జిల్లాల పునర్విభజన నిర్ణయంతో రిజిస్ట్రేషన్లశాఖలో ఏర్పడిన గందరగోళానికి తెరదించేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమయ్యాయి. పాలనా సౌలభ్యం కోసమని రాష్ట్రంలో 27 జిల్లాలను ఏర్పాటు చేయాలని సర్కారు ప్రతిపాదించగా.. రిజిస్ట్రేషన్లశాఖకు మాత్రం 16 జిల్లాలు చాలని వివిధ ఉద్యోగ సంఘాలు ఏక గ్రీవంగా తీర్మానించాయి. కొత్త జిల్లాల కూర్పుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించే నిమిత్తం ఇన్‌స్పెక్టర్ అండ్ జనరల్ కార్యాలయంలో రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కసరత్తు చేశారు. ఉద్యోగ సంఘాలు రిజిస్ట్రేషన్ జిల్లాల సంఖ్యను 16కు పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.
Published Fri, Sep 16 2016 6:45 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement