సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు 3 నెలల ఎదురు చూపుల తర్వాత వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ధరణి వెబ్ సైట్‌పై దాఖలైన పిటిషన్‌ను గురువారం విచారిం చిన హైకోర్టు రిజిస్ట్రేషన్లు ఆపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిం చింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రిజి స్ట్రేషన్ల ప్రారంభానికి నిర్ణయం తీసు కున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ‘వ్యవ సాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను స్లాట్ బుకింగ్ ద్వారా నిర్వహించడానికి హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు సాఫ్ట్‌వేర్ నిర్దేశించిన మొత్తంలో ఫీజులు, సుంకాలు చెల్లించి శుక్రవారం నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ సదుపా యం కల్పించాం. బుక్ చేసుకున్న స్లాట్ లోని తేదీ ప్రకారం ఈనెల 14 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ మవుతాయి. స్లాట్ బుక్ చేసు కున్న వ్యక్తులు మాత్రమే సం బంధిత తేదీ, సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. స్లాట్ బుకింగ్ లేకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోరు..’అని సీఎస్ స్పష్టం చేశారు.
ఇబ్బందులు.. ఆర్థిక నష్టం
కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనూ సంస్కరణలు తేవడం ద్వారా అవినీతి, అక్రమాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు నిలిచిపోయాయి. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం భూములు, ఆస్తులు అమ్ముకుని, కొనుక్కునే ప్రక్రియ నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడింది. గత మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో రావాల్సిన రూ.1,500 కోట్ల మేర ఆదాయం రాలేదు. ధరణిపై కోర్టులో దాఖలైన పిటిషన్ వాయిదాలు పడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ధరణిలో కాకుండా పాత విధానం (కార్డ్) ద్వారానే రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. వ్యవసాయేతర ఆస్తులు, భూములకు గతంలో ఎలా రిజిస్ట్రేషన్లు జరిగేవో.. మళ్లీ ప్రభుత్వ నిర్ణయం తీసుకునేంతవరకు అదే పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
కేటీఆర్ ట్వీట్..
కోర్టు ఆదేశాల అనంతరం మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి పోస్టు చేశారు. ‘హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను రేపట్నుంచి (శుక్రవారం) ప్రారంభించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు’అని గురువారం చేసిన ఆ పోస్టులో కేటీఆర్ తెలిపారు.
వ్యవసాయేతర ‘రిజిస్ట్రేషన్లు’ షురూ..
Published Fri, Dec 11 2020 1:46 AM | Last Updated on Fri, Dec 11 2020 12:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment