జూన్ 25నుంచి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్: హెల్ప్‌లైన్లు
జూన్ 25నుంచి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్: హెల్ప్‌లైన్లు
Published Fri, Jun 23 2017 7:26 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి ఏకీకృత బిల్లు జీఎస్‌టీ అమలు కు కేంద్ర సన్నద్ధమవుతున్న తరుణంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం చేసింది. జీఎస్‌టీ నెటవర్క్ లో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లను ప్రారంభించనుంది. జీఎస్‌టీఎన్ పోర్టల్ లో జూన్ 25 నుంచి తాజా రిజిస్ట్రేషన్లను ఆమోదించనుంది. ముఖ్యంగా ఇకామర్స్ , కొత్త కంపెనీలు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు జూన్ 25 న ప్రారంభం కానున్నాయని జీఎస్‌టీఎన్ తెలిపింది. అలాగే ఇకామర్స్ ఆపరేటర్లు, టిడిఎస్ డిడ్యూటర్లు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త టెక్నాలజీకి మారే సమయంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులకు సహాయం, మార్గనిర్దేశం అవసరం అవుతుంది. ఇందుకోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఇవి, జూన్ 25 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి' అని జీఎస్టీఎన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ , వ్యాట్ కోసం జీఎస్‌టీఎన్ పోర్టల్ లో మరోసారి నమోదు అవకాశం వచ్చే ఆదివారం మొదలు కానుంది. ఇది మూడు నెలలు తెరిచే ఉంటుంది. ప్రస్తుతం 81 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 65.5 లక్షల మంది ఇప్పటికే పోర్టల్‌కు మైగ్రేట్ అయ్యారు. జీఎస్‌టీ పరిధిలో ప్రతి వ్యాపారం నమోదు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పోర్టల్ లో రిటర్న్స్ ఫైలింగ్‌తో పాటు నెలవారీ సరఫరా డేటాను కూడా అప్లోడ్ చేయాలి.
అయితే ఈ అంశంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక వేళ రిజిస్ట్రేషన్ మిస్ అయితే మరొక అవకాశాన్ని పొందుతారని తెలిపింది. ఎందుకంటే చట్టం ప్రకారం వారు చెల్లుబాటు అయ్యే ప్యాన్ ఉన్నట్లయితే పన్ను పరిధిలో నమోదు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జీఎస్‌టీఎన్ ఛైర్మన్ నవీన్ కుమార్ చెప్పారు. ప్రతి నెలా 2.6 బిలియన్ లావాదేవీలను నిర్వహించే సామర్ధ్యంతో జీఎస్‌టీన్ ఓ పోర్టల్‌ను రూపొందించినట్టు చెప్పారు.
జీఎస్టీకి సంబంధించి పన్ను చెల్లింపుదారులు తమ సందేహాలపై 0120-4888999కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని, ఇందుకోసం నిపుణులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. అలాగే అసిస్టెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్స్ అధికారులు సైతం 0124-4479900కు మరో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement