కోరుకొండ గ్రామంలోని భూముల రిజిస్ట్రేషన్లు తక్షణం పునరుద్ధరించాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. గ్రామంలోని భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ
భూముల రిజిస్ట్రేషన్‌కు చర్యలు తీసుకోవాలి
Published Wed, Mar 8 2017 11:29 PM | Last Updated on Tue, May 29 2018 3:40 PM
కోరుకొండ (రాజానగరం) :
కోరుకొండ గ్రామంలోని భూముల రిజిస్ట్రేషన్లు తక్షణం పునరుద్ధరించాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. గ్రామంలోని భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ ఆఫీసు నుంచి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వరకూ వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు, గ్రామస్తులు బుధవారం మౌనంగా ర్యాలీ నిర్వహించారు. ఆలయం వద్ద అంతా ముక్కుపై వేలేసుకుని నిరసన తెలిపారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏకమై ఇక్కడి రైతుల భూములను రెండేళ్లుగా రిజిస్ట్రేష¯ŒS కాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైకోర్టును ఆశ్రయిస్తాం
అన్నవరం దేవస్థానం అధికారుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని విజయలక్ష్మి తెలిపారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ జగన్నాథంను కలసి రైతుల సమస్యలను వివరించారు. వారికి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు గరగ మధు, అయిల శ్రీను, బొరుసు బద్రి, తోరాటి శ్రీను, సూరిశెట్టి భద్రం, అడబాల గొల్లబాబు, వాకా నరసింహరావు, అత్తిలి రాంప్రసాద్, బొల్లిన సుధాకర్, కొల్లి ఇస్రాయేల్, యడ్ల సత్యనారాయణ, గణేషుల పోసియ్య, గట్టి ప్రసాద్, పాలం నాగవిష్ణు, నొక్కి అప్పారావు, కల్యాణం రాంబాబు, బొడ్డుపల్లి శివ, కోడూరి సత్తిరెడ్డి, పసుపులేటి బుల్లియ్యనాయుడు, కోడినాగుల ప్రసాద్, అడపా కుమార్, వుల్లి గణనాథ్, నీరుకొండ యుదిష్టరనాగేశ్వరరావు, అయిల రామకృష్ణ, జాజుల సత్తిబాబు, కామిశెట్టి విష్ణు, గుగ్గిలం భాను, కాలచర్ల నాగు, వంకా చిన అప్పన్న, అడపా జగదీష్, సూరిశెట్టి అప్పలస్వామి, సొంగా వెంకటేశ్వరరావు, ఆర్.సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.
బెంగతో మంచం పట్టిన రైతులు
తమ భూములు రిజిస్ట్రేషన్లు కాక మానసికంగా కృంగిపోయిన చాలా మంది రైతులు, ప్రజలు మంచం పట్టారని ఆవేదన చెందారు. సుమారు 11 వేల ఎకరాలను దేవస్థానం భూములుగా అన్నవరం దేవస్థానం అధికారులు పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కోరుకొండ దేవస్థానం సొమ్మును అన్నవరం దేవస్థానానికి ఖర్చు చేశారని, వివరాలు అడిగితే పోలీసులతో గెంటించేశారని విమర్శించారు. ఇప్పటికైనా అన్నవరం దేవస్థానం ఈఓ, స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకొని గ్రామంలోని భూములకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించేందుకు కృషి చేయాలన్నారు. రైతులు, ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు.
Advertisement
Advertisement