క్రెడిట్ కార్డుల ద్వారా మొబైల్ వాలెట్ టాప్ అప్‌లపై 2 శాతం చార్జీల విధింపుపై పేటీఎం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో చార్జీలు ఉపసంహరిస్తున్నట్లు వెల్లడిం చింది. తాము ఇలాంటి విషయాల్లో అత్యంత వేగంగా స్పందిస్తామని, కేవలం ఇరవై నాలుగ్గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని సవరించుకున్నామని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2016లో మ్యాగీ నూడుల్స్ విషయంలో నెస్లే ఇండియా సోషల్ మీడియాలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తలెత్తితే ఏ విధంగా బైటపడతారన్న ప్రశ్నపై స్పందిస్తూ ఆయన ఈ విషయాలు వివరించారు.