
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ జాయింట్ ఐజీ వేముల శ్రీనివాసులు తెలిపారు. దీనిలో భాగంగా వాట్సాప్‌తో సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. డాక్యుమెంట్లు, వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ఏ సమస్యలు వచ్చినా.. నేరుగా సబ్ రిజిస్ట్రార్‌కు విషయాన్ని వివరించాలన్నారు.
అయినా సమస్య పరిష్కారం కాని పక్షంలో 7093920206కు వాట్సాప్ ద్వారా సమస్యను తెలియజేయాలన్నారు. 24 గంటల్లో స్పందన రాకుంటే.. స్పందన రాలేదని మళ్లీ అదే నంబరుకు వాట్సాప్ చేసే అధికారం వినియోగదారులకు ఉంటుందని తెలిపారు.