encumbrance certificate
-
ఒక్క రోజులోనే ఈసీ
విజయనగర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి సురేష్ వనస్థలిపురంలో స్థలం కొనాలని భావించాడు. ముందుగా సదరు స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సర్వే నంబర్ తీసుకుని స్థానిక మీ–సేవ కేంద్రంలో ఈసీ కోసం దరఖాస్తు చేశాడు. అందుకు విధించిన నిర్ణీత గడువు తర్వాత కేంద్రానికి వెళ్లగా.. డిపార్ట్మెంట్ ఆమోద ముద్ర పడలేదని, మరుసటి రోజు రావాలని అటునుంచి సమాధానం వచ్చింది. మరుసటి రోజు వెళ్లగా అదే సమాధానం పునరావృతమైంది. సురేష్ లాంటి వారికి ఇకపై ఈసీ సీసీ ఇబ్బందులు తొలగించాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూములకు సంబంధించిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు తిరిగి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా జారీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న రోజే వీటిని జారీకి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా సరే.. అదే రోజు ఆమోదించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా సర్వర్ డౌన్ వంటి సమస్యలతో ఈసీ, సీసీల జారీ జాప్యానికి పూర్తిగా తెరపడనుంది. సాక్షి, సిటీబ్యూరో: భూముల కొనుగోలు దారులు ఎదుర్కొనే అతపెద్ద సమస్య అయిన ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్)లు, సీసీ (సర్టిఫైడ్ కాపీ)లు పొందడం. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల నుంచి పొందే ఈ సర్టిఫికెట్లను ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను జారీ చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్లక్రితం స్థిరాస్తుల సీసీలు, ఈసీలు జారీ బాధ్యతను ప్రభుత్వం మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు సీసీ, ఈసీల జారీ బాధ్యత నుంచి తప్పుకున్నాయి. ఇన్నేళ్లు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి ఆమోదిస్తూ వచ్చాయి. మీ–సేవ కేంద్రాల సర్వర్ సాంకేతిక సమస్యలకు తోడు ఈసీ, సీసీల ఆన్లైన్ దరఖాస్తులకు ఆమోద ముద్ర వేయడంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం సదరు సర్టిఫికెట్ల జారీ మరింత ఇబ్బందిగా మారింది. దీంతో నగరంలో స్థిరాస్తి కొనుగోలు, అమ్మకందారులకు సీసీ, ఈసీ ఇబ్బందులు తప్పడం లేదు. స్థలానికి సంబంధించిన పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోనడం కష్టంగా మారింది. రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్ సేవలు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వచ్చింది. అన్ని సేవలను కంప్యూటరీకరణ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో 1983 నుంచి ఈసీలు, సీసీలు కంప్యూటరీకరించి మీసేవ ద్వారా జారీ చేస్తూ వస్తోంది. కంప్యూటరీకరణ కానివి మాత్రమే సదరు రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అందిస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం ఈసీ, సీసీలు ఇవ్వడంతో ప్రజలకు ఎక్కడ సౌలభ్యంగా ఉంటే అక్కడ వీటిని తీసుకునేవారు. ఈసీ, సీసీ సేవలను ఒక్క మీ–సేవ కేంద్రాలకు మాత్రమే అప్పగించడంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈసీలు, దస్తావేజుల నకళ్ల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మీ సేవా కేంద్రాల్లో దస్తావేజుల జారీకి పెద్ద సమస్య లేకున్నా.. ఈసీ జారీకి మాత్రం పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మీ సేవా కేంద్రం నుంచి ఆన్లైన్లో అభ్యర్థన వెళ్తే దానికి అనుగుణంగా సతబంధిత సబ్ రిజిస్ట్రార్ ఈసీని పంపిస్తారు. అయితే తరచూ సర్వర్ సమస్యలు తలెత్తుతుండడంతో ఈసీ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ–సేవ కేంద్రాల సిబ్బందికి ఈసీల జారీ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల అభ్యర్థన దశలోనే తప్పులు దొర్లి దరఖాస్తుదారుడికి అవసరం లేని సమాచారం కూడా ఈసీలో దర్శనమిస్తోంది. సన్నకారు రైతులకూ బాదుడు.. గ్రేటర్లో ఏటా సుమారు మూడు లక్షల వరకు ఈసీలు జారీ అవుతాయి. హైదరాబాద్‌లో 75 వేల వరకు, శివార్లలో 2.25 లక్షల వరకు జారీ అవుతాయన్నది అంచనా. మీ–సేవ కేంద్రాల్లో ఈసీ, సీసీల జారీ కోసం డిమాండ్‌ను బట్టి ఆయా సెంటర్ల నిర్వాహకులు యూజర్ చార్జీలను దండుకుంటూ వచ్చారు. మరోవైపు సన్నకారు రైతుల సహకార సంఘాలకు ఈసీలను ఉచితంగానే మంజూరు చేయాల్సి ఉంటుంది. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఒక్కో ఈసీకి రూ.125 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సన్నాకారు రైతులకు ఉచితంగా ఈసీలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఉండగా.. మీ సేవ కేంద్రాల్లో మాత్రం ఆలాంటిదేమిలేదంటూ వసూళ్లు చేపట్టారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ తిరిగి పాత పద్ధతిలోనే సేవలను అందించాలని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే జారీ స్థిరాస్తులకు సంబందించిన ఈసీలు, సీసీల కోసం ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ–సేవ కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా వీటిని జారీ చేస్తాం. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఒక్క రోజులోనే వాటిని పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఈ వెసలు బాటును సద్వినియోగం చేసుకోవాలి. – కె.రఘుబాబు, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ (హైదరాబాద్) -
స్థిరాస్తి జాతకం ఈసీ!
ఆస్తిని కొనుగోలు చేసేముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)ను మరింత త్వరగా పొందే సదుపాయం అందుబాటులోకి రానుంది. వీటిని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు కూడా వారి సంతకాలతో జారీ చేసేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : ఈసీ.. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. మనం కొనాలనుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం. మరి ఇంత కీలకమైన పత్రంలో తప్పుల్లేకుండా దరఖాస్తు చేసుకోవడమెలాగో చదవండి మరి.. ►ఒక ప్లాటు కొనాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు దాని పూర్తి చరిత్ర గురించి తెలుసుకోవాలి. లేకపోతే మన కష్టార్జితాన్ని బూడిదలో పోసినట్లే. మరి అసలైన ఈసీ కావాలంటే ఆయా స్థలానికి సంబంధించిన వివరాలను తప్పుల్లేకుండా క్షుణ్నంగా, స్పష్టంగా రాయాలి. లేకపోతే తప్పుడు పత్రం వస్తుంది. తెలియక జరిగిన పొరపాటు వల్ల అంతిమ నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులు. మన సొమ్మును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ►ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నంబరు? విస్తీర ్ణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులా గల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు. ఇక్కడే తప్పు చేస్తారు: చాలామంది ఈసీ దరఖాస్తులో ఆస్తి వివరాలు, దానికి సంబంధించి న హద్దులు, విస్తీర్ణం సక్రమంగా ఇవ్వరు. ఏదో తోచినట్టుగా రాస్తారు. కంప్యూటర్ ఏం చేస్తుం దంటే.. అందులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారమే శోధించి వివరాలిస్తుంది. అం దుకే కొన్నిసార్లు ‘నిల్ ఈసీ’ వస్తుంది. అంటే ఆ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీలు జరగలేదని అర్థం. వాస్తవానికి దాని మీద బోలెడు లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వివరాలు తప్పుగా రాయడం వల్ల నిల్ ఈసీ వస్తుంది. దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మోసపోయినట్లే. ►ఒక సర్వేనంబర్‌లో ఐదె కరాల వ్యవసాయ భూమి ఉందనుకుందాం. వాటిలో ఒక రియల్టర్ వెంచర్ వేశారనుకుందాం. పదుల సంఖ్యలో ప్లాట్లు అమ్ముడవుతాయి. సహజంగానే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. కొన్నాళ్ల తర్వాత ఎవరైనా అందులో ప్లాటు కొనాలనుకుని ఐదెకరాల విస్తీర్ణం, సర్వే నంబరు, గ్రామం, మండలం, హద్దులు రాసి ఈసీకి దరఖాస్తు చేసుకుంటే నిల్ఈసీ వస్తుంది. కాకపోతే అప్పటికే అందులో పలువురు ప్లాటు కొనేసి ఉంటారు. మరి ఈసీలో ఈ వివరాలు ఎందుకు రాలేదంటే.. విస్తీర్ణం ఐదు ఎకరాలని రాశారు కాబట్టి. కంప్యూటర్ కేవలం ఆయా భూమిపై రిజిస్ట్రేషన్లు జరిగాయా అన్నది మాత్రమే చూపిస్తుంది. గంపగుత్తగా ఐదెకరాలు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. ఆయా సర్వే నెంబరుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలని అడగాలి. అప్పుడే పక్కా వివరాలు వస్తాయి. ►కొందరేం చేస్తారంటే.. 2 వేల గజాల స్థలాన్ని 200 గజాల చొప్పున పది మందికి అమ్ముతారు. అయితే 2 వేల గజాలకు సంబంధించి ఒకేసారి స్థల మార్పిడి జరగలేదు కాబట్టి ఈసీ కోసం దరఖాస్తు చేస్తే నిల్ఈసీ వస్తుంది. ఆ ఆస్తికి సంబంధించి ఆ వ్యక్తి గురించి ఎన్ని లావాదేవీలు జరిగాయని రాస్తేనే సరైన సమాచారం అందుతుంది. -
ఈసీ పొందడం ఇలా..
ఈసీ.. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. స్థిరాస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. మనం కొనాలనుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం. మరి ఇంతటి కీలకమైన పత్రం కోసం తప్పుల్లేకుండా దరఖాస్తు చేసుకోవాలి. - గాజులరామారం ప్రయోజనం.. ఒక స్థలం.. పొలం.. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది.. గతంలో దానిపై జరిగిన కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను ఈసీ తెలుపుతుంది. ప్రాపర్టీ ఓనర్షిప్ కన్ఫర్మేషన్, బ్యాంక్ లోన్ కావాలంటే, మార్ట్గేజ్ వివరాలు తదితర సమాచారం కోసం ఇది తప్పని సరి. ఈ సర్టిఫికెట్‌ను ‘మీ-సేవ’ ద్వారా సంబంధిత ప్రాంతీయ సబ్ రిజిస్ట్రార్ జారీ చేస్తారు.ఇది పొందేందుకు ముందుగా దగ్గరలోని ‘మీ- సేవ’ కార్యాలయానికి వెళ్లి ప్రాపర్టీ దస్తావేజుల నకలు లేదా రిజిస్ట్రేషన్ నంబరు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్ఓ) పేరు, దరఖాస్తుదారుడి పేరు వివరాలతో పాటు నిర్దేశిత రుసుం రూ. 225 చెల్లించి, మీ ప్లాటు/ ఫ్లాటు వివరాలతో కూడిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందాలనుకుంటే రూ.220 చెల్లించాలి. ఈ జాగ్రత్తలు తప్పని సరి.. ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా లిఖించాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నెంబరు? విస్తీర ్ణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులా గల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు. ఇక్కడే తప్పు చేస్తారు.. చాలామంది ఈసీ దరఖాస్తులో ఆస్తి వివరాలు, దానికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం సక్రమంగా ఇవ్వరు. ఏదో తోచినట్టుగా రాస్తారు. కంప్యూటర్ ఏం చేస్తుందంటే.. అందులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారమే శోధించి వివరాల్ని అందజేస్తుంది. అందుకే కొన్నిసార్లు ‘నిల్ ఈసీ’ వస్తుంది. అంటే ఆ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీలు జరగలేదని అర్థం. వాస్తవానికి దాని మీద బోలెడు లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వివరాలు తప్పుగా రాయడం వల్ల నిల్ ఈసీ వస్తుంది. దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మోసపోయినట్లే. గమనిక: ఏదైనా ప్రాంత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మారినా, విడిపోయినా పూర్తి వివరాల కోసం విడివిడిగా రెండిటికి దరఖాస్తు చేయాలి. ఉదా: 2007లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పడింది. అంతకు ముందు మేడ్చల్‌లోని కార్యాలయంలోనే ఈ ప్రాంతం రిజిస్ట్రేషన్లులు జరిగేవి. కుత్బుల్లాపూర్వాసులు 2007కు ముందు వివరాలు కావాలంటే రెండు ఈసీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇదే నిబంధన అన్ని ప్రాంతాలవారికి వర్తిస్తుంది. సెర్చ్ ఈసీ.. 1983 సంవత్సరానికి ముందు స్థిరాస్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోళ్ల వివరాలు కావాలంటే సెర్చ్ ఈసీ తీసుకోవాలి. ఇందుకోసం రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించాలి. ఈ వివరాలను లిఖిత పూర్వకంగా సబ్ రిజిస్ట్రార్ జారీ చేస్తారు. మీ-సేవలో 1983 సంవత్సరం తర్వాత జరిగిన స్థిరాస్తుల క్రయవిక్రయాల వివరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈసీ
ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ఆస్తుల క్రయ, విక్రయాల సమయంలో కీలక పాత్ర పోషించే యంకంబ్రాన్స్ సర్టిఫికేట్ (ఈసీ) ఇతర డాక్యుమెంట్లను కేవలం మీ సేవా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలా చేయడమంటే అవినీతిని ఆహ్వానించడమేనంది. వాటన్నిటినీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జారీ చేయాలని, ఆ మేర సబ్ రిజిస్ట్రార్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ కూడా పంపిణీ చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీని ఆదేశించింది. ఈసీలు, ఇతర డాక్యుమెంట్లను మీ సేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా, కంకిపాడుకు చెందిన జొన్నకూటి రాధాకృష్ణమూర్తి, కొత్తపల్లి సీతారామ ప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. వాటిని మీ సేవా కేంద్రాల్లోనే ఇవ్వడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వీర్జాల ప్రవీణ్‌కుమార్ కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని అధికారుల విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని రెవిన్యూ అధికారులను ఆదేశించింది. దీనిపై వారు స్పందించకపోగా.. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువునివ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఈసీ, ఇతర డాక్యుమెంట్ల కోసం నిర్దేశిత ఫీజు చెల్లించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా ఆశ్రయించవచ్చు. మీసేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్లందరూ కూడా ఆ డాక్యుమెంట్లను జారీ చేయాలి. కేవలం మీ సేవా కేంద్రాలే అంటే.. అది ఒక రకమైన హింస కూడా. అది అవినీతిని ఆహ్వానించడమే అవుతుంది. అందుకే ప్రజల సమస్యను తొలగించేందుకు ఈ ఆదేశమిస్తున్నాం’’ అని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. అమలు చేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం: హైకోర్టు ఉత్తర్వులను శనివారం విజయవాడలో దస్తావేజులేఖరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ పత్రికలకు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోతే, న్యాయపోరాటం చేస్తామని ఆయన స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులను హెచ్చరించారు. -
తప్పుల్లేని ఈసీకి సులువైన మార్గం!
సాక్షి, హైదరాబాద్: ఈసీ.. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీల కమైన పత్రం. మనం కొనాల నుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం. మరి ఇంత కీలకమైన పత్రంలో తప్పుల్లేకుండా దరఖాస్తు చేసుకోవడమెలాగో చూడండి. ఒక ప్లాటు కొనాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు దాని పూర్త చరిత్ర గురించి తెలుసుకోవాలి. లేకపోతే మన కష్టార్జితాన్ని బూడిదలో పోసినట్లే. మరి అసలైన ఈసీ కావాలంటే ఆయా స్థలానికి సంబంధించిన వివరాలను తప్పుల్లేకుండా క్షుణ్నంగా, స్పష్టంగా రాయాలి. లేకపోతే తప్పుడు పత్రం వస్తుంది. తెలియక జరిగిన పొరపాటు వల్ల అంతిమ నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులు. మన సొమ్మును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నంబరు? విస్తీరణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులాగల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు. ఇక్కడే తప్పు చేస్తారు.. చాలామంది ఈసీ దరఖాస్తులో ఆస్తి వివరాలు, దానికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం సక్రమంగా ఇవ్వరు. ఏదో తోచినట్టుగా రాస్తారు. కంప్యూటర్ ఏం చేస్తుందంటే.. అందులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారమే శోధించి వివరాల్ని అందజేస్తుంది. అందుకే కొన్నిసార్లు ‘నిల్ ఈసీ’ వస్తుంది. అంటే ఆ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీలు జరగలేదని అర్థం. వాస్తవానికి దాని మీద బోలెడు లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వివరాలు తప్పుగా రాయడం వల్ల నిల్ ఈసీ వస్తుంది. దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మోసపోయినట్లే. ఒక సర్వే నంబరలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉందనుకుందాం. వాటిలో వెంచర్ వేశాడనుకుందాం. పదుల సంఖ్యలో ప్లాట్లు అమ్ముడవుతాయి. సహజంగానే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. కొన్నాళ్ల తర్వాత ఎవరైనా అందులో ప్లాటు కొనాలనుకుని ఐదెకరాల విస్తీర్ణం, సర్వే నంబరు, గ్రామం, మండలం, హద్దులు రాసి ఈసీకి దరఖాస్తు చేసుకుంటే నిల్ ఈసీ వస్తుంది. కాకపోతే అప్పటికే అందులో పలువురు ప్లాటు కొనేసి ఉంటారు. మరి ఈసీలో ఈ వివరాలు ఎందుకు రాలేదంటే.. విస్తీర్ణం ఐదు ఎకరాలని రాశారు కాబట్టి. కంప్యూటర్ కేవలం ఆయా భూమిపై రిజిస్ట్రేషన్లు జరిగాయా అన్నది మాత్రమే చూపిస్తుంది. గంపగుత్తగా ఐదెకరాలు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. ఆయా సర్వే నంబరుకు సంబంధించిన పూర్తి వి వరాలు కావాలని అడగాలి. అప్పుడే పక్కా వివరాలు వస్తాయి. కొందరేం చేస్తారంటే.. 2 వేల గజాల స్థలాన్ని 200 గజాల చొప్పున పది మందికి అమ్ముతారు. అయితే 2 వేల గజాలకు సంబంధించి ఒకేసారి స్థల మార్పిడి జరగలేదు కాబట్టి ఈసీ కోసం దరఖాస్తు చేస్తే నిల్ ఈసీ వ స్తుంది. ఆ ఆస్తికి సంబంధించి ఎన్ని లావాదేవీలు జరిగాయని రాస్తేనే సరైన సమాచారం అందుతుంది. -
‘రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనూ ఈసీలివ్వాలి’
సాక్షి, హైదరాబాద్: మీసేవ కేంద్రాలలో మాదిరిగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, దస్తావేజు నకళ్లు (సీసీలు) ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించాలని సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్, రిజిస్ట్రేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండు చేశారు. ఈమేరకు మంగళవారం అసోసియేషన్ల ప్రతి నిధులు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. మీసేవ కేంద్రాలతో సమాంతరంగా సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించి సీసీలు, ఈసీలు ఇచ్చే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ భాస్కర్‌రావు, స్థితప్రజ్ఞ, తెలంగాణ సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు నేతృత్వంలో రిజిస్ట్రేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ల ప్రతినిధులు కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి సమస్యలను వివరించారు. అనంతరం వారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ విజయకుమార్‌ను కూడా కలిసి ఇవే అంశాలను వివరించారు.