స్థిరాస్తి జాతకం ఈసీ! | Real Estate Horoscope Easy! | Sakshi
Sakshi News home page

స్థిరాస్తి జాతకం ఈసీ!

Sep 25 2015 11:31 PM | Updated on Sep 3 2017 9:58 AM

స్థిరాస్తి జాతకం ఈసీ!

స్థిరాస్తి జాతకం ఈసీ!

ఈసీ.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. మనం కొనాలనుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం

 ఆస్తిని కొనుగోలు చేసేముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)ను మరింత త్వరగా పొందే సదుపాయం అందుబాటులోకి రానుంది. వీటిని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు కూడా వారి సంతకాలతో జారీ చేసేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది.
 
 సాక్షి, హైదరాబాద్ : ఈసీ.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. మనం కొనాలనుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం. మరి ఇంత కీలకమైన పత్రంలో తప్పుల్లేకుండా దరఖాస్తు చేసుకోవడమెలాగో చదవండి మరి..

►ఒక ప్లాటు కొనాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు దాని పూర్తి చరిత్ర గురించి తెలుసుకోవాలి. లేకపోతే మన కష్టార్జితాన్ని బూడిదలో పోసినట్లే. మరి  అసలైన ఈసీ కావాలంటే ఆయా స్థలానికి సంబంధించిన వివరాలను తప్పుల్లేకుండా క్షుణ్నంగా, స్పష్టంగా రాయాలి. లేకపోతే తప్పుడు పత్రం వస్తుంది. తెలియక జరిగిన పొరపాటు వల్ల అంతిమ నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులు. మన సొమ్మును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది.

►ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నంబరు? విస్తీర ్ణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులా గల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు.

 ఇక్కడే తప్పు చేస్తారు: చాలామంది ఈసీ దరఖాస్తులో ఆస్తి వివరాలు, దానికి సంబంధించి న హద్దులు, విస్తీర్ణం సక్రమంగా ఇవ్వరు. ఏదో తోచినట్టుగా రాస్తారు. కంప్యూటర్ ఏం చేస్తుం దంటే.. అందులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారమే శోధించి వివరాలిస్తుంది. అం దుకే కొన్నిసార్లు ‘నిల్ ఈసీ’ వస్తుంది. అంటే ఆ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీలు జరగలేదని అర్థం. వాస్తవానికి దాని మీద బోలెడు లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వివరాలు తప్పుగా రాయడం వల్ల నిల్ ఈసీ వస్తుంది. దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మోసపోయినట్లే.

►ఒక సర్వేనంబర్‌లో ఐదె కరాల వ్యవసాయ భూమి ఉందనుకుందాం. వాటిలో ఒక రియల్టర్ వెంచర్ వేశారనుకుందాం. పదుల సంఖ్యలో ప్లాట్లు అమ్ముడవుతాయి. సహజంగానే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. కొన్నాళ్ల తర్వాత ఎవరైనా అందులో ప్లాటు కొనాలనుకుని ఐదెకరాల విస్తీర్ణం, సర్వే నంబరు, గ్రామం, మండలం, హద్దులు రాసి ఈసీకి దరఖాస్తు చేసుకుంటే నిల్‌ఈసీ వస్తుంది. కాకపోతే అప్పటికే అందులో పలువురు ప్లాటు కొనేసి ఉంటారు. మరి ఈసీలో ఈ వివరాలు ఎందుకు రాలేదంటే.. విస్తీర్ణం ఐదు ఎకరాలని రాశారు కాబట్టి. కంప్యూటర్ కేవలం ఆయా భూమిపై రిజిస్ట్రేషన్లు జరిగాయా అన్నది మాత్రమే చూపిస్తుంది. గంపగుత్తగా ఐదెకరాలు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. ఆయా సర్వే నెంబరుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలని అడగాలి. అప్పుడే పక్కా వివరాలు వస్తాయి.

►కొందరేం చేస్తారంటే.. 2 వేల గజాల స్థలాన్ని 200 గజాల చొప్పున పది మందికి అమ్ముతారు. అయితే 2 వేల గజాలకు సంబంధించి ఒకేసారి స్థల మార్పిడి జరగలేదు కాబట్టి ఈసీ కోసం దరఖాస్తు చేస్తే నిల్‌ఈసీ వస్తుంది. ఆ ఆస్తికి సంబంధించి ఆ వ్యక్తి గురించి ఎన్ని లావాదేవీలు జరిగాయని రాస్తేనే సరైన సమాచారం అందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement