ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు!
హైదరాబాద్: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ఉడా పరిధిలో రిజిస్ట్రేషన్లు యథావిథిగా చేసుకోవచ్చని హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కొత్త రాజధాని ప్రాంతం వీజీటీఎం ఉడా పరిధిలోకి రావడంతో ఆ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్లు, లేఅవుట్, గ్రూప్ హౌసింగ్స్ను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆ మెమోను సస్పెండ్ చేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ వచ్చే వరకు భూ రిజిస్ట్రేషన్లు ఆపాలన్న జీఓపై విచారణ కొనసాగుతుంది.
**