కాపీ చేసిందెవరో చెప్పండి? | Telangana govt asks to cyber crime officials who copied website content? | Sakshi
Sakshi News home page

కాపీ చేసిందెవరో చెప్పండి?

Published Wed, Jul 6 2016 11:32 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

Telangana govt asks to cyber crime officials who copied website content?

సాక్షి, సిటీబ్యూరో: సులభ వాణిజ్యంలో ప్రపంచ ర్యాంకు కోసం తెలంగాణ ప్రభుత్వం కష్టపడి రూపొందించిన ఆన్‌లైన్ దరఖాస్తును కాపీ చేసి అక్రమ మార్గంలో ర్యాంక్ కొట్టేసే కుట్రలో పాత్రదారులు ఎవరనే విషయంపై నగర సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ రాష్ర్ట ఇండస్ట్రీస్ డైరెక్టర్ కార్తీకేయ మిశ్రాకు పోలీసులు సమాచారం కోసం లేఖ రాశారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను ఎవరు రెడీ చేశారనే విషయాలు తెలపాలని అందులో కోరినట్టు తెలిసింది.

సులభ వాణిజ్యంలో ప్రపంచ ర్యాంక్ కోసం తెలంగాణ సర్కారు రెడీ చేసిన ఆన్‌లైన్ విధానాన్ని మక్కీకి మక్కీగా ఏపీ సర్కారు కాపీ చేసిందని తెలంగాణ సర్కారు ఇచ్చిన ఫిర్యాదుపై కాపీరైట్ చట్ట ప్రకారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇరు రాష్ట్రాలకు టెక్నికల్ పరంగా సహకారం అందిస్తున్న కంపెనీలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్టు సమచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement