సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 21 మండలాల్లో రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 19 నుంచి ఆయా మండలాల్లో తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వహిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలను అప్పగించేందుకు 1908 రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం కొత్తగా 21 సబ్‌జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే, గతంలో ఉన్న సబ్‌జిల్లాల్లో పలు మండలాలుండేవి. కానీ, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌జిల్లాలను కేవలం ఒక్క మండలానికే పరిమితం చేశారు.
సోయా విత్తనాలకు మరో రూ.400!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోయాబీన్ విత్తనాల కోసం చెల్లించే ధరను మరో రూ.400 పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది సర్కారు ధర ఖరారు చేసినా.. మరింతగా పెంచాలన్న విత్తన వ్యాపారుల ఒత్తిడికి వ్యవసాయ శాఖ తలొగ్గింది. ఈ మేరకు సర్కారుకు పెంపు ప్రతిపాదనలు పంపింది.
గతేడాది క్వింటాల్ సోయాబీన్ విత్తన ధర రూ.5,475 కాగా.. ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.5,800గా ఖరారు చేసింది. అయితే సోయా విత్తన వ్యాపారులు ఒత్తిడితో రూ.6,200కు పెంచేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైందని అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment