశలో సర్వసాధారణంగా ఎదురవుతాయి. దాదాపు అరవై అయిదేళ్ల వయసు దాటిన తర్వాత చాలామంది ఇలాంటి వ్యాధుల బారిన పడతారు. అలాగని, వయసు మళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ జబ్బులు కచ్చితంగా వస్తాయని కూడా చెప్పలేం. ఒక్కోసారి యవ్వనంలో ఉన్నవారిలో సైతం ఈ జబ్బులు కనిపించడమూ చూస్తూనే ఉన్నాం. అందువల్ల వార్ధక్యాన్ని వ్యాధిగా పరిగణించడం సాధ్యమయ్యే పనికాదు. గెరాంటలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా 2019లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, రకరకాల కేన్సర్లు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వార్ధక్యంలో కొంత సర్వసాధారణంగా తలెత్తేవే అయినా, నేరుగా వీటికి వార్ధక్యంతో సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. కేవలం వార్ధక్యం కారణంగానే ఈ వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయనడానికి కూడా ఇదమిత్థమైన ఆధారాలేవీ లేవని కూడా వారు వెల్లడించారు. శరీరంలో జరిగే జైవిక ప్రక్రియలు వార్ధక్యానికి మూలకారణం అవుతుంటే, ఇలాంటి వ్యాధులన్నీ వాటివల్ల తలెత్తే పర్యవసానాలు మాత్రమేనని వారంతా అభిప్రాయపడ్డారు. మనిషి మరణాన్ని జయించే కాలం ఎంతో దూరంలో లేదనే అంచనాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో వార్ధక్యం, దాని ఫలితంగా సంభవించే మరణం సహజ పరిణామాలేనని బలంగా నమ్ముతున్న శాస్త్రవేత్తలు కూడా తమ వాదనను వినిపిస్తుండటం గమనార్హం. గేరియాట్రిక్ నిపుణులు చెబుతున్న దానిబట్టి మనుషులు గరిష్ఠంగా నూట ఇరవై ఏళ్ల వరకు బతకగలుగుతారు. భారతీయ జ్యోతిషశాస్త్రంలోని వింశోత్తరి పద్ధతిలో జీవితంలో ఎదురయ్యే గ్రహ దశల పూర్తి నిడివి కూడా నూట ఇరవై ఏళ్లే. నానా రకాల వ్యాధులను జయించి మనుషులు గరిష్ఠ ఆయుర్దాయం వరకు జీవించగలుగుతారో, ఫ్యూచరాలజిస్టుల అంచనా మేరకు చిరంజీవులుగా మారుతారో వేచి చూడాల్సిందే! 2045 ఈనాటికి మెదడును యంత్రాలకు అనుసంధానించడం సాధ్యమవుతుంది. 2050 ప్రపంచంలోని సంపన్నులు తమ మెదళ్లను రోబోలతో, కంప్యూటర్లతో అనుసంధానం చేయించుకోగలుగుతారు. 2060 సంపన్న దేశాల్లోని మధ్యతరగతి ప్రజలు, కార్మిక వర్గాల వారు కూడా తమ మెదళ్లను రోబోలతో, కంప్యూటర్లతో అనుసంధానం చేయించుకోగలుగుతారు. 2070 పేద దేశాల్లోని సామాన్యులు సైతం తమ మెదళ్లను కంప్యూటర్లతో అనుసంధానించ గలుగుతారు. 2080 మనుషులందరూ మరణాన్ని జయిస్తారు. రోబో శరీరాల్లో జీవితాన్ని కొనసాగించగలుగుతారు. రోబో శరీరాలకు ప్రభుత్వాలే సబ్సిడీ కల్పిస్తాయి. ‘ప్రపంచంలో నిశ్చయమైనవి రెండే రెండు. ఒకటి: చావు, రెండు: ప్రభుత్వం విధించే పన్నులు’ అని అమెరికన్ రాజనీతిజ్ఞుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏనాడో చమత్కరించాడు. పన్నులనేం చేయలేం గాని, చావుకు చెల్లుచీటీ రాసేయడానికి ఇంకెంతో కాలం వేచి చూడక్కర్లేదంటున్నారు ఫ్యూచరాలజిస్టులు. మరణాన్ని జయించగలిగే మార్గాలను కూడా వారు ప్రతిపాదిస్తున్నారు. మరణాన్ని జయించడానికి ముచ్చటగా మూడు దారులు ఉన్నాయని చెబుతున్నారు అమెరికన్ ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్. అవి: శరీర అవయవాలకు పునర్యవ్వనం కల్పించడం, ఆండ్రాయిడ్ రోబో శరీరాలను ఆశ్రయించుకుని జీవితాన్ని కొనసాగించడం, జెనెటిక్ ఇంజనీరింగ్‌లో వివిధ పద్ధతుల ద్వారా జీవకణాలు వయసుమళ్లడాన్ని నిరోధించడం ద్వారా శరీర అవయవాలకు పునర్యవ్వనం కలిగించడం సాధ్యమవుతుందని, దీని ద్వారా మరణాన్ని జయించడం సాధ్యమవుతుందని డాక్టర్ పియర్సన్ చెబుతున్నారు. శరీరంతో యథాతథంగా నవయవ్వనంగా ఉంటూ, మరణాన్ని జయించడం సాధ్యం కాకుంటే, మన మెదళ్లను ఆండ్రాయిడ్ రోబోలకు అనుసంధానించడం ద్వారా రోబో శరీరాల్లో జీవితాన్ని కొనసాగించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇలా కాకుంటే, మెదళ్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా వర్చువల్ జీవితాన్ని చిరకాలం కొనసాగించవచ్చు. చావుకు చెల్లుచీటీ రాసే ప్రక్రియలో డాక్టర్ పియర్సన్ అంచనా ఇదీ... - ఈ లెక్కన డాక్టర్ పియర్సన్ అంచనా నిజమైతే, మరో అరవయ్యేళ్లకు ప్రపంచంలోని మనుషులందరూ చిరంజీవులే అవుతారు. ఇదివరకటి విఫలయత్నాలు మెసపొటేమియన్ పురాణగాథల ప్రకారం గిల్గమేష్ అనే వీరుడికి ఎన్కిడు అనే మిత్రుడు ఉండేవాడు. వయసు తీరకుండానే ఎన్కిడు మరణించాడు. ఎన్కిడు మరణం తర్వాత గిల్గమేష్ తనకు అలాంటి దుస్థితి వాటిల్లకూడదనే ఉద్దేశంతో మరణాన్ని జయించడానికి కఠోర ప్రయత్నాలే చేశాడు. ఈ క్రమంలో ఎదురైన రెండు పరీక్షల్లో అతడు విఫలమవడంతో మరణాన్ని జయించేందుకు అతడు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఈ కథ క్రీస్తుపూర్వం 2600 నాటి ‘ఎపిక్ ఆఫ్ గిల్గమేష్’లోనిది. మరణాన్ని జయించేందుకు మనుషులు చేసే ప్రయత్నాలను వర్ణించిన తొలి గాథ ఇదే. పురాణగాథల సంగతి సరే, పురాతన చరిత్రను తరచిచూస్తే, మరణాన్ని జయించే యత్నాలు చేసినవారు లేకపోలేదు. చైనా తొలి చక్రవర్తి కిన్ షి హువాంగ్ వయసు మళ్లిన దశలో జరామరణాలను జయించడానికి విఫలయత్నాలు చేశాడు. తన ఆస్థానంలోని జుఫు అనే రసవాది ఆధ్వర్యంలో నవయవ్వన ఔషధాన్ని అన్వేషించడం కోసం వందలాది మందిని ప్రపంచం నలుమూలలకూ పంపాడు. వార్ధక్యంలో జ్ఞాపకశక్తి క్షీణించడంతో అతని ఆస్థాన వైద్యుల సలహాపై పాదరసంతో కూడిన మాత్రలను అతిగా వాడటం వల్ల అర్ధంతరంగానే కన్నుమూశాడు. మరణాన్ని జయించడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తిగా క్రీస్తుపూర్వం 259–210 కాలంలో చైనాను పరిపాలించిన కిన్ షి హువాంగ్ చరిత్రలో నిలిచిపోయాడు. -
పసివాడి శాపం
నిజాలు దేవుడికెరుక జూన్ 6, 1985... బ్రిటన్. ‘‘త్వరగా పోనియ్. ఇప్పటికే ఆలస్యమైంది’’... తొందరపెడుతున్నాడు పీర్సన్. అతడలా అనడంతో మరింత వేగం పెంచాడు డ్రైవర్. మరో పది నిమిషాల్లో డెర్బీలోని ఓ ఇంటికి చేరుకున్నారు. ‘‘ఓ మై గాడ్... త్వరగా పని మొదలు పెట్టండి’’ అని అరుస్తూ వ్యాన్‌లోంచి కిందికి దూకాడు పీర్సన్. అందరూ చకచకా బండి దిగారు. పొడవాటి ట్యూబులను చేతుల్లోకి తీసుకుని నీళ్లు చిమ్మడం మొదలు పెట్టారు. ఎంతో అందంగా ఉందా ఇల్లు. ఏం జరిగిందో ఏమో కానీ... మంటల్లో చిక్కుకుంది. ఆ విషయం తెలియగానే తన టీమ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు ఫైర్ స్టేషన్ ఇన్చార్జి పీర్సన్. వాళ్లంతా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కానీ... మంటలు ఓ పట్టాన అదుపులోకి రావడం లేదు. ‘‘చాలా పెద్ద యాక్సిడెంట్ సర్’’ అన్నాడు ఫైర్‌మేన్ జాన్. ‘‘అవును. దాదాపు అన్నీ నాశనమైపోయి ఉంటాయి. మనుషులెవరికీ ఏం కాకుండా ఉంటే చాలు’’ అన్నాడు పీర్సన్. కాసేపటికి మంటలు చల్లారాయి. మాస్కులు తగిలించుకుని అందరూ లోపలికి నడిచారు. అదృష్టంకొద్దీ లోపల మనుషులెవరూ లేరు. కానీ ఇల్లు ధ్వంసమైపోయింది. అన్నీ మాడి మసైపోయాయి. ‘‘అనుకున్నట్టే అయ్యింది జాన్. ఏ ఒక్కటీ మిగల్లేదు’’ అన్నాడు పీర్సన్ పరిశీలిస్తూ. ‘‘అవును సర్’’ అంటూ ఎందుకో గోడవైపు చూసిన జాన్ అవాక్కయిపోయాడు. గోడకు ఓ చిన్నపిల్లాడి పెయింటింగ్ వేళ్లాడుతోంది. ఆ పిల్లాడు చాలా జాలిగా ఉన్నాడు. ఏడుస్తున్నాడు. చెక్కిళ్ల మీదుగా కన్నీళ్లు జాలువారుతున్నాయి. చక్కని రంగులతో, ఎంతో అందంగా ఉంది ఆ చిత్రం చూడ్డానికి. మెల్లగా దాని దగ్గరకు వెళ్లాడు జాన్. చిత్రాన్ని చేతితో తాకాడు. అంతే... ఉలిక్కిపడ్డాడు. ‘‘సార్... ఓసారిలా రండి... త్వరగా’’ అంటూ కేక పెట్టాడు. అతడి అరుపు వింటూనే అటువైపు పరుగు తీశాడు పీర్సన్. ‘‘ఏంటి జాన్... ఏం జరిగింది’’ అన్నాడు కంగారుగా. జాన్ కళ్లు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ‘‘ఇటు చూడండి సర్’’ అంటూ పెయింటింగ్ వైపు చూపించాడు. దాన్ని చూస్తూనే విస్తుపోయాడు పీర్సన్. ‘‘ఏంటిది జాన్... ఇదెలా సాధ్యం? ఇల్లు మొత్తం బుగ్గైపోయింది. కానీ ఈ పెయింటింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. దాని వెనక ఉన్న గోడ కూడా మసిబారిపోయింది. ఇది మాత్రం ఇలా ఎలా ఉంది?’’... తన అనుమానాలన్నింటినీ ప్రశ్నలుగా సంధించాడు పీర్సన్. ‘‘అంతకంటే విచిత్రం ఇంకొకటుంది సర్. ఇంత ఘోరమైన మంటల మధ్య ఉన్నా, ఈ పెయింటింగ్కున్న ఫ్రేమ్ కనీసం వేడి కూడా ఎక్కలేదు.’’ జాన్ అలా అనగానే ఫ్రేమును తాకి చూశాడు పీర్సన్. చల్లగా తగిలింది చేతికి. మరోసారి విస్తుపోయాడు. కాసేపటికి విస్మయం నుంచి తేరుకుని, ఆ చిత్రాన్ని తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు ఇద్దరూ. ఆ రోజు సాయంత్రం... ‘‘అబ్బ.. ఎంత బాగుందో పెయింటింగ్. బుజ్జిగాడు ఎంత ముద్దుగా ఉన్నాడో’’... భర్త తీసుకొచ్చిన చిత్రాన్ని చూస్తూనే సంబరపడిపోయింది పీర్సన్ భార్య మిలిండా. ‘‘కదా... నీకు నచ్చుతుందనే తెచ్చాను’’ అన్నాడు పీర్సన్. మిలిండా ఆ చిత్రాన్ని హాల్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గోడ కు తగిలించింది. చూసుకుని మురిసిపోయింది. వారం రోజుల తర్వాత... ఫైర్ స్టేషన్లో పీర్సన్ పనిలో తలమునకలై ఉండగా ఫోన్ రింగయ్యింది. ‘‘పనిలో ఉన్నప్పుడే ఫోన్లు వస్తుంటాయి. ఇంకెవరి కొంప తగులబడిందో ఏమో’’ అనుకుంటూ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే అతడి ముఖం మ్లానమయ్యింది. చేస్తున్న పని వదిలేసి టీమ్‌ని తీసుకుని పరుగుదీశాడు. వాళ్లు వెళ్లేసరికి పీర్సన్ ఇల్లు తగులబడుతోంది. ‘‘దేవుడా... ఇలా ఎలా జరిగింది? మిలిండా లోపలే ఉండివుంటుంది... మిలిండా’’... పీర్సన్ అరుపులతో పరిసరాలు దద్దరిల్లాయి. సిబ్బంది మంటల్ని అదుపు చేయగానే లోపలకు పరుగెత్తాడు పీర్సన్. లోపల... హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న మిలిండా, ఉన్నది ఉన్నట్టుగా కాలిపోయింది. ఆమెనలా చూస్తూనే భోరుమన్నాడు పీర్సన్. ‘‘ఊరుకోండి సర్. అసలు ఇది ఎలా జరిగిందంటారు? మేడమ్ కూర్చున్న విధానాన్ని బట్టి ఆవిడ టీవీ చూస్తున్నట్టు అనిపిస్తోంది. కనీసం వంట చేసేటప్పుడు ప్రమాదం జరిగిందనుకోవడానికి లేదు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్లాంటిదేమైనా అయ్యిందేమో’’... ప్రమాదానికి కారణాలను అంచనా వేసే పనిలో పడ్డాడు జాన్. కానీ పీర్సన్ అవేమీ వినే పరిస్థితుల్లో లేడు. బూడిదశిల్పంలా ఉన్న భార్యవైపే చూస్తూ కూర్చున్నాడు. ఉన్నట్టుండి అతడి కళ్లు... ఎదురుగా ఉన్న గోడమీద పడ్డాయి. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఆ పిల్లాడి పెయింటింగ్ అలానే ఉంది. చుట్టూ ఉన్న మిగతా పెయింటింగులు, ఫొటోలన్నీ కాలిపోయాయి. కానీ అది మాత్రం అలానే ఉంది. ‘‘జాన్... ఇలారా’’ ఇన్చార్జి అరుపు వింటూ అక్కడికి వచ్చిన జాన్ పిల్లాడి చిత్రాన్ని చూసి భయంతో వణికాడు. ‘‘ఏంటి సార్ ఈ విచిత్రం? నాకెందుకో ఆ పెయింటింగువల్లే ఇదంతా జరిగిందని అనిపిస్తోంది. దాన్ని వెంటనే ఎక్కడైనా పారేయండి సర్’’ అన్నాడు కంగారుగా. నువ్వు చెప్పేది కరెక్టే అన్నట్టు తలూపాడు పీర్సన్. వెంటనే దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పారేశాడు. శని వదిలిందనుకున్నాడు. కానీ ఆ చిత్రం తనకి మరోసారి ఎదురవుతుందని అతడు ఊహించలేదు. నెల రోజుల తర్వాత... పీర్సన్ ఇంటికి రెండు వీధుల అవతల ఉన్న ఓ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ పీర్సన్ బృందానికి మళ్లీ ఆ పిల్లాడి పెయింటింగ్ కనిపించింది. మాడి మసైపోయిన వస్తువుల మధ్య, అందంగా, ఎంతో కళగా కనిపించింది. అది ఎక్కడిదని ఇంటి యజమానిని అడిగాడు పీర్సన్. రోడ్డుమీద వెళ్తూ అనుకోకుండా ఓ చెత్తబుట్ట వైపు చూస్తే, అందులో కనిపించిందని, అంత అందమైన చిత్రాన్ని అలా పారేయడం ఇష్టం లేక తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. దాన్ని ఇంటికి తెచ్చిన వారం రోజులకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. పీర్సన్కి విషయం అర్థమైంది. కచ్చితంగా ఆ చిత్రం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని అతడికి అర్థమైంది. దాన్ని ఎక్కడైనా పారేయమని ఆ వ్యక్తికి చెప్పాడు. అతడు దాన్ని తీసుకెళ్లి, ఓ నిర్మానుష్య ప్రదేశంలో పారేశాడు. అయినా కథ ముగిసిపోలేదు. మళ్లీ మళ్లీ పునరావృతమవుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల పాటు బ్రిటన్‌లో ఈ ‘క్రయింగ్ బాయ్’ పెయింటింగ్ కల్లోలాన్ని సృష్టించింది. ఆగ్ని ప్రమాదాలు జరిగిన చాలా ఇళ్లలో అగ్నిమాపక సిబ్బందికి ఈ చిత్రం కనిపించేది. అది కూడా చెక్కు చెదరకుండా. దాంతో ఆ చిత్రంలో ఏదో మర్మముందని, ఆ పిల్లాడు శపించడం వల్లే ఇలా జరుగుతోందనే వార్త బ్రిటన్ అంతటా షికార్లు చేయడం మొదలుపెట్టింది. అది నిజమా? ఆ పిల్లాడు నిజంగా ఉన్నాడా? అతడు శపించడం వల్లే ఇవన్నీ జరిగాయా? అమిడియో మరణించాక కొందరు డాన్ బానిల్లో చిత్రం గురించిన వాస్తవాలను బయటకు లాగేందుకు ప్రయత్నిం చారు. అమిడియో తన చిత్రాన్ని గీస్తున్నంతసేపూ డాన్ బానిల్లో ఏడుస్తూనే ఉన్నాడట. ఆ ఏడుపు చూసి కదిలిపోయిన అమిడియో... డాన్ని దత్తత తీసుకున్నాడట. డాన్ని ఇంటికి తీసుకొచ్చిన కొద్ది రోజులకే అమిడియో ఆర్ట్ స్టూడియో మంటల్లో చిక్కుకుందట. అక్కడే ఆడుకుంటోన్న డాన్ ఆ మంటల్లో చిక్కుకుని మరణించాడని, అతడి ఆత్మ ఆ పెయింటింగ్‌ని ఆవహించిందన్నది ఓ కథనం. ఇంకో కథనం ప్రకారం... అమిడియో అనాథ పిల్లల చిత్రాలు గీసి వచ్చేసిన తర్వాత అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం జరిగి, పిల్లలందరూ చనిపోయారు. దయ్యమైన డాన్ బానిల్లో తన చిత్రాన్ని ఆవహించాడు. అందుకే ఆ చిత్రాన్ని తీసుకెళ్లిన ప్రతి చోటకూ తనూ వెళ్లేవాడు. ఆ ఇంటిని శపించేవాడు. అందువల్లనే అన్ని ఇళ్లూ కాలిపోయాయి. ఇవన్నీ ఎవరెవరో చెప్పిన కథనాలు. ఇవి నిజాలో ఊహలో కూడా ఎవరికీ తెలియదు. అందుకే దేన్నీ నమ్మలేని పరిస్థితి. ద క్రయింగ్ బాయ్... ఈ చిత్రాన్ని గీసింది బ్రూనో అమిడియో అనే ఇటాలియన్ చిత్రకారుడు. నిజానికి అతడు దాదాపు 65 ‘క్రయింగ్ బాయ్స్’ చిత్రాలను వేశాడు. అవన్నీ కలిసి దాదాపు యాభై వేల కాపీలు అమ్ముడయ్యాయి. ఇంగ్లండ్‌లోని చాలా ఇళ్లలో గోడలను అలంకరించాయి. అయితే 64 చిత్రాల వల్ల ఏ సమస్యా రాలేదు. కానీ డాన్ బానిల్లో అనే పిల్లాడి చిత్రం మాత్రం చిత్రాలు చేసింది. దానిని ఎవరు ఇంట్లో పెట్టుకున్నా వారి ఇల్లు తగులబడిపోయేది. కానీ ఆ చిత్రానికి సెగ కూడా తాకేది కాదు. మొదట ఈ సంగతి ఎవరూ గమనించకపోయినా... ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఇంట్లోనూ ఆ పిల్లాడి పెయింటింగ్ కనిపించేసరికి ఈ ప్రమాదాలకీ ఆ చిత్రానికీ కచ్చితంగా సంబంధం ఉందనిపించింది. ఈ విషయం గురించి పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. దాంతో అందరూ తమ దగ్గర ఉన్న క్రయింగ్బాయ్ చిత్రాన్ని తీసుకెళ్లి పారేశారు. ఆ చిత్రం గురించిన కథనాలను పత్రికల్లో చదివాక, ఆ ప్రతులను సైతం తగులబెట్టేసేవారు. అంతగా ఆ పెయింటింగ్ అంటే భయం పట్టుకుంది. చాలామంది ఈ విషయాన్ని చిత్రకారుడు అమిడియో దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అతడీ విషయాన్ని అంగీకరించేవాడు కాదు. ఆ పిల్లాడు ఎవరో, అతగాడి కథ ఏమిటో చెప్పమంటే చెప్పేవాడు కాదు. 1981లో తాను చనిపోయేవరకూ కూడా బానిల్లో గురించిన నిజాన్ని అమిడియో బయట పెట్టలేదు. దాంతో ‘క్రయింగ్బాయ్’ పెయింటింగ్ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది! - సమీర నేలపూడి