Fuel capacity
-
టెక్నాలజీ సాయంతో చమురు చోరీ, నిఘాకు ఐవోసీ డ్రోన్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న చమురు పైప్లైన్ల భద్రతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డ్రోన్లను రంగంలోకి దింపింది. ఢిల్లీ– పానిపట్ మార్గంలో 120 కిలోమీటర్ల పైప్‌లైన్‌పై నిఘా కోసం డ్రోన్ సేవలను ప్రారంభించింది. చమురు దొంగతనాలను నిరోధించడమే కాకుండా, ప్రమాదాలను అరికట్టడం కోసం టెక్నాలజీ వినియోగం అవసరమని సంస్థ భావిస్తోంది. 15,000 కిలోమీటర్ల పరిధిలో సంస్థకు పైపులైన్లు విస్తరించి ఉండగా.. వీటిల్లో లీకేజీలను గుర్తించేందుకు ఇప్పటికే ఎంతో అత్యాధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది. ఇప్పుడు పైపులైన్ల పర్యవేక్షణకు డ్రోన్ల సేవలను కూడా వినియోగించుకోనున్నట్టు ఐవోసీ అధికారులు తెలిపారు. టెక్నాలజీ సాయంతో చమురు చోరీకి సంబంధించి 2020–21లో 34 ప్రయత్నాలను అడ్డుకున్నట్టు, 53 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఆప్టికల్ఫైబర్ ఆధారిత పైపులైన్ ఇంట్రూజర్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ (పీఐడీడబ్ల్యూఎస్)ను ఐవోసీ 5,474 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తోంది. చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
పెట్రో మంటకు ప్రత్యామ్నాయం
ఎకో టిప్స్ పెట్రోల్, డీజిల్ ఛార్జీలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో కార్లు, స్కూటర్లు ఉన్న వారు పెరిగిన భారాన్ని తగ్గించుకోవాలంటే మీ వాహనాల మైలేజీని పెంచుకోవలసిందే. అందుకు ఈ సూత్రాలను కచ్చితంగా పాటించవలసిందే. ► టైర్లలో గాలి సరిగా ఉండేలా సరిచూసుకోండి. ఎయిర్ ప్రెషర్ ఎక్కువైనా, తక్కువైనా మైలేజీలో తేడా వస్తుంది. ►దుమ్ముపట్టేసిన ఎయిర్ ఫిల్టర్స్ మార్చండి. లేకపోతే కనీసం 10 శాతం మైలేజీ తగ్గిపోవచ్చు. ►స్పీడ్ లిమిట్ పాటించాలి. గంటకు 60 కిలోమీటర్లు మించి స్పీడ్ వెళితే ఫ్యూయల్ సామర్థ్యం తగ్గుతుంది. ►సడన్ బ్రేక్స్, యాక్సిలరేటర్ హఠాత్తుగా పెంచడం వల్ల ఇంధనసామర్థ్యం 33 శాతం తగ్గుతుంది. ►రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించడం వల్ల వాహనం మైలేజ్ 4 శాతం పెరుగుతుంది. ఇంధనం వాడకాన్ని తగ్గించడానికి ఇంకా మార్గాలున్నాయి. కాని అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం వాహనాలను సాధ్యమైనంత తక్కువ వాడటమే.