ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్‌ మస్క్‌ అంటే కథ వేరుంటది | Elon Musk Tweet Viral On General Motors | Sakshi
Sakshi News home page

ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్‌ మస్క్‌ అంటే కథ వేరుంటది

Published Fri, Jan 7 2022 3:44 PM | Last Updated on Fri, Jan 7 2022 6:14 PM

Elon Musk Tweet Viral On General Motors - Sakshi

టెస్లా సీఈఓ,స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ రోజురోజుకు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ హద్దుల్ని చెరిపేస్తున్నారు. ఇన్ని రోజులు యాపిల్‌ సంస్థ మీద, లేదంటే క్రిప్టో కరెన్సీలను ట్రోల్‌ చేసే ఎలన్‌ ఈ సారి రూటు మార్చాడు. మస్క్ అమెరికన్ ఆటోమేకర్ 'జనరల్ మోటార్స్‌' కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలపై ట్రోల్‌ చేశాడు. 

గతేడాది 4వ త్రైమాసికంలో జనరల్‌ మోటార్స్‌ కు చెందిన ఎలక్ట్రిక​ వెహికల్‌ అమ్మకాలపై 'టెస్లా సిలికాన్ వ్యాలీ క్లబ్' అనే ట్విట్టర్‌ నిర్వాహకులు 'క్యూ4' 2021లో జనరల్‌ మోటార్స్‌ 26 ఎలక్ట్రిక్ వాహనాల్ని విక్రయించిందని ట్వీట్‌ చేస్తూ..ఆ ట్వీట్‌ను ఎలన్ మస్క్‌ ట్విట్టర్‌ అకౌంట్‌కు ట్యాగ్‌ చేశారు.  

అంతే వెంటనే ఆ ట్యాగ్‌పై ఎలన్‌ స్పందించారు. కేవలం 26 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించినందుకు ఎలన్‌ ప్రత్యర్థి ఆటోమేకర్‌ను ట్రోల్ చేస్తూ 'రూమ్ టు ఇంప్రూవ్' అని రిప్లయి ఇచ్చాడు. ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా,గతేడాది 4వ త్రైమాసికంలో 3,08,600 టెస్లా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను విక్రయించింది. ఇక జనరల్‌ మోటార్స్‌ 2021 చివరి త్రైమాసికంలో 5 బోల్ట్ ఈవీలను, ఈయూవీలను,ఒక హమ్మర్ ఈవీ పికప్‌ను విక్రయించినట్లు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి.

చదవండి: పాపం ఎలన్‌ మస్క్‌..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement