ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఇవాళ్టి(జులై1, శుక్రవారం) నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో ఏయే వస్తువులపై నిషేధం విధించారో.. ఉల్లంఘిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం.
ఇయర్ బడ్స్(ప్లాస్టిక్ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (ప్లాస్టిక్ పుల్లలతో), ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు(ప్లాస్టిక్ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్)లపై నిషేధం అమలులోకి వచ్చింది.
ప్రత్యామ్నాయాలుగా.. పేపర్, జూట్, గ్లాస్, చెక్క, బంక, స్టెయిన్‌లెస్ స్టీల్, వెదురు.. ఇతరత్ర పర్యావరణానికి నష్టం కలిగించని వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమెండ్‌మెంట్ రూల్స్ 2021 ప్రకారం.. పైవాటిపై నిషేధం అమలులోకి వచ్చింది. వీటిని ఉల్లంఘిస్తే..
నిబంధనలను ఉల్లంఘిస్తే.. తయారు చేయడం, అమ్మకాలు, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం..వీటిలో ఏదైనా సరే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శిక్షార్హమే. ఐదేళ్ల వరకు గరిష్ఠ జైలుశిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంది. ఒకవేళ ఉల్లంఘనలు కొనసాగిస్తే.. అదనంగా ప్రతీ రోజూ ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలును పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని నేషనల్ కంట్రోల్ రూమ్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. దాని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్‌లతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment