ప్రగతికి పాటుపడతా | new collector karthikeya misra charge received | Sakshi
Sakshi News home page

ప్రగతికి పాటుపడతా

Published Fri, Apr 21 2017 12:19 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

new collector karthikeya misra charge received

  • కొత్త కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
  • కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : 
    జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు శ్రమిస్తానని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా 145వ కలెక్టర్‌గా గురువారం ఉదయం 11.45 గంటలకు తన ఛాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా జిల్లాలోని పరిస్థితులను అవగాహన చేసుకుంటానన్నారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతానన్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు సత్వర ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడతానన్నారు. ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. శాఖల మధ్య సమన్వయం, అధికారుల జవాబుదారీతనంతో సమర్థవంతమైన పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న సహజ వనరులను  వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తోడ్పాటునందిస్తానన్నారు. భౌగోళికంగా రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరికి కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాసేవకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ విజయరామరాజు, సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్, సమాచారశాఖ డీడీ ఫ్రాన్సిస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇరిగేష¯ŒS ఎస్‌ఈ రాంబాబు, ఎక్సైజ్‌ శాఖ డీసీ అరుణారావు, డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.చంద్రయ్య, జెడ్పీ సీఈవో కె.పద్మ, వైద్య ఆరోగ్యశాఖ డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌ కిశోర్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, డీసీవో ప్రవీణ, సీపీవో మోహ¯ŒSరావు, విద్య, రెవెన్యూ అసోసియేష¯ŒS సంఘాల ప్రతినిధులు ఉన్నారు. 
    ఇదీ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా నేపథ్యం...
    జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా బిట్స్‌ పిలానీలో కంప్యూటర్‌ సై¯Œ్సలో ఇంజినీరింగ్‌ చేశారు. అనంతరం అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. 2009 సంవత్సరంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్, విశాఖ సబ్‌ కలెక్టర్‌గా పని చేశారు. రాష్ట్ర విభజనలో తొలుత తెలంగాణాకు కేటాయించగా ఈయన కోరికపై ఏపీకి వచ్చారు. మిశ్రా ఎ¯ŒSపీడీసీఎల్‌కు సీఎండీగా, ట్రా¯Œ్సకో జీఎండీగా పని చేశారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై తూర్పు గోదావరి జిల్లాకు 145 వ కలెక్టర్‌గా వచ్చారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement