panagal
-
శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీ ఛాయా సోమేశ్వరాలయం
చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఓం నమఃశివాయ స్మరణతో మారుమోగే అద్భుత దేవాలయమే శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. సోమవారం వచ్చిందంటే భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం అద్భుత నిర్మాణ శైలికి నిలయం. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ పట్టణానికి సమీపంలోని పానగల్ వద్ద ఉన్న ఛాయా సోమేశ్వరాలయం శివరాత్రి సందర్భంగా మహోత్సవాలకు సిద్ధం అవుతోంది.ఎక్కడైనా సూర్యకాంతి, విద్యుత్తు దీపాల వెలుతురులో ఏర్పడే ఛాయ (నీడ) గమనాన్ని బట్టి మారడం సహజం. కానీ ఇక్కడ శివలింగంపై పడే ఛాయ సూర్యుని గమనంతో సంబంధం లేకుండా స్తంభాకారంలో నిశ్చలంగా ఉండటం విశేషం. సూర్యరశ్మితో సంబంధం లేకుండా, వర్షం పడినా, ఆకాశం మేఘావృతమైనా ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నివేళలా ఒకేలా ఉంటుంది. అందుకే ఇది ఛాయా సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది. రాజసం ఉట్టిపడే అద్భుత శిల్ప కళాసంపద, కాకతీయుల నాటి శిల్ప కళారీతులు శ్రీఛాయాసోమేశ్వర స్వామి సొంతం. ఈ ఆలయంలోని ఎంతో విశేషమైన బ్రహ్మసూత్ర లింగాన్ని భక్తులే స్వయంగా అభిషేకించడం మరోప్రత్యేకత. ఆ శివలింగాన్ని ఒక్కసారి తాకితే వేయి లింగాలను దర్శించిన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.వెయ్యేళ్ల కిందటి అద్భుత కట్టడం...భారతీయ వాస్తు, శిల్పకళా చాతుర్యంలో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం›చేసి ఆలనాటి కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. పానగల్‌ను రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల సామంత రాజులైన కుందూరు చాళుక్య రాజు ఉదయ భానుడు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాల్లో దీంతో పాటు సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం కూడా నిర్మించారు. శివలింగం చుట్టూ పచ్చని వజ్రాలను పొదగడంతో ఆలయం అంతా పచ్చని వెలుతురు వెదజల్లేదని చెబుతారు.మూడు గర్భాలయాలు...చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి. అందుకే దీనిని త్రికూటాలయంగా పేర్కొంటారు. మరోవైపు ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి. స్తంభాలపై రామాయణ, మహాభారతాలు...గుడి ఆవరణ మొత్తం 18 స్తంభాలతో ఉంటుంది. అందులో పడమరన ఉన్న సోమేశ్వరుడి ఆలయం ముందు 8 స్తంభాలు ఉంటాయి. వాటిల్లో ఏ స్తంభం నీడ శివలింగంపై పడుతుందన్నది ఇక్కడి రహస్యం. మరోవైపు ఆయా స్తంభాలపై రామాయణ, మహాభారతాలు విగ్రహ రూపంలో ఉండటం విశేషం. నాలుగు స్తంభాలపై ఉండే మండపం పైభాగంలో అష్టదిక్పాలకులు, మూడు గర్భ గుడుల ముందు గజలక్ష్మి కొలువై ఉంటుంది. అయితే సూర్యభగవానుడి భార్య ఛాయాదేవి పరమ శివుని ప్రార్థించి శివుని వరంతో ఛాయగా ఉన్నట్లు భావిస్తారు.ప్రతి సోమవారం, పర్వదినాల్లో ప్రత్యేక పూజలుఆలయంలో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు కొనసాగుతాయి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు చేస్తారు. తొలి ఏకాదశితో పాటు నిత్యాభిషేకాలు, కార్తీక పౌర్ణమి, దసరా, మహాశివరాత్రి, ఉగాది వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం, అమావాస్య రోజుల్లోనూ విశేషంగా భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా యజ్ఞాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, శివ పార్వతీ కళ్యాణం, అగ్నిగుండాలు, తెప్పొత్సవాలను నిర్వహిస్తారు.ఉదయ సముద్రం నీరే కోనేరులోకి పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువులోని నీరే కోనేరులోకి రావడం ఇక్కడ విశేషం. దానికి ప్రత్యేకంగా పాయ అంటూ లేకపోయినా నీరు కోనేరులోకి రావడం ప్రత్యేకత. ఇప్పటికీ నీటి తడి (చెమ్మ) శివలింగం ఉన్న గర్భగుడిలో ఉంటుంది. – ప్రధాన అర్చకుడు ఉదయ్‌కుమార్.– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
రెండో భార్యతో ఉండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..
సాక్షి, నల్గొండ: అతనో పోలీస్ కానిస్టేబుల్. అన్నాతమ్ముళ్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. అంతా పోలీసులే కదా ఏమైనా చేయవచ్చనుకున్నాడేమో కానీ భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. అనుమానం వచ్చిన భార్య ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వివరాల్లోకెళ్తే.. నల్గొండ జిల్లా పానగల్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్యతో ఉండసాగాడు. కొంతకాలంగా భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొదటి భార్య నిఘా పెట్టగా అతగాడి నిర్వాకం బయటపడింది. రెండో భార్యతో ఉన్న ప్రసాద్‌ను మొదటి భార్య, ఆమె బంధువులు కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 8 ఏళ్లుగా కానిస్టేబుల్ ప్రసాద్ మొదటి భార్యకు దూరంగా ఉన్నట్లు బాధితురాలు పేర్కొంది. తనకు, పిల్లలకు అన్యాయం చేస్తోన్న ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మొదటి భార్య కోరుతోంది. ఘటనపై మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వ్యభిచార గృహంపై దాడి.. పొరుగు రాష్ట్రాల అమ్మాయిలను పిలిపించి..) -
4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నవేళ అతి పురాతన మహిషాసురమర్ధిని శిల్పం వెలుగు చూసింది. విష్ణుకుండినుల హయాంలో నాలుగో శతాబ్దంలో రూపొందిన ఈ రాతి విగ్రహాన్ని నల్లగొండ జిల్లాలో చరిత్ర పరిశోధకులు గుర్తించారు. కట్టంగూరు రోడ్డులో పానగల్లుకు 3 కిలోమీటర్ల దూరంలో గల దండంపల్లి శివారులో ఓ చెట్టుకింద దీన్ని కనుగొన్నారు. గతంలో పొలానికి కాలువ తవ్వుతుండగా ఇది బయటపడింది. అక్కడి చెట్టుకింద ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ముందు దీన్ని ఉంచారు. కానీ అది నాలుగో శతాబ్దికి చెందిన పురాతన విగ్రహమన్న విషయం స్థానికులకు తెలియదు. తాజాగా ఆ ప్రాంతానికి చెందిన తెలుగు పండితుడు సైదులు ఇచి్చన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, నల్లగొండ చరిత్ర కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ డి.సూర్యకుమార్‌తో కలసి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన ఇటుకల పరిమాణం ఆధారంగా ఈ విగ్రహాన్ని విష్ణుకుండినుల కాలంనాటిదిగా నిర్ధారణకు వచ్చినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. రాతి శిల్పం 10 సెం.మీ. పొడవు, 5 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంతో ఉందని, అమ్మవారు మహిషరూపంలో ఉన్న రాక్షసుడి మెడపై ఎడమకాలితో తొక్కి పట్టి, ఎడమ చేతితో తోకను పట్టుకుని కుడి చేతిలో శూలం, మిగతా రెండు చేతుల్లో శంఖుచక్రాలతో ఉందని పేర్కొన్నారు. చెవి కుండలాలు, తలపై పాగా తరహా కిరీటం, వెనకవైపు గుండ్రటి ప్రభామండలాలతో తెలుగువారి తొలితరం ప్రతిమాలక్షణాలతో ఉందని తెలిపారు. -
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
పానగల్(వనపర్తి): కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమొద్దుల గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ప్రహ్లాద్(27), మల్లమ్మ(22) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి 16 నెలల బాబు అనాథ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పుష్కర ఘాట్ వద్ద కరెంట్ షాక్‌తో భక్తుడు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా పానగల్ పుష్కర ఘాట్ వద్ద ఓ భక్తులు కరెంట్ షాక్ తో మరణించాడు. శనివారం పుష్కర స్నానం చేసేందుకు ఘాట్ వద్దకు వెళుతుండగా అతడికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ విషయాన్ని గమనించిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు మత్రం తెలియరాలేదు. -
సర్వర్ సమస్యను పరిష్కరించాలి
పాన్‌గల్ : తహసీల్దార్ కార్యాలయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యతో రోజుల తరబడి సర్టిఫికెట్లు, ఇతర పత్రాలకోసం తిరుగుతూ రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయరాములుసాగర్ తెలిపారు. మంగళవారం వివిధ గ్రామాలనుంచి ఆర్ఓఆర్, పహాణి, పాస్‌పుస్తకాలకోసం రైతులు ధర్నా నిర్వహించారు. వారికి సంఘీభావం తెలిపిన జయరాములు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతులు పంట పొలాల వివరాలు అన్లైన్లో నమోదు చేయడానికి, పాసు పుస్తకాల కొరతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకుల ద్వారా రుణాల లభించక పెట్టుబడులకు వేచి చూస్తున్నారని తెలిపారు. స్పందించిన ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సర్వర్ సమస్య గురించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, రైతులకు రుణాల మంజూరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. -
అనుమానమే పెనుభూతమై..
దంపతుల మధ్య విభేదాలు.. వేర్వేరు కాపురాలు.. ఇంట్లో ఏ మాత్రం అనారోగ్యం, అస్వస్థత కలిగినా భర్తే మంత్రాలు చేస్తున్నాడని భార్య అనుమానం.. అనుమానమే పెనుభూతమైంది.. మంత్రాలు చేసి ఇంటిళ్లిపాదిని చంపేస్తాడేమోనని భార్యే, భర్త హత్యకు పన్నాగం పన్నింది.. ఇదీ చౌటుప్పల్ మండలం లక్కారం శివారులో, దారుణంగా గొంతు కోసి హత్య చేసి, కాల్చేసి దొరికిన శవం మిస్టరీ. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఉదయం పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు హత్యకేసు వివరాలు వెల్లడించారు. -చౌటుప్పల్ నల్లగొండలోని పానగల్లుకు చెందిన దండిగ లింగయ్య పెద్దకూతురు శాలిగౌరారం మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన సంకటి మల్లేష్(35)తో మొదట వివాహమైంది. కుమారుడు జన్మించాడు. ఈమె అనారోగ్యంతో చనిపోవడంతో, ఈమె సోదరి భారతమ్మ(30)ను ఇచ్చి వివాహం చేశారు. ఈమెకు ఇద్దరు కుమారులు. 2004లో దండిగ లింగయ్య, సంక టి మల్లేష్లు కుటుంబాలతో కలిసి చౌటుప్పల్‌కు వలస వచ్చారు. హనుమాన్‌నగర్‌లో అం తా ఒకేచోట నివాసమున్నారు. 2011లో మల్లేష్ తన మామను కొట్టడంతో, పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. అప్పటి నుంచి మల్లేష్ చౌటుప్పల్‌లోని మల్లికార్జున నగర్లో నివాసముంటున్నాడు. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. భారత మ్మ మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటోంది. మల్లేష్ ఇటీవల నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి దేవాలయంలో నిత్య పూజలు చేస్తూ, జుట్టును ఏపుగా పెంచాడు. భారతమ్మ ఇం ట్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా,అశుభం జరిగినా, మల్లేష్ మంత్రాలు(బాణామతి) చేయడం వల్లే ఇలా జరుగుతుందని ఇంటిళ్లిపా ది అనుకుంటున్నారు. ఈ క్రమంలో భారతమ్మ తన తండ్రి కుటుం బంతో పా టు తనను చేతబడి చేసి, మల్లేష్ చంపుతాడేమోనని అనుమానం పెరిగి పోయింది. ఇటీవల ఆమె తమ్ము డు దండిగ నాగరాజు(20)కు చిన్న ప్రమాదం అయితే, అది చేతబడి వల్లేనని నమ్మారు. దీం తో భారతమ్మ తన భార్త మల్లేష్‌ను అంతం చేయాలని తమ్ముడు నాగరాజుతో కలిసి కుట్రపన్నింది. మల్లేష్ ఇంటికే వస్తానని చెప్పి.. హత్యకు 10రోజుల ముందు నుంచే భారతమ్మ మల్లేష్ ఉంటున్న ఇంటికి సామాను సదురుకొని వస్తానని సంకేతాలిచ్చింది. దీంతో మల్లేష్ ఇరుగుపొరుగు వారికి తన భార్య ఇంటికి వస్తానంటోందని చెప్పాడు. వారు వస్తే తీసుకొచ్చుకొమ్మని చెప్పారు. గత నెల 30వ తేదీన భారతమ్మ తన చిన్న కుమారుడితో కలిసి తాపీమేస్త్రీల అ డ్డాకు వచ్చింది. చిన్నకుమారుడు మల్లేష్‌ను కలి సి తాత, అమ్మ గొడవ పెట్టుకున్నారని, అమ్మ మన ఇంటికి వస్తానంటోంది అని చెప్పాడు. దీం తో మల్లేష్ సామాను తీసుకొచ్చుకుందామని భార్య వెనకాలే, 11గంటల సమయంలో మామ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి రాగానే, కంట్లో కారం కొట్టి రోకలిబండతో తలపై బలంగా కొట్టింది. నాగరాజు బిగ్గరగా పట్టుకున్నాడు. మల్లేష్‌కు మంత్రాలు వస్తాయని, ప్రాణం పోదని, గొంతు లో కాగితాలు ఉంటాయని, అవి తీస్తేనే, ప్రా ణం పోతుందని గొంతు కోశారు. చివరకు ప్రా ణం పోవడంతో, బట్టబొంతలో ముదిరి, గోనే సంచిలో వేచి మూతి కట్టారు. ఇల్లును శుభ్రం చేశారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండ, కత్తిని దూరంగా పడేశారు. శవాన్ని ఇంటిలో నుంచి తీసుకెళ్లేందుకు, నల్లగొండలోని ప్రకాశంబజార్కు చెందిన సమీప బంధువు మున్న శ్రీకాంత్(21)కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆటోను తీసుకొని రాత్రి ఇంటికి రమ్మని చెప్పి ంది. ఆయన తిప్పర్తి మండలం ఖాజిరామారం గ్రామానికి చెందిన షేక్ నయీమ్(21) ఆటోకు అద్దెకు తీసుకొని మంగళవారం రాత్రి 9.30గంటల సమయంలో చౌటుప్పల్‌కు వచ్చాడు. ఆలోపు భారతమ్మ లక్కారం శివారులోని నిర్జన ప్రదేశానికి వెళ్లి, శవాన్ని పడేయాల్సిన చోటును చూసి వచ్చింది. రాత్రిపూట శవాన్ని ఆటోలో వేసుకొని, మృతదేహాన్ని అక్కడ వేసి పెట్రోల్ పోసి కాల్చి వెళ్లిపోయారు. మల్లేష్ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెతుకుతున్నారు. ఈ నెల 2న పోలీసులకు మృతదేహం లభ్యమవడం, అతని జుట్టు ఏపుగా పెరిగి ఉం డడం, స్థానికులు జుట్టు ఏపుగా ఉన్న వ్యక్తి మ ల్లేష్ అని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకొని, విచారించడంతో నేరం అంగీకరించారు. భారతమ్మ, నాగరాజు, శ్రీకాం త్, షేక్ నయీంలను శనివారం రామన్నపేట కోర్టులో హాజరుపరిచా రు. జడ్జి ఆదేశాల మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. ఐడీపార్టీ పోలీసులను సీఐ అభినందించారు. సమావేశంలో ఎస్ఐలు మల్లీశ్వరి, హ రిబాబు, యాదవరెడ్డి, ఈద్దయ్య, యాదగిరి, తి రుపతిరావు, శ్రీనివాస్, సైదులు పాల్గొన్నారు. -
మహాత్మా.. ఇదేమిటయ్యా!
యూనివర్సిటీలో అవినీతి కంపు రూ.కోట్లు వచ్చినా జరగని అభివృద్ధి అడ్డగోలు నిధుల ఖర్చుపై లేని విచారణ సెమినార్, కాన్ఫరెన్స్ హాళ్ల ఇంటీరియర్ డెకరేషన్‌కు కోటి రూపాయలు.. ఒక్క కంప్యూటర్ టేబుల్‌కు రూ.15వేలు.. టెండర్లు లేకుండానే వంద ఏసీల కొనుగోలు.. ఇవీ.. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చోటుచేసుకున్న అవినీతికి మచ్చుతునకలు. ఇదిలా ఉంటే.. నిధుల వరద పెద్దఎత్తున పారినా.. అభివృద్ధి జరిగిందా అంటే అదీ లేదు. 2011 నుంచి నేటికీ ఒక్క నూతన భవనం నిర్మించక పోవడం గమనార్హం. - ఎంజీయూ (నల్లగొండ రూరల్) విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో దివంగత సీఎం వైఎస్సార్.. జిల్లాకు మహాత్మాగాంధీ యూనివర్సిటీని మంజూరు చేశారు. యూనివర్సిటీని జిల్లాకేంద్రం శివారు అన్నెపర్తిలో నెలకొల్పారు. ఎంతో సదాశయంతో ఏర్పాటుచేసిన ఈ యూనివర్సిటీ పేరును దిగజార్చేలా అక్కడ పనులు కొనసాగడం పట్ల మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి వచ్చిన నిధులను సంబంధిత అధికారులు ‘రూ.రెండు లక్షల’ లాజిక్‌ను అడ్డుపెట్టుకుని ఎలాంటి టెండర్లూ లేకుండా అక్రమ బిల్లులు పెట్టి స్వాహాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు మాత్రం ఖర్చు అవుతున్నాయి. కానీ 2011 నుంచి నేటికీ ఒక్క నూతన భవనం నిర్మించకపోవడంతో ఎలాంటి కొత్త కోర్సులు రావడం లేదు. ఉన్న కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. పానగల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్, ల్యాబ్, తరగతి గదులు లేకపోవడంతో అసౌకర్యాల నడుమే చదువుకుంటున్నారు. 2007లో యూనివర్సిటీ ఏర్పాటు... వెనుకబడిన జిల్లాగా భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2007లో యూనివర్సిటీని మంజూరు చేశారు. పానగల్లులో పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2008లో మహాత్మాగాంధీ యూనివర్సిటీగా పేరు ప్రకటించారు. ఆ తర్వాత అన్నెపర్తిలో 249 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.10 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న భవనాలు ఇవీ.. సైన్స్ బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్, బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ భవనాలను 2008 నుంచి 2011 వరకు పూర్తి చేశారు. పునాది దశలోనే సెంట్రల్ లైబ్రరీ.. 2011 నుంచి నేటి వరకు ఒక్క కొత్త భవనం నిర్మించలేదు. అప్పటి వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి కొత్త భవనాలు నిర్మించలేదు. 2011లో సెంట్రల్ లైబ్రరీ కోసం శంకుస్థాపన చేశారు. ఇక పునాది స్థాయిలో పిల్లర్లు వేసి వదిలేశారు. ఇవీ.. వచ్చిన నిధులు 2013-14లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్) 12వ ప్రణాళిక కింద : రూ.7.50 కోట్లు యూజీసీ 12 ‘బీ’ కింద : రూ.7 కోట్ల 50 లక్షలు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వచ్చినవి రూ.3 కోట్లకు పైగా.. 12వ ప్లాన్ కింద రూ. 7. 50 కోట్లు (వీటిని ఐదు సంవత్సరాల కాలంలో మౌలిక వసతులకు ఉపయోగించాలి) మెరుగులు దిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు... పై పై మెరుగులు దిద్దే పనులకు యూనివర్సిటీ అధికారులు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఎక్కువ బిల్లులను చూపుతూ అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ, రిజిస్ట్రార్ చాంబర్ల ఆధునికీకరణకు లక్షల రూపాయల బిల్లులు పెట్టి కొంత నొక్కేశారని, సైన్స్ బ్లాక్‌లో తాత్కాలిక లైబ్రరీని ఏర్పాటు చేసి నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. ఆర్ట్స్ బ్లాక్‌లోని సెమినార్ హాల్‌తో పాటు కాన్ఫరెన్స్ హాల్‌కు ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ.కోటి ఖర్చు చేయడం చూస్తుంటే అధికారుల అక్రమ బిల్లుల బాగోతం ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక.. కంప్యూటర్‌కు సంబంధించిన ఒక్క టేబుల్‌కు రూ.15 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం 100 ఏసీలు కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. టెండర్ ఏదీ? యూనివర్సిటీలో చేపట్టే పనులకు ఎలాంటి టెండర్ లేకుండా కంప్యూటర్ టేబుళ్లు, ల్యాబ్ సామగ్రి, లైబ్రరీ సామగ్రి, ఏసీలు, టేబుళ్లు కొనుగోలు చేశారు. వచ్చిన నిధుల్లో చేతివాటం ప్రదర్శించేందుకు వారం, 10 రోజులకు ఒకసారి సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. రూ. 2లక్షలు దాటితే టెండర్ పిలవాల్సిన నిబంధన ఉండడంతో రూ.2 లక్షలు మించకుండా నిధులను ఖర్చు చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవీ.. అసంపూర్తి పనులు యూనివర్సిటీకి నిధుల వరద పారినా.. యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ, సైన్స్బ్లాక్లోని సెమినార్ హాల్, మొదటి, రెండవ ఫ్లొర్లోని అసంపూర్తి గదులు, స్పోర్ట్స్ గ్రౌండ్, అంతర్గత రోడ్ల కోసం కంకరపోసి రెండేళ్లు గడిచినా తట్టెడు పని జరగలేదు. ఔట్సోర్సింగ్, రెగ్యులర్ నియామకాలపై విచారణ పెండింగ్‌లో ఉంది. యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై ప్రస్తుత వీసీ దృష్టి సారించాల్సిన అవసరముందని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. ఖర్చుల విషయం నాకు తెలియదు యూనివర్సిటీకి గతంలో వచ్చిన నిధులకు సంబంధించిన ఖర్చుల విషయం నాకు తెలియదు. రూ.140 కోట్లు కావాలని 14వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు ఇచ్చాం. రూ.40 కోట్లు ఇంజినీరింగ్ కోసం, మరో రూ.40 కోట్ల యూనివర్సిటీ వ్యవహరాలకు ఖర్చు చేస్తాం. కొత్త భవనాలు, కొత్త కోర్సులు తీసుకురావాల్సి ఉంది. - నరేందర్‌రెడ్డి, రిజిస్ట్రార్