గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత! | Suspension of registrations in village and ward secretariats | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత!

Published Fri, Aug 9 2024 5:23 AM | Last Updated on Fri, Aug 9 2024 5:23 AM

Suspension of registrations in village and ward secretariats

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం

సాక్షి, అమరావతి : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. 

ప్రజలు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకుండా గ్రామ స్థాయిలోనే సచివాలయాల్లో పూర్తి చేసుకొనేలా రెండేళ్ల క్రితం అప్పటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది. భూముల రీ సర్వే పూర్తయిన 4 వేలకుపైగా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది.

ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉన్న ఈ విధానాన్ని తమ ఆదాయం పోతుందని డాక్యుమెంట్‌ రైటర్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉనికికే ప్రమాదమంటూ ఆ శాఖలోని పలువురు సిబ్బంది వ్యతిరేకించారు. అయిన­ప్పటికీ, ప్రజల మేలు కోరిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గ్రామాల్లోనే రిజి­స్ట్రేషన్‌ సేవలను అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెద్దగా జరగడంలేదనే సాకుతో దానిని నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement