ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమివిలువ పెంచుతూ శనివారం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. బాబు దొంగ దెబ్బతో కొనుగోలుదారులు గొల్లుమంటున్నారు. ప్రతీ ఏడాది భూమి రేట్లు పెంచే అంశాన్ని వారం రోజులు ముందుగా ప్రభుత్వం ప్రకటించేది. దాంతో క్రయవిక్రయదారులు ముందుగా రిజిస్ట్రేషన్లు చేయిచుకునేందుకు వెసులుబాటు ఉండేది.
భూముల విలువలు 10 నుంచి 20 శాతం పెంపు
కాకినాడ లీగల్ :
ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమివిలువ పెంచుతూ శనివారం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. బాబు దొంగ దెబ్బతో కొనుగోలుదారులు గొల్లుమంటున్నారు. ప్రతీ ఏడాది భూమి రేట్లు పెంచే అంశాన్ని వారం రోజులు ముందుగా ప్రభుత్వం ప్రకటించేది. దాంతో క్రయవిక్రయదారులు ముందుగా రిజిస్ట్రేషన్లు చేయిచుకునేందుకు వెసులుబాటు ఉండేది. అయితే ఈ సారి ‘బాబు’ శనివారం రాత్రి రిజిస్ట్రేషన్ భూమివిలువలు పెరుగుతున్నట్టు ప్రకటించడంతో ఆగస్టు ఒకటి నుంచి వీటిని రిజిస్ట్రేషన్ శాఖ అమలులోకి తీసుకోనుంది. చాలామంది కొనుగోలు దారులు తమ భూములను ఆగస్టు నెలలో వచ్చే శ్రావణమాసంలో రిజిస్ట్రేషన్‌లు చేయించుకునేందుకు నిర్ణయించుకున్నారు. వారికిది షాకే. జిల్లాలో రెండు కార్పొరేషన్‌లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగరపంచాయతీలలో భూమివిలువ పెరగనుంది. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న గ్రామాలకు భూమి విలువ 10 నుంచి 20శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంచలేదు. ఇప్పటి వరకు రూ. 10లక్షలSవిలువైన భూమికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 75 వేలు అయ్యేది. ఇప్పుడు భూమి విలువ 20శాతం పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు∙రూ.90వేలు అవుతుంది.
కాకినాడ కార్పొరేషన్‌లో..
కాకినాడ కార్పొరేషన్ మాస్టర్ పరిధిలోని చీడిగ, గంగనాపల్లి, కాకినాడమేడలైన్, కొవ్వూరు, నడకుదురు, సూర్యారావుపేట, తూరంగి గ్రామాల్లో భూమి విలువ పెరగనుంది.
కట్టడ నిర్మాణాలపైనా...
భూముల విలువ పెంచడంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న భవనం నిర్మాణాన్ని బట్టి ఇప్పటివరకు చదరపు అడుగుకు (ఆర్‌సీసీరూఫ్)కు రూ.870 ఉంది. ఆగస్టు 1 నుంచి రూ. 100 నుంచి రూ. 150 వరకూ ఇది పెరగనుంది. అలాగే సిమెంట్ రేకుతో ఉన్న ఇల్లు, మద్రాస్‌టెర్రస్‌తో ఉన్న ఇంటికి కూడా చదరపు అడుగుకు «గతం కంటే ధర పెరిగింది.