
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో నిర్మించిన ఇళ్లపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమయ్యాయి. పథకం కింద 1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకున్నవారు నిర్దేశించిన మొత్తం, రుణం తీసుకోని వారు రూ.10 నామమాత్రపు రుసుము చెల్లిస్తే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తోంది.
గుంటూరు, కృష్ణా సహా ఐదు జిల్లాల్లో శనివారం లాంఛనంగా రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించారు. సోమవారం నాటికి 200 రిజిస్ట్రేషన్‌లు పూర్తయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. మంగళవారం నుంచి 13 జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభిస్తున్నట్టు గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment