గత ప్రభుత్వం హక్కులిచ్చిన భూములన్నింటిపైనా విచారణ
సక్రమంగానే ఉన్నా రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉంచాలని ఆదేశం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై కల్పించిన యాజమాన్య హక్కులను హరించేలా కూటమి సర్కారు చర్యలకు దిగింది. యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా గత ప్రభుత్వం 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై విచారణ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది. యాజమాన్య హక్కులు పొందిన తర్వాత రిజి్రస్టేషన్లు జరగని లేదా ఎలాంటి లావాదేవీలు జరగని భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయాలంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిన భూములపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పేర్కొంది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా శనివారం కలెక్టర్లు, రిజి్రస్టార్లు, సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ చేశారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల వల్ల అనర్హులు లబ్ధి పొందారని, రిజిస్ట్రేషన్ల చట్టం 1908 సెక్షన్ 22ఏకి విరుద్ధంగా హక్కులిచ్చారని అందులో పేర్కొన్నారు. సామాజిక, పోరంబోకు భూములపై అక్రమంగా హక్కులిచ్చారని, అనంతరం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులిచి్చన చోట్ల విచారణ నిర్వహించి దీనిద్వారా ఎక్కడైనా భూకబ్జాలు జరిగాయా? హక్కుల నిర్థారణలో వాస్తవికత ఉందో లేదో నిర్థారించేందుకు వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు.
మూడు నెలలో వెరిఫికేషన్ పూర్తి కావాలని, ఇందుకోసం కలెక్టర్లు విచారణ సంస్థలను ఉపయోగించుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా ఏ కేసులోనైనా యాజమాన్య హక్కుల కల్పన అక్రమంగా జరిగినట్లు తేలితే వాటిని రద్దు చేసి ఆ భూమిని తిరిగి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చేలా రీ క్లాసిఫికేషన్ చేయాలని ఆదేశించారు. యాజమాన్య హక్కులిచి్చన భూములను ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే ఇకపై వాటికి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సూచించారు. విచారణలో యాజమాన్య హక్కులు సక్రమంగానే ఇచి్చనట్లు తేలినా వాటిపై రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment