ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళో, రేపో అధికార లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రూడ్ ఇప్పటి వరకు తన భవిష్యత్ కార్యచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బుధవారం జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు ట్రూడో తన పదవికి రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని (Canadian Prime Minister) బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో ట్రూడో రాజీనామాకు గల కారణాలు తెరపైకి వచ్చాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోనుందంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. దీనికి తోడు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కవ్వింపు చర్యలకు దిగారు.
ఇటీవల, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై ట్రూడోతో ప్రస్తావించారు. కానీ ట్రూడో మాత్రం ట్రంప్‌కు ధీటుగా బదులివ్వలేకపోయారు. ఈ వరుస పరిణామాలు ట్రూడో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వెలుగులోకి వచ్చిన కెనడా మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.
రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ట్రూడో రాజీనామా చేస్తే .. ప్రస్తుత ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌తో తాత్కాలిక నాయకుడిగా, ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment