పెట్రో మంటకు ప్రత్యామ్నాయం
ఎకో టిప్స్
పెట్రోల్, డీజిల్ ఛార్జీలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో కార్లు, స్కూటర్లు ఉన్న వారు పెరిగిన భారాన్ని తగ్గించుకోవాలంటే మీ వాహనాల మైలేజీని పెంచుకోవలసిందే. అందుకు ఈ సూత్రాలను కచ్చితంగా పాటించవలసిందే.
► టైర్లలో గాలి సరిగా ఉండేలా సరిచూసుకోండి. ఎయిర్ ప్రెషర్ ఎక్కువైనా, తక్కువైనా మైలేజీలో తేడా వస్తుంది.
►దుమ్ముపట్టేసిన ఎయిర్ ఫిల్టర్స్ మార్చండి. లేకపోతే కనీసం 10 శాతం మైలేజీ తగ్గిపోవచ్చు.
►స్పీడ్ లిమిట్ పాటించాలి. గంటకు 60 కిలోమీటర్లు మించి స్పీడ్ వెళితే ఫ్యూయల్ సామర్థ్యం తగ్గుతుంది.
►సడన్ బ్రేక్స్, యాక్సిలరేటర్ హఠాత్తుగా పెంచడం వల్ల ఇంధనసామర్థ్యం 33 శాతం తగ్గుతుంది.
►రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించడం వల్ల వాహనం మైలేజ్ 4 శాతం పెరుగుతుంది.
ఇంధనం వాడకాన్ని తగ్గించడానికి ఇంకా మార్గాలున్నాయి. కాని అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం వాహనాలను సాధ్యమైనంత తక్కువ వాడటమే.