9 నెలలుగా రిజిస్ట్రేషన్ల శాఖ వద్దే మూలుగుతున్న రూ.458 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం స్థానిక సంస్థలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు అభివృద్ధి నిధుల్లేక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన కోట్ల రూపాయల ఆస్తి బదలాయింపు చార్జీల (ట్రాన్స్‌ఫర్ డ్యూటీ) నిధులు రిజిస్ట్రేషన్ల శాఖ వద్దే మూలుగుతున్నాయి.
గత 9 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 3.80 లక్షల రిజిస్ట్రేషన్లకు సుమారు రూ.458 కోట్ల మేర ట్రాన్స్‌ఫర్ డ్యూటీ (టీడీ)గా రిజిస్ట్రేషన్ల శాఖ ఖాతాలో జమ అయింది. కాగా, వివిధ కారణాలతో ఆయా సంస్థలకు బదిలీ కావాల్సిన టీడీ మొత్తం నెలల తరబడి రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉండిపోయింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల పబ్లిక్ డిపాజిట్(పీడీ) అకౌంట్లు, డీడీవో కోడ్‌లు తమవద్ద లేనందునే టీడీ మొత్తాలను సంస్థలకు బదలాయించ లేదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
స్థానిక సంస్థలకు చేరని టీడీ నిధులు
Published Sun, Dec 25 2016 2:00 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement