అమర్‌నాథ్ యాత్రకు వెళ్దామిలా! | Amarnath Yatra veldamila! | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్ యాత్రకు వెళ్దామిలా!

Published Sat, Mar 14 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

Amarnath Yatra veldamila!

అమరనాథ్ యాత్రకు 2015 సంవత్సరానికి రిజిస్ట్రేషన్‌లు మొదలయ్యాయని ‘శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోరు’్డ వారు సూచిస్తున్నారు. అయితే భక్తి, కోరిక ఉంటే సరిపోదు... ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే శ్రీనగర్ నుంచి పహల్‌గావ్ వరకు వాహనాల్లో వెళ్లిన అక్కడ నుంచి ఆలయం వద్ద వరకు నడుచుకుంటూ వెళ్లాలి. అంతేకాదు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి మీకున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తేనే యాత్రకు అనుమతి లభిస్తుంది.
 
పేరు నమోదు ఇలా...
దరఖాస్తులను పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్ము, కశ్మీర్‌బ్యాంక్, యస్ బ్యాంక్‌లలో చేసుకోవచ్చు.
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మెత్తం 11 శాఖలలో ఈ సదుపాయం ఉంది.
 
హైదరాబాద్‌లో ఉన్న వారు నగరంలో రాష్ట్రపతి రోడ్, హిమాయత్‌నగర్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో, పత్తర్‌గట్టిలో ఉన్న జమ్ము, కశ్మీర్ బ్యాంక్‌లలో యాత్రి పర్మిట్ పొందవచ్చు.
 తెలుగు రాష్ట్రాలలో మెదక్, కరీంనగర్, చిత్తూరు, వైజాగ్, నెల్లూరు, కృష్ణ, గుంటూరులలో నిర్ధేశిత బ్యాంక్‌లలో పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు.
 
12 నుంచి యాత్రికులకు వైద్య పరీక్షలు
విశాఖ-మెడికల్: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు విశాఖలోని కేజీహెచ్‌లో ఈనెల 12 నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌బాబు తెలిపారు. వారంలో రెండు రోజులపాటు ఆస్పత్రిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. యాత్రికులు మంగళవారం, గురువారంలో మెడికల్ బోర్డుకు హాజరుకావలసి ఉంటుందని అన్నారు. వైద్య పరీక్షలు, ఫిజికల్ సర్టిఫికెట్ కోసం రూ.500లు ఆస్పత్రి అభివృద్ధి ఖాతాలో జమ చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షలకు మంగళవారం హాజరయ్యేవారికి గురువారం ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
 
దరఖాస్తు కోసం http://www.shriamarnathji shrine.com/Yatra2015/CHC/FormatCHCYatra2015.pdf  
లింక్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
యాత్రి పర్మిట్ పొందడానికి నియమాలు..
 ‘ముందు వచ్చిన వారికి ముందుగా’ విధానంపై యాత్ర అనుమతి ఇస్తారు.
 ఒక పర్మిట్ ఒకరికి మాత్రమే వర్తిస్తుంది.
 యాత్ర చేయడానికి పహల్గమ్, బల్తాల్ పట్టణాలు మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నారో ఆ మార్గంను అనుసరించి అనుమతిస్తారు.  
 
 13 సంవత్సరాలకు తక్కువ, 75 ఏళ్లకు ఎక్కువ వయసు ఉన్నవారిని యాత్రకు అనుమతించరు.  
 పేరు నమోదుకు కచ్చితంగా హెల్త్ సర్టిఫికెట్ జత చేయాలి.
 శ్రీ అమర్‌నాధ్‌జీ ష్రైన్ బోర్డు వారు నిర్దేశించిన నమూనాతో, వారు ఎంపిక చేసిన వైద్యులతో ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి.
 
దరఖాస్తు పత్రాన్ని ఆన్‌లైన్‌లో కాని, నిర్దేశిత బ్యాంకులలో కాని ఉచితంగా పొందవచ్చు.
 పూరించిన దరఖాస్తు, హెల్త్ సర్టిఫికెట్‌తో పాటుగా మూడు పాస్‌పోర్ట్ ఫొటోలు ఇవ్వాలి.
 హెల్త్ సర్టిఫికెట్ 10 ఫిబ్రవరి 2015 తర్వాత పొందిందయి ఉండాలి.
 రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 50 బ్యాంక్‌లో చెల్లించాలి.
 ఎంపిక చేసిన బ్యాంక్‌లలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శనివారం మధ్యాహ్నం 1 గంట  నుంచి సాయంత్రం 4 వరకు పేర్లు నమోదు చేసుకుంటారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement