ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఇందుకు బారీఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. కుంభమేళాకు సాధుసన్యాసులతో పాటు సామాన్యులు కూడా లక్షలాదిగా తరలిరానున్నారు. సంగమతీరంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.
కుంభమేళా(Kumbh Mela) సందర్భంగా ఇప్పుటికే పలువురు బాబాలు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. వీరిలో ఒకరే హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా. ఇతనిని చాబీవాలే బాబా(తాళాల బాబా) అని పిలుస్తుంటారు. ఈ బాబా ఎప్పుడూ తన వెంట 20 కిలోల తాళంచెవులను మోసుకెళుతుంటారు. ఈయనను ప్రయాగ్‌రాజ్‌లోని వారు బహువింతగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా తన 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి, ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని అవలంబించారు.
తాళాల బాబా మీడియాతో మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులు సన్యాసమార్గం అవలంబించారు. వారు నాకు హరిశ్చంద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరును నిలబెట్టుకునేందుకు నేను నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణం(Spiritual life journey) ప్రారంభించాను. హరిశ్చంద్రుడు మనందరికీ సన్మార్గాన్ని చూపాడు. నేను హరిశ్చంద్రుడు అందించిన మార్గాన్ని అనుసరిస్తున్నాను. ఇందుకోసం చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టాను. సత్యమార్గాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో ముక్తిని పొందేందుకు ప్రయత్నిస్తున్నాను.
సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలు, ద్వేషాలను తొలగించడంలో తనవంతు పాత్రను పోషించేందుకే ఇంటిని విడిచిపెట్టానని బాబా తెలిపారు. నా జీవన మార్గంలో లెక్కకుమించినన్ని పాదయాత్రలు చేశాను. ఎన్నోకష్టనష్టాలను ఎదుర్కొంటూ సత్యమార్గాన్ని విడవకుండా ముందుకు సాగుతున్నాను. రాబోయే మహాకుంభ మేళాను ఘనంగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ, సీఎం యోగి అమితమైన కృషి చేస్తున్నారు. తాను ధరించిన తాళాలు హృదయరాముని దర్శింపజేస్తాయని’ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు.. కరోనాకు ముందే..
Comments
Please login to add a commentAdd a comment