karthikeya misra
-
కాస్త సూడండయ్యా?
పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టరుకు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిసెంబర్ 26న మహాసంస్థానాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసున్న అనంతరం అక్కడ ట్రస్టు సభ్యులు రూ.కోట్లలో అవినీతికి పాల్పడినట్టు అధికారులు ప్రకటించారు. వాటికి సంబంధించి పలు ఆధారాలను సేకరించారు. తదనంతర పరిణామాలలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పలు దఫాలుగా విచారణలు జరిపి అప్పటి ఈఓ చందక దారబాబుపై పలు ఆరోపణలు చేస్తూ ఆయనను సస్పెండ్æ చేశారు. అప్పటి నుంచి అన్నవరం ఈఓ జితేంద్ర పర్యవేక్షణలో సంస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత ఐఏఎస్ స్థాయి అధికారి ఉంటే తప్ప రూ.కోట్లలో జరిగిన అవినీతిపై విచారణ సాధ్యం కాదని చెబుతూ అన్నవరం ఈఓను నియమించిన దేవాదాయ శాఖ మూడు నెలలుగా విచారణలో ఎటువంటి పురోగతి సాధించలేదు. మూడు నెలల అనంతరం కలెక్టర్‌కు విచారణ జరపండంటూ లేఖ రాయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కావాలనే కాలయాపన చేశారా? సంస్థానంలో ఆదాయ వ్యయాలకు సంబంధించి ఎటువంటి రికార్డులు సక్రమంగా లేవని ముందే గుర్తించిన అధికారులు అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అలాంటప్పుడు అనుమానితులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం సంస్థాగత విచారణ పేరుతో నెల రోజులకు పైగా కాలయాపన చేసి ఒక అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతుందంటూ చెప్పుకొచ్చిన దేవాదాయ శాఖాధికారులు మూడు నెలలుగా మౌనంగా ఉండి ఇప్పుడు విచారణ చేయాలనడంలో అంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో ఏ అవినీతి జరగలేదని తామే చెబితే భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని, అదే విచారణ వేరే అధికారులు చేస్తే అప్పుడు ఏ వివాదానికి అవకాశం లేకుండా అవినీతి గుట్టుచప్పుడు కాకుండా గట్టెక్కుతుందన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈలేఖ రాశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు డిప్యూటీ కలెక్టరు హోదా కలిగిన అన్నవరం ఈఓ ఈ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేక పోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పక్కా ఆధారాలున్నా పట్టించుకోలేదు! సంస్థానానికి సంబంధించి అన్ని బ్యాంకు అకౌంట్లు ఆదాయాలు, ఆస్తులపై హక్కులన్నీ తన అనంతరం ట్రస్టు సభ్యులకు సంక్రమించేలా రాయించుకుని రిజిస్టర్ చేయించుకున్న వీలునామా విషయాన్ని పక్కన పెట్టేశారని భక్తులు విమర్శిస్తున్నారు. సంస్థానం పేరున ఉండాల్సిన ఆస్తులను వ్యక్తుల పేరున రాయించుకున్న వీలునామాలు బయటపడినప్పుడు సంబంధిత వ్యక్తులపై కేసులు ఎందుకు పెట్టలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రగతికి పాటుపడతా
కొత్త కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు శ్రమిస్తానని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా 145వ కలెక్టర్‌గా గురువారం ఉదయం 11.45 గంటలకు తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా జిల్లాలోని పరిస్థితులను అవగాహన చేసుకుంటానన్నారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతానన్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు సత్వర ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడతానన్నారు. ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. శాఖల మధ్య సమన్వయం, అధికారుల జవాబుదారీతనంతో సమర్థవంతమైన పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న సహజ వనరులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తోడ్పాటునందిస్తానన్నారు. భౌగోళికంగా రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరికి కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాసేవకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, సమాచారశాఖ డీడీ ఫ్రాన్సిస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఇరిగేష¯ŒS ఎస్ఈ రాంబాబు, ఎక్సైజ్ శాఖ డీసీ అరుణారావు, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, జెడ్పీ సీఈవో కె.పద్మ, వైద్య ఆరోగ్యశాఖ డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిశోర్, డ్వామా పీడీ నాగేశ్వరరావు, డీసీవో ప్రవీణ, సీపీవో మోహ¯ŒSరావు, విద్య, రెవెన్యూ అసోసియేష¯ŒS సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఇదీ కలెక్టర్ కార్తికేయ మిశ్రా నేపథ్యం... జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బిట్స్ పిలానీలో కంప్యూటర్ సై¯Œ్సలో ఇంజినీరింగ్ చేశారు. అనంతరం అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. 2009 సంవత్సరంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్, విశాఖ సబ్ కలెక్టర్‌గా పని చేశారు. రాష్ట్ర విభజనలో తొలుత తెలంగాణాకు కేటాయించగా ఈయన కోరికపై ఏపీకి వచ్చారు. మిశ్రా ఎ¯ŒSపీడీసీఎల్‌కు సీఎండీగా, ట్రా¯Œ్సకో జీఎండీగా పని చేశారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై తూర్పు గోదావరి జిల్లాకు 145 వ కలెక్టర్‌గా వచ్చారు. -
కాపీ చేసిందెవరో చెప్పండి?
సాక్షి, సిటీబ్యూరో: సులభ వాణిజ్యంలో ప్రపంచ ర్యాంకు కోసం తెలంగాణ ప్రభుత్వం కష్టపడి రూపొందించిన ఆన్లైన్ దరఖాస్తును కాపీ చేసి అక్రమ మార్గంలో ర్యాంక్ కొట్టేసే కుట్రలో పాత్రదారులు ఎవరనే విషయంపై నగర సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ రాష్ర్ట ఇండస్ట్రీస్ డైరెక్టర్ కార్తీకేయ మిశ్రాకు పోలీసులు సమాచారం కోసం లేఖ రాశారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను ఎవరు రెడీ చేశారనే విషయాలు తెలపాలని అందులో కోరినట్టు తెలిసింది. సులభ వాణిజ్యంలో ప్రపంచ ర్యాంక్ కోసం తెలంగాణ సర్కారు రెడీ చేసిన ఆన్లైన్ విధానాన్ని మక్కీకి మక్కీగా ఏపీ సర్కారు కాపీ చేసిందని తెలంగాణ సర్కారు ఇచ్చిన ఫిర్యాదుపై కాపీరైట్ చట్ట ప్రకారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇరు రాష్ట్రాలకు టెక్నికల్ పరంగా సహకారం అందిస్తున్న కంపెనీలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు సమచారం.